ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న కూల్ ఫీచర్‌తో వాట్సాప్: వాటిని సైలెన్స్ చేయవచ్చు..
ఈ ఫీచర్ త్వరలో విడుదల చేయబడుతుందని భావిస్తున్నారు. ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత, యాప్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా యూజర్లు “సైలెన్స్ అన్నోన్ కాలర్స్” ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు.
స్పామ్ కాల్స్ తో విసిగి పోయిన వారికి వాట్సాప్ గుడ్ న్యూస్ చెప్పింది. 'సైలెన్స్ అన్నోన్ కాలర్స్' అనే కొత్త ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో పరిచయం చేయనుంది. ఈ కొత్త ఫీచర్‌తో సేవ్ చేయని నంబర్‌లు లేదా తెలియని కాంటాక్ట్స్ నుండి వచ్చే కాల్స్ ని మ్యూట్ చేయవచ్చు.
ఈ ఫీచర్ ప్రస్తుతం వాట్సాప్ ఆండ్రాయిడ్ కోసం డెవలప్ చేయబడుతోంది. దీనిని త్వరలో డెవలపర్‌ల కోసం బీటా వెర్షన్ ను విడుదల చేయనుంది. ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తర్వాత యాప్ సెట్టింగ్‌లకు వెళ్లడం ద్వారా యూజర్లు “సైలెన్స్ అన్నోన్ కాలర్స్” ఫీచర్‌ను ఆన్ చేయవచ్చు. ఫీచర్ యాక్టివేట్ అయిన తర్వాత తెలియని నంబర్‌ల నుండి వచ్చే అన్ని కాల్స్ సైలెంట్ చేయబడతాయి. కానీ నోటిఫికేషన్ అందుకోవడం కొనసాగుతుంది.
అలాగే యూజర్లు వాట్సాప్ యాప్ స్క్రీన్‌ను స్ప్లిట్ చేసుకోవడానికి మరో ఫీచర్ కూడా త్వరలో రాబోతోంది. కొత్త స్ప్లిట్ స్క్రీన్ మోడ్‌తో, వినియోగదారులు ఏకకాలంలో రెండు విండోలను చూడవచ్చు, అంటే చాట్ లిస్ట్, చాట్ విండో, కాల్స్ లేదా స్టేటస్ ట్యాబ్‌లు. దీని ద్వారా యూజర్లు వాట్సాప్‌లో రెండు వేర్వేరు విండోస్ ఒకేసారి చూడవచ్చు ఇంకా ఉపయోగించుకోవచ్చు.
పంపిన మెసేజ్‌ను 15 నిమిషాల్లో ఎడిట్ చేసే ఫీచర్‌తో వాట్సాప్ రాబోతోందని గతంలో వార్తలు వచ్చాయి. టెలిగ్రామ్‌లో మెసేజ్‌లను ఎడిట్ చేసుకునే సదుపాయాన్ని యాపిల్ ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. దీనిని 'వాట్సాప్ బీటా ఇన్ఫో' షేర్ చేసింది. WaBeta ఇన్ఫో ఈ కొత్త ఫీచర్‌ను WhatsApp 23.4.0.72 iOS బీటా వెర్షన్‌లో గుర్తించింది. WhatsApp ఒక ప్రముఖ మెసేజింగ్ అప్లికేషన్. ఈ యాప్‌కు 200 కోట్ల మందికి పైగా యూజర్లు ఉన్నారు. అప్‌డేట్‌లను పొందుతున్న యాప్‌లలో ఈ యాప్ కూడా ఒకటి.