కొత్త కనెక్షన్‌లపై కస్టమర్‌లు 100% వాల్యూ బ్యాక్, 15 రోజుల అదనపు వాలిడిటీ పొందుతారు. అలాగే, కొత్త కనెక్షన్ తీసుకునే కస్టమర్‌లు రూ. 6,000 విలువైన 4K జియోఫైబర్ సెట్-టాప్-బాక్స్‌ను ఉచితంగా పొందుతారు.

రిలయన్స్ జియో జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్‌ను విడుదల చేసింది, దీపావళి సందర్భంగా జియో ఫైబర్ కస్టమర్లకు ఈ ప్రకటన చేసింది. ఈ ఆఫర్ లిమిటెడ్ పీరియడ్ వరకు ఉంటుంది, దీని కింద కస్టమర్లు అక్టోబర్ 18 నుండి 28 వరకు జియో ఫైబర్ కొత్త కనెక్షన్ తీసుకోవడం ద్వారా ఆఫర్‌ పొందవచ్చు. కొత్త కనెక్షన్‌లపై కస్టమర్‌లు 100% వాల్యూ బ్యాక్, 15 రోజుల అదనపు వ్యాలిడిటీ లభిస్తుంది. అలాగే కొత్త కనెక్షన్ తీసుకునే కస్టమర్‌లు రూ. 6,000 విలువైన 4K జియోఫైబర్ సెట్-టాప్-బాక్స్‌ను ఉచితంగా పొందుతారు. ఆఫర్ బెనెఫిట్స్ పొందడానికి కస్టమర్లు రూ.599, రూ.899 ప్లాన్‌తో ఆరు నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాలి. ఈ ఆఫర్ల గురించి తెలుసుకుందాం...

జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ 2022
రిలయన్స్ జియో కొత్త జియోఫైబర్ డబుల్ ఫెస్టివల్ బొనాంజా ఆఫర్ పేరు లాగానే కస్టమర్‌లు డబుల్ బెనెఫిట్స్ పొందుతారు. ఆఫర్ కింద కస్టమర్లు రూ. 6,500 వరకు బెనెఫిట్స్ పొందవచ్చు. ఈ ఆఫర్ రూ. 599x6 నెలల రీఛార్జ్, రూ. 899x6 నెలల రీఛార్జ్ ప్లాన్‌లపై అందుబాటులో ఉంది. కొత్త కనెక్షన్‌లపై కస్టమర్‌లు ప్లాన్‌తో మరో రెండు ప్రయోజనాలను కూడా పొందుతారు, అవి 100% వాల్యూ బ్యాక్ అండ్ 15 రోజుల అదనపు వాలిడిటీ. అయితే, 3 నెలల రీఛార్జ్‌పై 15 రోజుల అదనపు వాలిడిటీ ఉండదు.

రూ. 599 ప్లాన్ ప్రయోజనాలు
కొత్త జియో ఫైబర్ కనెక్షన్‌తో కస్టమర్లు రూ. 599 ప్లాన్ తీసుకుంటే ఆరు నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాలి. దీని తర్వాత యూజర్లు 30Mbps స్పీడ్ తో ఇంటర్నెట్‌కు యాక్సెస్ పొందుతారు. 14 కంటే ఎక్కువ OTT యాప్స్, 550 కంటే ఎక్కువ ఆన్-డిమాండ్ ఛానెల్‌లు అంతే కాకుండా, కస్టమర్లు రూ. 1,000 విలువైన AJIO, రూ. 1,000 విలువైన రిలయన్స్ డిజిటల్, రూ. 1,000 విలువైన నెట్‌మెడ్స్ అండ్ రూ. 1,500 విలువైన IXIGO వోచర్‌ను కూడా పొందుతారు. ఇవి మాత్రమే కాకుండా ఈ ప్లాన్‌తో 15 రోజుల అదనపు వాలిడిటీ కూడా ఉంటుంది. 

రూ. 899 ప్లాన్ ప్రయోజనాలు
జియో ఫైబర్ రూ. 899 ప్లాన్ తీసుకునే కస్టమర్లు ఆరు నెలల పాటు రీఛార్జ్ చేసుకోవాలి. దీని తర్వాత కస్టమర్లు 100Mbps ఇంటర్నెట్ స్పీడ్, 14 కంటే ఎక్కువ OTT యాప్స్, 550 కంటే ఎక్కువ ఆన్-డిమాండ్ ఛానెల్‌లు పొందుతారు. కస్టమర్‌లకు రూ. 2,000 AJIO, రూ. 1,000 రిలయన్స్ డిజిటల్, రూ. 500 నెట్‌మెడ్స్, రూ. 3,000 IXIGO వోచర్‌లను లభిస్తాయి. ఈ ప్లాన్‌తో 15 రోజుల అదనపు వాలిడిటీ ఉంటుంది.