ఫిబ్రవరి 19, 2021: కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 లాంచ్ కొరకు రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ ఆఫ్ లైన్ భాగస్వాములుగా నిర్ణయించబడ్డారు. ఫిబ్రవరి 22 నుండి రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్సులో కస్టమర్లు లేటెస్ట్ శామ్సంగ్ స్మార్ట్ ఫోన్ అనుభూతిని ఆస్వాదించి, కొనుగోలు చేయగలుగుతారు. రిలయన్స్ డిజిటల్ స్టోర్స్  వైడ్ నెట్ వర్క్ మొత్తం దేశమంతటా కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 అందుబాటులో ఉండేలా చేస్తుంది, కాబట్టి ఈ ఫోన్ కొనాలనుకునే ఆసక్తి గల కస్టమర్లకు ఈ పవర్ఫుల్ డివైస్ యొక్క ఫస్ట్ హ్యాండ్ అనుభూతి లభిస్తుంది.   

కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 ఫోన్ శామ్సంగ్ 7nm ఎక్సినోస్ 9825 2.73 GHz ఆక్టా కోర్ ప్రోసెసర్ తో శక్తివంతమైనది. ఇది 128 GB ఎక్సపాండ్బుల్ స్టోరేజ్ మరియు కలర్ సూపర్ AMOLED  స్క్రీన్ తో ఏర్పాటు చేయబడింది. ఈ ఫీచర్లు సెగ్మంట్-లీడింగ్ 7000 mAh బ్యాటరీతో కలిగి, దీనిని గేమర్స్ కు డ్రీమ్ ఫోన్ గా మర్చుతున్నవి. ఈ ఫోన్ ఇన్ట్యూటివ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్లు  మరియు ఫేస్ అన్లాక్ ఆప్షన్లు తో కూడా సెక్యూర్ గా ఎనేబుల్ చేయబడింది.

అల్ట్రా వైడ్ మరియు మేక్రో షూటింగ్ అందించే 64 MP రియర్ కెమేరా తో, ఇంకా  6 GB RAM కలిగినది రూ. 21,499/* లో లేదా 8 GB RAM కలిగినది రూ. 23,499/-* అందుబాటు ధరలలో చక్కని ప్రైస్ పాయింటులో వస్తున్నది, వీటితో ఐసిఐసిఐ బ్యాంక్ డెబిట్ మరియు క్రెడిట్ కార్డుల మీద రూ. 2,500/- ఇన్స్టాంట్ డిస్కౌంట్ లేదా సిటీబ్యాంక్ క్రెడిట్ కార్డ్ యొక్క EMI మీద రూ. 2,500/- వరకు ఇన్ స్టాంట్ డిస్కౌంట్ కూడా చేరి ఉన్నవి.  

భాగస్వామ్యం గురించి మట్లాడుతూ శ్రీ బ్రియాన్ బేడ్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ - రిలయన్స్ డిజిటల్, “కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 ని ఇండియా అంతటా కస్టమర్లకు అందించుటలో మేము మాత్రమే ఆఫ్ లైన్ భాగస్వామి కావటం మాకు ఆనందం కలగజేస్తున్నది. కస్టమర్లకు ఈ  ఫోన్ అనుభవం పొందుటలో మొట్టమొదటివారు కావటం మరియు కొనటం కొరకు దేశమంతటా వ్యాపించిన మా రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ యొక్క లార్జ్ నెట్ వర్క్ సహకరిస్తుంది. ఈ ఫోన్ పెర్ఫార్మన్స్ ద్వారా మరియు ముఖ్యంగా చాలామందికి కొనుగోలు కొరకు అందుబాటులో ఉండే దీని ధర పట్టిక వల్ల కస్టమర్లు చాలా థ్రిల్ అవుతారని మేము తప్పకుండా నమ్ముతున్నాం.” అన్నారు.

