కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి చెందినప్పటి నుండి ప్రపంచంలో చాలా మార్పులు వచ్చాయి. ఎన్నడూ లేని చాలా విషయాలు, కొత్త అలవాట్లు వచ్చి చేరాయి. ఈ కరోనా  మహమ్మారి వ్యాప్తితో చాలా మంది ప్రజలు ఫేస్ మాస్కులతో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఫేస్ మాస్క్ ధరించే వారిలో ఐఫోన్ వినియోగదారులు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య ఏంటంటే ఫేస్ ఐడితో ఐఫోన్‌ను అన్‌లాక్ చేయలేకపోవడం.

అయితే  ఆపిల్ కొత్త ఐఫోన్‌లో ఫేస్ ఐడికి సంబంధించి ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది అంటే ఐఫోన్ 13లో టచ్ ఐడితో తిరిగి రాబోతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇన్-డిస్‌ప్లే టచ్ ఐడిని ఐఫోన్ 13లో   తీసుకురానుంది.

also read రెడ్‌మి నోట్ 10కి పోటీగా త్వరలో రియల్‌మీ కొత్త సిరీస్‌.. 108 మెగాపిక్సెల్ కెమెరాతో లాంచ్.. ...

ఫేస్ ఐడితో పాటు  టచ్ ఐడి రెండూ కూడా ఐఫోన్ 13లో సపోర్ట్ చేయనున్నాయి. ఈ ఫీచర్ ప్రవేశపెట్టిన తరువాత ఫేస్ మాస్క్ ద్వారా అన్‌లాక్‌తో వచ్చే సమస్య తొలగిపోనుంది. ఆపిల్ సంస్థ 2017లో ఐఫోన్‌లో  టచ్ ఐడిని తొలగించి ఫేస్ ఐడితో ఐఫోన్ ఎక్స్‌ను తొలిసారిగా లాంచ్ చేసింది. ఆపిల్ ఐఫోన్ 13లో  అండర్ గ్లాస్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుందని బార్క్లేస్ రిసెర్చ్ పేర్కొంది.

అంతకుముందు ఆపిల్  ప్రసిద్ధ విశ్లేషకుడు మింగ్ చి కుయో కూడా ఆపిల్ కొత్త ఐఫోన్‌లో టచ్ ఐడిని తిరిగి తీసుకురాబోతున్నట్లు చెప్పారు. ఫేస్ ఐడితో పాటు టచ్ ఐడిని ఐఫోన్ 13 సిరీస్ అన్ని మోడళ్లలో  తీసుకురానున్నారు. ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లో ఇన్-డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ గత కొన్నేళ్లుగా అందుబాటులో ఉంది.