ప్రస్తుతం సమ్మర్ సీజన్ కొనసాగుతుంది. ఎండలు మండిపోతున్నాయి, ఈ వేడి నుండి రిలీఫ్ కలిగించేందుకు  ఫ్లిప్‌కార్ట్‌లో అన్యువల్  సమ్మర్ సేల్‌ను ప్రకటించారు. ఈ సేల్‌లో మీరు ఎయిర్ కండీషనర్ల నుండి రిఫ్రిజిరేటర్ల వరకు అన్నింటిపై భారీ డిస్కౌంట్స్  పొందవచ్చు. 

ఇ-కామర్స్ వెబ్‌సైట్ ఫ్లిప్‌కార్ట్ అన్యువల్ సమ్మర్ సేల్‌ను ప్రకటించింది. ఈ సారి ఎయిర్ కండీషనర్ (ఏసీ), రిఫ్రిజిరేటర్, ఎయిర్ కూలర్, ఫ్యాన్స్ వంటి హోమ్ అప్లియన్సెస్ పై భారీ డిస్కౌంట్స్ లభిస్తున్నాయి. Flipkart ఈ సేల్ ఏప్రిల్ 17 నుండి ఏప్రిల్ 23 వరకు కొనసాగుతుంది. ఇ-కామర్స్ మార్కెట్‌ప్లేస్ సూపర్ కూలింగ్ డేస్ 2024 ఆరవ ఎడిషన్‌లో హోమ్ అప్లియన్సెస్ పై సూపర్ డీల్స్ పొందుతాయని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. అలాగే, ఈ సేల్‌లో బ్రాండ్, కస్టమర్ అవసరాలు, బడ్జెట్‌కు అనుగుణంగా కూలింగ్ డివైజెస్ సెలక్షన్ ఫ్లిప్‌కార్ట్ అందిస్తుంది.

డిస్కౌంట్స్ దీనిపై అంటే ?

మీరు ఇండియాలోని బెస్ట్ రిఫ్రిజిరేటర్‌లు, ACలు, ఫ్యాన్స్ చూడవచ్చు. అదే సమయంలో సూపర్ కూలింగ్ డేస్ లో సూపర్ ఎఫెక్టివ్ ఎనర్జీ సేవింగ్ డివైజెస్ కొనేందుకు అవకాశం ఉంటుంది. ఈ ఉత్పత్తుల ధర రూ.1299 నుంచి ప్రారంభమవుతాయి. దీంతో క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు, కొత్త ఆఫర్‌లతో సహా పలు ఆఫర్లను కస్టమర్లు పొందుతారు. కస్టమర్లు నో-కాస్ట్ EMI, డౌన్ పేమెంట్, క్యాష్ ఆన్ డెలివరీ, ఫ్లిప్‌కార్ట్ పే లేటర్ EMI పేమెంట్ అప్షన్స్ పొందుతారు.

ఈ బ్రాండ్ల ఉత్పత్తులపై డిస్కౌంట్లు 

Samsung, LG, Whirlpool, Haier, Godrej, IFB వంటి అనేక బ్రాండ్‌లు ఈ సేల్‌లో ఉంటాయి. రిఫ్రిజిరేటర్‌లో సింగిల్ డోర్, సైడ్ బై సైడ్ డోర్, బాటమ్ మౌంట్, ఫ్రాస్ట్ ఫ్రీ, ట్రిపుల్ డోర్ రిఫ్రిజిరేటర్‌లు అందుబాటులో ఉంటాయి. వీటి ధర రూ.9 వేల 990 నుంచి రూ.2 లక్షల వరకు ఉంటుంది.

ఏసీలో ఎల్‌జీ, వోల్టాస్, గోద్రెజ్, డైకిన్, పానాసోనిక్, బ్లూ స్టార్ వంటి పెద్ద బ్రాండ్‌లు సేల్‌లో అందుబాటులో ఉంటాయి. వీటి ధర రూ.25 వేల నుంచి రూ.65 వేల వరకు ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, సీలింగ్ ఫ్యాన్లు రూ.1299 నుండి రూ.15000 ధరలలో ఉంటాయి.