20ఎం‌పి సెల్ఫీ కెమెరాతో స్యామ్సంగ్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్.. బిగ్ బ్యాటరీతో 1 టి‌బి వరకు స్టోరేజ్..

ఈ స్యామ్సంగ్ ప్రైమ్  ఎడిషన్‌ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు. స్యామ్సంగ్ గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్‌ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

Samsung launches Galaxy M32 Prime Edition phone with 20MP selfie camera know its price

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ స్యామ్సంగ్ మరో కొత్త ఫోన్ స్యామ్సంగ్ గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్‌ను ఎం-సిరీస్ కింద భారతీయ మార్కెట్లో లాంచ్ చేసింది. గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేసిన స్యామ్సంగ్ గెలాక్సీ ఎం32 అప్‌గ్రేడ్ వెర్షన్ గా ఈ ఫోన్ పరిచయం చేసారు.  గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్‌ 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్‌తో పరిచయం చేసారు. ఫోన్‌లో 20MP సెల్ఫీ కెమెరా, 64MP ప్రైమరీ కెమెరా సెన్సార్ ఇచ్చారు.

ప్రైమ్ ఎడిషన్ ధర 
ఈ స్యామ్సంగ్ ప్రైమ్  ఎడిషన్‌ ఫోన్ బ్లాక్, బ్లూ కలర్ ఆప్షన్లలో ప్రవేశపెట్టారు. స్యామ్సంగ్ గెలాక్సీ ఎం32 ప్రైమ్ ఎడిషన్‌ రెండు స్టోరేజ్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. 4 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్ ధర రూ. 11,499, 6 జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ ధర రూ. 13,499. ఫోన్‌ను కంపెనీ అఫిషియల్ వెబ్‌సైట్,  అమెజాన్ ఇండియా నుండి కొనుగోలు చేయవచ్చు. 

 ఫీచర్లు
ఆండ్రాయిడ్ 11  OneUI 4.1, 6.4-అంగుళాల AMOLED డిస్‌ప్లే ఇన్ఫినిటీ-U నాచ్‌తో వస్తుంది. డిస్‌ప్లే  రిఫ్రెష్ రేట్ 90Hz, 800 నిట్స్ బ్రైట్‌నెస్, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్‌,  MediaTek Helio G80 ప్రాసెసర్ 6జి‌బి వరకు ర్యామ్ ఆప్షన్, 128 జి‌బి వరకు స్టోరేజ్ లభిస్తుంది. మెమరీ కార్డ్ సహాయంతో స్టోరేజీని 1TB వరకు పెంచుకోవచ్చు.

 ప్రైమ్ ఎడిషన్ కెమెరా
స్యామ్సంగ్ గెలాక్సీ ఎం32 కొత్త ఎడిషన్‌లో నాలుగు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, వీటిలో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌, రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్‌ అల్ట్రా వైడ్ యాంగిల్, 2-2 మెగాపిక్సెల్ మాక్రో షూటర్ అండ్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి.  ఫోన్‌లో 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

 ప్రైమ్ ఎడిషన్ బ్యాటరీ
6,000mAh బ్యాటరీతో ఈ ఫోన్‌ వస్తుంది, దీనికి 18W ఛార్జింగ్ సపోర్ట్‌ ఇచ్చారు. ఫోన్ సెక్యూరిటి కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ ఉంది. ఇతర కనెక్టివిటీ కోసం 4G LTE, Wi-Fi, బ్లూటూత్, GPS / A-GPS, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌ ఉన్నాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios