ఐఫోన్ కి పోటీగా బిగ్ కెమెరాతో మార్కెట్లోకి కొత్త ఫోన్.. స్పెషల్ ఫీచర్స్ ఎంతో తెలుసా..?
లైకా లిట్జ్ ఫోన్ 2 లైకా వైట్ కలర్‌లో పరిచయం చేసారు. 12జిబి ర్యామ్ 512జిబి స్టోరేజ్ ధర JPY 225,360 అంటే దాదాపు రూ. 1,28,000.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లైకా ఫ్లాగ్‌షిప్ ప్రీమియం ఫోన్ లైకా లిట్జ్ ఫోన్ 2ని లాంచ్ చేసింది. ఈ ఫోన్ జపాన్‌లో మొదట లాంచ్ చేయబడింది. లైకా ఫోన్ 1 సక్సెస్ తరువాత ఈ ఫోన్ పరిచయం చేయబడింది. లైకా లిట్జ్ ఫోన్ 2 12జిబి ర్యామ్, 512జిబి స్టోరేజ్‌తో పరిచయం చేసారు. ఈ ఫోన్ స్నాప్ డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ అండ్ 6.6-అంగుళాల వెడల్పు UXGA + డిస్ ప్లేకి సపోర్ట్ ఇస్తుంది. ఈ ఫోన్‌తో 5,000mAh బ్యాటరీ సపోర్ట్ అందించారు.
లైకా లిట్జ్ ఫోన్ 2 ధర
లైకా లిట్జ్ ఫోన్ 2 లైకా వైట్ కలర్‌లో పరిచయం చేసారు. 12జిబి ర్యామ్ 512జిబి స్టోరేజ్ ధర JPY 225,360 అంటే దాదాపు రూ. 1,28,000. ఇప్పటివరకు ఈ ఫోన్ గ్లోబల్ లాంచ్ గురించి కంపెనీ ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. అయితే లిట్జ్ ఫోన్ 1 సుమారు రూ. 1,25,800 ధరతో గత సంవత్సరం సిల్వర్ కలర్ లో ప్రవేశపెట్టారు.
లైకా లిట్జ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్‌లు
లైకా లిట్జ్ ఫోన్ 2 1260x2730 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 6.6-అంగుళాల UXGA+ IGZO OLED డిస్‌ప్లే, 2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ అండ్ 240Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఇంకా డాల్బీ విజన్ సపోర్ట్ డిస్‌ప్లేతో రానుంది. లైకా లీట్జ్ ఫోన్ 2 ఆండ్రాయిడ్ 12తో, ఆక్టా కోర్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్ సపోర్ట్ ఉంది. 12జిబి ర్యామ్ అండ్ 512జిబి స్టోరేజ్ అందించారు. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజీని 1టిబి వరకు పెంచుకోవచ్చు. ఫోన్‌తో వాటర్ రెసిస్టెన్స్ కోసం 1PX8 రేటింగ్ పొందింది. ఫోన్‌లో ఫింగర్‌ప్రింట్ సెన్సార్ అండ్ సెక్యూరిటీ కోసం ఫేస్ అన్‌లాక్ రెండింటికీ సపోర్ట్ ఉంది.
లైకా లీట్జ్ ఫోన్ 2 కెమెరా అండ్ బ్యాటరీ
లైకా లీట్జ్ ఫోన్ 2లో 47.2 మెగాపిక్సెల్ కెమెరా ఎఫ్ / 1.9 ఎపర్చరు అండ్ మరో కెమెరా 12.6 మెగాపిక్సెల్ ఉంది. ఫోన్‌తో సెల్ఫీ కోసం 12.6 మెగాపిక్సెల్ కెమెరా, 5,000mAh బ్యాటరీ ఇచ్చారు. బ్యాటరీకి సంబంధించి 440 గంటల స్టాండ్‌బై టైమ్ ఇస్తుందని కంపెనీ పేర్కొంది. ఫోన్‌తో యూఎస్‌బి టైప్-సి ఛార్జింగ్ సపోర్ట్, 5G, 4G LTE, Wi-Fi ఇంకా బ్లూటూత్ v5.2 కనెక్టివిటీ ఇచ్చారు.