Asianet News TeluguAsianet News Telugu

Rediffmail:రీడిఫ్ మెయిల్ అంటే ఏమిటి? దీనిలో మీ అక్కౌంట్ ఇలా క్రియేట్ చేసుకోండీ..

ఈరోజుల్లో మనం మెయిల్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సహాయంతో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను ఒకరికొకరు పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నాము. ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా మరేదైనా పని కోసం మనకి ప్రత్యేక ఇమెయిల్ అవసరం.

Rediffmail What is Rediffmail Create your account on this platform like this
Author
hyderabad, First Published May 13, 2022, 2:01 PM IST

నేటి డిజిటల్ ప్రపంచంలో ఇంటర్నెట్ మన అవసరంగా మారింది. ఇంటర్నెట్ రాకతో ప్రపంచం డిజిటల్ కలర్‌గా మారిపోయింది. ఈరోజుల్లో మనం మెయిల్ లేదా ఏదైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ సహాయంతో ఫోటోలు, వీడియోలు, డాక్యుమెంట్‌లను ఒకరికొకరు పెద్ద ఎత్తున షేర్ చేసుకుంటున్నాము.  ఉద్యోగం చేస్తున్నప్పుడు లేదా మరేదైనా పని కోసం మనకి ప్రత్యేక ఇమెయిల్ అవసరం.

ఇంటర్నెట్ ప్రపంచంలో మీరు ఉచితంగా ఇమెయిల్‌ను క్రియేట్ చేసే అవకాశాన్ని అందించే ఎన్నో సైట్‌లు ఉన్నాయి. వాటిలో ఒకటి Rediff మెయిల్. Rediffmail ఒక ఇమెయిల్ సర్వీస్. Gmail అక్కౌంట్ నుండి ఎన్నో Google సేవలను యాక్సెస్ చేయవచ్చు. మీరు ఇమెయిల్ సర్వీస్, ఆన్‌లైన్ షాపింగ్, ఇతర సర్వీసెస్ Rediff మెయిల్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు.  Rediff మెయిల్‌లో మీ అక్కౌంట్ ఎలా క్రియేట్ చేయాలంటే..?

Rediff మెయిల్‌లో మీ అక్కౌంట్ క్రియేట్ చేయడానికి ముందుగా మీరు https://www.rediff.comని ఓపెన్ చెయ్యాలి. దీని తర్వాత మీరు rediffmail అప్సన్ ఎంచుకోవాలి. మీరు హోమ్ పేజీ పైన ఈ ఆప్షన్ కనుగొంటారు.

తరువాత మీరు పైన కుడి మూలలో క్రియేట్ న్యూ అక్కౌంట్ ఆప్షన్ చూస్తారు. దానిపై క్లిక్ చేయండి. ఇప్పుడు మీ స్క్రీన్‌పై కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు మీ పూర్తి పేరును ఎంటర్ చేసి, rediffmail idని ఎంచుకోవాలి.

ఆ తర్వాత పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోవాలి. అంతేకాకుండా బాక్స్‌లో అల్ట్రానెట్ ఇమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేయాలి.  తరువాత మీరు మీ మొబైల్ నంబర్, పుట్టిన తేదీ, జెండర్, దేశం, నగరం, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేసి క్రియేట్ మై అక్కౌంట్ ఆప్షన్ ఎంచుకోవాలి.

ఈ ప్రక్రియ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు OTP వస్తుంది. మీరు దానిని ఎంటర్ చేయాలి. OTPని ఎంటర్ చేసిన తర్వాత మీ విద్య, వృత్తి గురించి అడుగుతుంది. ఈ వివరాలను ఎంటర్ చేసిన తర్వాత మీరు రీడిఫ్ ఇన్‌బాక్స్‌కు ఓపెన్ అవుతుంది. ఈ విధంగా మీరు సులభంగా మీ rediff అక్కౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇందులో మీకు ఎలాంటి సమస్యలు ఉండవు.
 

Follow Us:
Download App:
  • android
  • ios