ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ యాపిల్‌ పుట్టిన తొలి రోజుల్లో ఆ కంపెనీ వ్యవస్థాపకులు స్టీవ్ జాబ్స్, స్టీవ్ వోజ్నిక్ తయారు చేసిన అరుదైన కంప్యూటర్‌‌ను వేలం వేయనున్నారు. 1970ల్లో రూపొందించిన యాపిల్ 1 కంప్యూటర్‌గా పిలిచే డెస్క్‌టాప్ కంప్యూటర్‌ను 1976లో మార్కెట్‌లో విడుదల చేశారు.

దీనిని బైట్ షాప్ స్టైల్ యాపిల్ 1 మోడల్ అని పిలుస్తారు. ఇప్పటికి ఇది వర్కింగ్ కండిషన్‌లో ఉంది. అప్పట్లో ఇలాంటివి దాదాపు 200 కంప్యూటర్లను తయారు చేయగా.. వీటిలో 60దాకా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ వేలానికి బిడ్లను ఆహ్వానిస్తున్నట్లుగా ఆర్ఆర్ వేలం సంస్థ ప్రకటించింది. వేలంలో ఇది దాదాపు 3 లక్షల డాలర్లు పలుకుతుందని అంచనా. సెప్టెంబర్ 25న వేలం జరగనుంది.