Asianet News TeluguAsianet News Telugu

44ఎంపి సెల్ఫీ కెమెరా, 5జి సపోర్ట్ తో వివో వి సిరీస్ కొత్త ఫోన్.. లాంచ్ ఎప్పుడంటే ?

వివో కంపెనీ తాజాగా వి సిరీస్ కింద ఒక కొత్త స్మార్ట్ ఫోన్ తీసురానుంది. 44  మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాతో వస్తున్న ఈ ఫోన్ ని ఒకేసారి ఇండియాతో పాటు మలేషియాలో  లాంచ్ చేయనున్నారు.
 

vivo v21 coming to india on april 27 with a 44mp selfie camera and 5g support
Author
Hyderabad, First Published Apr 17, 2021, 6:37 PM IST

చైనా టెక్నాలజి కంపెనీ వివో తాజాగా  వి సిరీస్ కొత్త ఫోన్ వివో వి21ని భారతదేశంలో త్వరలోనే లాంచ్ చేయనుంది.  దీనికి సంబంధించి  కంపెనీ అధికారికంగా ధృవీకరించనప్పటికి  భారత్‌లో ఏప్రిల్ 27న లాంచ్ చేయనున్నట్లు  సమాచారం.

వివో వి21 గత ఏడాది భారతదేశంలో లాంచ్ అయిన వివో వై20కి అప్‌గ్రేడ్ వెర్షన్ గా వస్తుంది. ఇండియాలో లాంచ్ చేయడంతో పాటు ఈ ఫోన్ ని మలేషియాలో కూడా లాంచ్ చేయనున్నారు.

వివో వి21 ఫీచర్స్ గురించి అధికారిక సమాచారం అందుబాటులో లేదు. కానీ లీక్ అయిన నివేదిక ప్రకారం ఈ ఫోన్‌కు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 44 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా అందించారు. సెల్ఫీ కెమెరాతో ఆటో ఫోకస్ కూడా ఉంటుంది. ఈ ఫోన్‌ను రూ .25 వేల ధర పరిధిలో లాంచ్ చేయవచ్చు అని భావిస్తున్నారు.

also read ఫ్లిప్‌కార్ట్ కార్నివల్ సేల్: ఈ 8 స్మార్ట్‌ఫోన్‌లపై భారీ తగ్గింపు.. కొద్దిరోజులే అవకాశం.. ...

వివో ఇంతకుముందు కూడా దాని అన్నీ స్మార్ట్‌ఫోన్‌లలో ఆటో ఫోకస్ ఇచ్చింది. అలాగే వివో వి20ప్రోలో కూడా  44 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. అయితే దీనికి డ్యూయల్ లెన్స్ ఉంది. కానీ వివో వి21లో సింగిల్ లెన్స్ లభిస్తుంది. 

వివో వి21 ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌లో  64 మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌కు సపోర్ట్ చేస్తుంది. మిగతా రెండు లెన్స్‌ల గురించి ప్రస్తుతం సమాచారం లేదు. ఈ ఫోన్‌లో ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఫన్‌టచ్ ఓఎస్ 11 లభిస్తుంది. అలాగే 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ అందించారు. ఫోన్‌లో 5జీకి సపోర్ట్ కూడా ఉంటుంది.  

Follow Us:
Download App:
  • android
  • ios