రిలయన్స్ డిజిటల్ మరియు మై జియో స్టోర్స్ లో కొత్త శామ్సంగ్ గ్యాలక్సీ F62 కొనుగోలు చేయాలని ఎంచుకునే జియో కస్టమర్లు, లాంచ్ సమయంలో రూ. 10,000/- విలువైన ప్రయోజనాలతో ఇతర ఎక్స్ క్లూజివ్ ఆఫర్లు కూడా పొందగలరు. ఈ ప్రయోజనాలలో, రూ. 349/- ప్లాన్ లో మీరు ప్రీపెయిడ్ రీచార్జ్ చేసుకొని రూ. 3,000/- ఇన్ స్టాంట్ క్యాష్ బ్యాక్ మరియు పార్టనర్ బ్రాండ్స్ నుండి రూ. 7,000/- విలువైన వోచర్లుపొందవచ్చు. ఈ ఆఫర్ కొత్త మరియు ప్రస్తుతం ఉన్న అందరు జియో సబ్-స్క్రైబర్స్ కు వర్తిస్తుంది. 

*నియమములు మరియు షరతులు వర్తించును.

రిలయన్స్ డిజిటల్ గురించి
రిలయన్స్ డిజిటల్ ఇండియాలో అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ రీటైలర్. ఇది 800 సిటీలలో 400+ లార్జ్ ఫార్మట్ రిలయన్స్ డిజిటల్ స్టోర్స్ మరియు 1800+ మై జియో స్టోర్లతో, దేశెంలో నలుమూలలో ఉన్న కస్టమర్లకు సేవలు అందజేస్తూ, అత్యాధునిక టెక్నాలజీ అందరికి అందుబాటులో ఉండేలా చేస్తున్నది. 200కు పైగా అంతర్జాతీయ మరియు దేశీయ ఉత్పాదనలు మరియు ఆకర్షణీయమైన ధరలలో 5000 కు పైగా ఉత్పాదనలు కలిగిఉన్న రిలయన్స్ డిజిటల్, కస్టమర్లకు తమ అభిరుచికి తగినట్లు సరియైన టెక్నాలజీ సొల్యుషన్స్ పొందుటకు అతి పెద్ద సంఖ్యలో మోడల్స్ ఎంచుకునే సౌకర్యం అందజేస్తున్నది. రిలయన్స్ డిజిటల్ లో, ప్రతి స్టోరులో ట్రెయినింగ్ పొంది, చక్కని సమాచారం కలిగిన స్టాఫ్, స్టోర్ లోని ప్రతి ఉత్పాదన గురించి కస్టమర్లకు సంతోషంగా పూర్తి సమాచారం అందజేస్తారు. అతి ముఖ్యంగా, రిలయన్స్ డిజిటల్ అన్ని ఉత్పాదనలకు ఆఫ్టర్ సేల్ సర్వీస్ అందజేస్తున్నది. రిలయన్స్ ResQ, రీటైలర్ సర్వీస్ విభాగం మరియు ఇండియాలో ఏకైక ISO 9001 సర్టిఫికేట్ పొందిన ఒక ఎలక్ట్రానిక్ సర్వీస్ బ్రాండ్, వారమంతా సపోర్ట్ అందించుటకు మరియు పరిపూర్ణమైన పరిష్కారాలు అందజేయటానికి పూర్తిగా సిద్ధంగా ఉంటుంది.

సులభంగా కొనుగోలుకు, ఇప్పుడు వినియోగదారులు ఏ రిలయన్స్ డిజిటల్ స్టోరుకైనా విచ్చేయవచ్చు లేదా www.reliancedigital.in పై లాగాన్ చేయవచ్చు, ఇది వారికి ఇన్ స్టాంట్ డెలివరీ  (3 గంటలకు కంటె తక్కువ సమయంలో డెలివరీ) అందజేస్తుంది మరియు వారు తమకు దగ్గరలోని స్టోరులో కూడా వాటిని పికప్ చేసుకోవచ్చు.

మరింత సమాచారం కొరకు  www.reliancedigital.in పై లాగాన్ చేయండి.