ఇంటర్నెట్‌లో మీ పిల్లలను సురక్షితంగా ఉంచడానికి ఈ ఈజీ టిప్స్ ప్రయత్నించండి..

ఈ రోజుల్లో పేరెంటల్ కంట్రోల్ సదుపాయం గూగుల్‌తో పాటు యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ వంటి చాలా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. మీ పిల్లలు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్‌లపై నియంత్రణను ఉంచడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు. 
 

Try these easy ways to keep your kids safe on the Internet

నేటి డిజిటల్ ప్రపంచంలో సీనియర్ సిటిజన్ల నుండి చిన్న పిల్లలతో సహా దాదాపు ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌ ఉపయోగిస్తున్నారు. ఇంటర్నెట్‌లో  పిల్లలు సాధారణంగా ఆన్‌లైన్ వీడియోలు లేదా యూట్యూబ్‌లో కార్టూన్‌లు మొదలైనవి వారి వయస్సుకి సంబంధించిన కంటెంట్‌ను చూడటానికి ఇష్టపడతారు. అయితే, ఇంటర్నెట్‌లో చాలా రకాల కంటెంట్ ఉంటుంది, ఇవి పిల్లలను తప్పుదారి పట్టించేలా చేస్తుంది. అంటే, పిల్లల ఇంటర్నెట్ ఉపయోగంపై నిఘా ఉంచడం,  సురక్షితమైన పద్ధతులను అనుసరించడం చాలా ముఖ్యం. మీరు కూడా మీ పిల్లలను తప్పు కంటెంట్ నుండి రక్షించడానికి  కొన్ని టిప్స్ మీకోసం..

తల్లిదండ్రుల నియంత్రణ
ఈ రోజుల్లో పేరెంటల్ కంట్రోల్ సదుపాయం గూగుల్‌తో పాటు యూట్యూబ్ అండ్ ఇన్‌స్టాగ్రామ్ వంటి చాలా ప్లాట్‌ఫారమ్‌లలో అందుబాటులో ఉంది. మీ పిల్లలు క్రమం తప్పకుండా ఉపయోగించే యాప్‌లపై నియంత్రణను ఉంచడానికి మీరు దీన్ని ఉపయోగించవచ్చు. 

ఇంటర్నెట్ సెక్యూరిటి గురించి 
ఈ విషయం చాలా ముఖ్యమైనది, ఎందుకంటే పిల్లల పై నిఘా ఉంచడం అంత తేలికైన పని కాదు. ఇంటర్నెట్‌లో ఉన్న ప్రమాదాల గురించి పిల్లలకు తెలియజేయడం అలాగే ఇంటర్నెట్‌ను ఉపయోగించడానికి సరైన మార్గాల గురించి వారికి అవగాహన కల్పించడం అవసరం. దీనితో పాటు ఆన్‌లైన్ పేమెంట్స్ అండ్ మాల్వేర్ వార్నింగ్స్ గురించి పిల్లలకు అవసరమైన సమాచారాన్ని కూడా అందించాలి. 

ప్రత్యేక ఇ-మెయిల్ ఐడి
మీరు పిల్లల కోసం ప్రత్యేక ఇ-మెయిల్ IDని కూడా క్రియేట్ చేయవచ్చు, దీని ద్వారా వెబ్‌లో బ్రౌజ్ చేస్తున్నప్పుడు అనవసరమైన యాడ్స్ నివారించవచ్చు. దీనితో పాటు మీరు మీ పిల్లలు ఎలాంటి కంటెంట్‌ని చూస్తున్నారు ఇంక్ సెర్చ్ చేస్తున్నారు అనే వాటి గురించి కూడా ఖచ్చితమైన సమాచారాన్ని పొందవచ్చు.  మీరు కొత్త ఇ-మెయిల్ IDతో బ్రౌజర్ సహాయంతో సేఫ్ కానీ కాని వెబ్‌సైట్‌లు ఇంకా కుక్కీలను కూడా క్లోజ్ చేయవచ్చు . 

డివైజ్ రిఫ్రెష్ గా ఉంచండి
పిల్లలు ఇంటర్నెట్‌ను ఉపయోగిస్తున్న డివైజెస్లను వైరస్‌ అండ్ మాల్‌వేర్‌ల నుండి రక్షించడానికి వాటిని అప్‌డేట్ చేయడం చాలా ముఖ్యం. దీని ద్వారా  మీరు డివైజెస్ తో  పాటు పిల్లల బ్రౌజింగ్‌ను సేఫ్ గా ఉంచొచ్చు. ఈ అప్‌డేట్స్ ఇంటర్నెట్‌లో మీ అక్కౌంట్ ఇంకా ఏదైనా ముప్పు నుండి మిమ్మల్ని సేఫ్ గా ఉండేల చేస్తాయి.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios