Asianet News TeluguAsianet News Telugu

టెస్లా అధినేత చేతికి ట్విట్టర్‌.. సి‌ఈ‌ఓతో సహ ఎగ్జిక్యూటివ్‌ల తొలగింపు..: రిపోర్ట్

టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ ట్విటర్ కొనుగోలు గడువు కంటే ముందు దాని కొత్త అధినేత అయ్యారు. ఓ వార్తా నివేదిక ప్రకారం, ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొత్త బాస్  అయిన తర్వాత ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) నెడ్ సెగల్‌లను తొలగించారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా  తొలగించినట్లు సమాచారం.

Twitter CEO Parag Agrawal terminated  As Elon Musk Takes Over Company: Reports
Author
First Published Oct 28, 2022, 10:27 AM IST


ప్రపంచంలోని ప్రముఖ మైక్రో-బ్లాగింగ్ యాప్ ట్విట్టర్ ని ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత సంపన్నుడైన ఎలోన్ మస్క్‌ సొంతం చేసుకున్నాకా, ట్విట్టర్ సీఈవో పరాగ్ అగర్వాల్‌తో సహా పలువురు ఉన్నతాధికారులను తొలగించారు. 

టెస్లా సి‌ఈ‌ఓ ఎలోన్ మస్క్ ట్విటర్ కొనుగోలు గడువు కంటే ముందు దాని కొత్త అధినేత అయ్యారు. ఓ వార్తా నివేదిక ప్రకారం, ఎలోన్ మస్క్ ట్విట్టర్ కొత్త బాస్  అయిన తర్వాత ట్విట్టర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) పరాగ్ అగర్వాల్, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ (CFO) నెడ్ సెగల్‌లను తొలగించారు. ట్విట్టర్ హెడ్ క్వార్టర్స్ నుంచి కూడా  తొలగించినట్లు సమాచారం. తొలగించిన టాప్ ఎగ్జిక్యూటివ్‌లలో ట్విట్టర్ లీగల్ టీమ్ చీఫ్ విజయ గద్దె కూడా ఉన్నారు. 

ట్విట్టర్ కొనుగోలుకు ముందు ఎలోన్ మస్క్ అండ్ పరాగ్ అగర్వాల్ మధ్య మాటల యుద్ధం చోటుచేసుకుంది. ఈ కారణంగానే ట్విట్టర్ సోషల్ మీడియా సైట్‌ని సొంతం చేసుకున్న వెంటనే ఎలోన్ మస్క్ మొదట వారిని తొలగించారని తెలుస్తుంది. మీడియా నివేదికల ప్రకారం ట్విట్టర్‌తో ఎలోన్ మస్క్ ఒప్పందం పూర్తయిన సమయంలో అప్పటి సి‌ఈ‌ఓ పరాగ్ అగర్వాల్, సెగల్ ట్విట్టర్ కార్యాలయంలో ఉన్నారని కానీ కొద్దిసేపటికే ట్విటర్‌ హెడ్‌క్వార్టర్స్‌ నుంచి పరాగ్ అగర్వాల్, సెగల్ బయటకు వచ్చేశారని చెబుతున్నారు.

ఏప్రిల్‌లో కొనుగోలు ప్రకటన 
ఎలోన్ మస్క్ ఈ ఏడాది ఏప్రిల్ 13న ట్విట్టర్‌ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు. అప్పట్లో అతను ఒక్కో షేరుకు $54.2 చొప్పున $44 బిలియన్లకు డీల్‌ ఆఫర్ చేశాడు. అయితే, ట్విట్టర్  ఫెక్ అక్కౌంట్స్ కారణంగా ట్విట్టర్ ఇంకా ఎలోన్ మస్క్ మధ్య విభేదాలు వచ్చాయి దీంతో జూలై 9న ఈ ఒప్పందం నుండి వైదొలగాలని ఎలోన్ మస్క్ నిర్ణయించుకున్నారు.

దీని తర్వాత ట్విట్టర్ అమెరికా కోర్టులో ఎలోన్ మస్క్‌పై కేసు వేసింది. దీనిపై డెలావేర్ కోర్టు ట్విట్టర్ డీల్‌ను అక్టోబర్ 28లోగా పూర్తి చేయాలని ఆదేశించింది.  

ఎలోన్ మస్క్ ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తొలిరోజే ట్విట్టర్ క్షమాపణలు చెప్పాల్సి వచ్చిందని విచారం వ్యక్తం చేశారు. ఏంటంటే అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఓ ఫేక్ ట్వీట్ బయటికి వచ్చింది. ఇందులో ఎలోన్ మస్క్ ట్విటర్ కొనుగోలుపై  డొనాల్డ్ ట్రంప్ అభినందనలు తెలుపుతూ ఉంది. ఇది ఫెక్ ట్వీట్ గా గుర్తించిన వెంటనే ఈ ఫేక్ స్టేట్‌మెంట్ పై  క్షమించండి అంటూ ట్విట్టర్ ఒక ప్రకటన కూడా విడుదల  చేసింది. 

Follow Us:
Download App:
  • android
  • ios