ఏటిఎం కార్డ్ లేకుండా యూపిఐ యాక్టివేట్ చేయాల.. అయితే ఫోన్ పే ఈ సదుపాయాన్ని అందిస్తుంది..
ఫోన్ పే ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్ యూజర్లతో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్ యాప్. ఇప్పుడు మీరు ఏటిఎం కార్డ్ వివరాలు లేకుండా ఆధార్ కార్డ్ సహాయంతో యూపిఐ యాక్టివేషన్ పూర్తి చేయవచ్చు.
సాధారణంగా ఎవరికైనా డబ్బులు పంపించాలంటే డిజిటల్ పేమెంట్ యాప్స్ ఉపయోగిస్తాము. అందులో ఒకటి ఫోన్ పే. ఫోన్ పే ప్రస్తుతం 350 మిలియన్ల మంది రిజిస్టర్ యూజర్లతో అత్యంత ప్రజాదరణ పొందిన ఇన్స్టంట్ డిజిటల్ పేమెంట్ యాప్. ఈ యాప్ సౌకర్యమైన యూపిఐ ట్రాన్సాక్షన్స్ ప్రాసెస్ తో పాటు ఎప్పుడైనా బ్యాంక్ అక్కౌంట్ ను డిజిటల్‌గా నిర్వహించడానికి ఇంకా యాక్సెస్ చేయడానికి యూజర్లకు అనుమతిస్తుంది. యూజర్లకు యూపిఐ యాక్టివేషన్ కోసం మరింత సౌలభ్యాన్నిస్తూ PhonePe ఇప్పుడు ఆధార్ కార్డ్‌ని ఉపయోగించి ఓటిపి అతేంటికేషన్ ప్రాసెస్ అందించింది. అంటే, ఇప్పుడు మీరు ఏటిఎం కార్డ్ వివరాలు లేకుండా ఆధార్ కార్డ్ సహాయంతో యూపిఐ యాక్టివేషన్ పూర్తి చేయవచ్చు.
గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే వంటి ఇన్‌స్టంట్ డిజిటల్ పేమెంట్ ప్లాట్‌ఫారమ్‌లలో యూపిఐ యాక్టివేషన్‌కు ఓటిపి అతేంటికేషన్ ప్రాసెస్ కోసం డెబిట్ కార్డ్ వివరాలను అందించడం కూడా అవసరం, తర్వాత యూజర్లు UPI పిన్‌ను కూడా సెట్ చేసుకోవచ్చు.
అయితే, ఈ ప్రాసెస్ డెబిట్ కార్డ్‌లు లేని భారతీయ బ్యాంక్ కస్టమర్లకు రిజిస్ట్రేషన్ యాక్సెస్‌ను పరిమితం చేసింది. ఇప్పుడు యూపిఐ యాక్టివేషన్ కోసం కొత్త ఆధార్ ఓటిపి అతేంటికేషన్ తో యూపిఐ ఏకొ సిస్టమ్ లో భాగం కావచ్చు.
మీరు కొత్త యూజర్ అయితే అండ్ మీ ఆధార్ కార్డ్ సహాయంతో యూపిఐని సెటప్ చేయాలనుకుంటే, మీరు ఈ స్టెప్స్ అనుసరించాలి.
*ముందుగా మీరు గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి ఫోన్ పే ని డౌన్‌లోడ్ చేసుకోవాలి.
*ఇప్పుడు ఫోన్ పే ని తెరిచి అందులో మీ మొబైల్ నంబర్ అండ్ ఓటిపిని ఎంటర్ చేయాలి.
*తరువాత మై మనీ పేజీకి వెళ్లి ఇక్కడ నుండి పేమెంట్ పద్ధతులపై నొక్కండి.
*ఇక్కడ మీరు యాడ్ న్యూ బ్యాంక్ ఎంపికను చూస్తారు, దాన్ని నొక్కండి.
*ఇప్పుడు మీకు యూపిఐ యాక్టివేషన్ కావాల్సిన బ్యాంక్‌ని సెలెక్ట్ చేసుకోండీ. మీ మొబైల్ నంబర్ తప్పనిసరిగా బ్యాంకులో రిజిస్టర్ చేసి ఉండాలి అని గుర్తుంచుకోండి.
*దీని తర్వాత ఫోన్ పే మీ బ్యాంక్ అక్కౌంట్ వివరాలను తనిఖీ చేస్తుంది, యూపిఐ అక్కౌంట్ కి లింక్ చేస్తుంది.
*ఇప్పుడు మీరు డెబిట్/ఏటిఎం కార్డ్ లేదా ఆధార్ కార్డ్‌తో ప్రాసెస్ పూర్తి చేయమని అడుగుతుంది. ఇక్కడ మీరు ఆధార్ కార్డుతో అని ఆప్షన్ ఎంచుకోవాలి.
*ఇప్పుడు మీరు ఆధార్ కార్డ్‌లోని చివరి ఆరు అంకెలను ఎంటర్ చేసి, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటిపిని ఎంటర్ చేయాలి.
*OTPని ఎంటర్ చేసిన తర్వాత మీరు యూపిఐ పిన్‌ని సెట్ చేయాలి, దీంతో మీ PhonePe UPI పూర్తవుతుంది.