"ఇండియాని వొదిలి వెళ్లాలనేది నా కల" అని అన్న అమ్మాయి పై ట్రోల్స్.. పట్టించుకోవద్దు అంటూ సీఈఓ జాబ్ ఆఫర్..

ట్రూకాలర్ సీఈఓ అలాన్ మామెడి 'భారత్‌ను విడిచిపెట్టాలని నా కల' అన్నందుకు ట్రోల్ చేయబడిన కెనడియన్ విద్యార్థికి తన సపోర్ట్ అందించారు.

Student Trolled For "Dream To Leave India" Remark Gets Job Offer From Truecaller CEO-sak

ప్రస్తుతం కెనడాలో విద్యార్థినిగా ఉన్న ఓ భారతీయ యువతి తాజాగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వీడియోలో కనిపించి, భారత్‌ను విడిచిపెట్టి విదేశాల్లో ఉద్యోగం చేయడం తన ఆశయమని చెప్పడంతో ఆమెపై చాలా ట్రోలింగ్‌లు మొదలయ్యాయి. ఆన్‌లైన్‌లో జరిగిన ఈ చర్చ ఆమెను వైరల్ సెన్సేషన్‌గా మార్చింది దింతో ఇప్పుడు ఆమెకు ట్రూకాలర్ సీఈఓ అలాన్ మామెడి నుండి జాబ్ ఆఫర్ కూడా వచ్చింది.

ఈ అమ్మాయి తనను తాను ఏక్తాగా పరిచయం చేసుకుంటూ, ఓ  వైరల్ క్లిప్‌లో  "ఆమెను కెనడాకు వచ్చేలా చేసింది ఏంటి?" అనే ప్రశ్నకు స్పందిస్తూ  భారత్‌ను విడిచి వెళ్లాలనేది తన కల అని ఆమె పేర్కొంది.

కెనడాలో బయోటెక్నాలజీ డిగ్రీని పొందిన తర్వాత, వ్యాపార వృత్తిని కొనసాగించాలని భావిస్తున్నట్లు ఆమె చెప్పారు.కెనడా  దేశం గురించి ఆమెకు ఎం బాగా నచ్చిందని అడిగినప్పుడు, ఏక్తా మాట్లాడుతూ అందమైన దృశ్యాలు, సూర్యోదయం ఇంకా సూర్యాస్తమయం ఇష్టమని   తెలిపింది.

 

సోషల్ మీడియాలో, ఆమె చెప్పిన సమాధానానికి చాలా నెగటివ్ కామన్స్ కామెంట్స్ వచ్చాయి. ఈ వీడియో  అలెన్ మామెడి దృష్టికి కూడా వచ్చింది, అతను ఈ ట్రోల్‌లను పట్టించుకోవద్దని ఏక్తాకు తెలిపాడు.

"ప్రజలు నిజంగా ఆమెను అపార్థం చేసుకొని ఎగతాళి చేయాలనుకుంటున్నారు. ఇది సరికాదు!! ఏక్తా, నిన్ను ఎగతాళి చేసే మాటలు  వినకు. నువ్వు కూల్‌ ఇంకా ని కలను నువ్వ్వు జీవిస్తున్నావని నేను భావిస్తున్నాను! మీరు డిగ్రీ పూర్తి చేశక ప్రపంచవ్యాప్తంగా ఉన్న మా Truecaller ఆఫీసులలో దేనిలోనైనా పని చేయడానికి మీకు స్వాగతం" అని అతను సోషల్ మీడియా సైట్ X లో పోస్ట్ చేసారు.

అలెన్ Mamedi   రెస్పాన్స్ కి సోషల్ మీడియా యూజర్ల నుండి వివిధ స్పందనను సృష్టించింది, చాలా మంది అతనికి సపోర్ట్  ఇస్తుండగా, మరికొందరు అతనిని మాటలపై విమర్శిస్తున్నారు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios