వచ్చేనెలలో... రియల్ మీ ఎక్స్ 2 ప్రో
చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ రియల్ మీ వచ్చేనెలలో ఎక్స్2 ప్రో, ఎక్స్ టీ 730జీ ఫోన్లను విపణిలోకి ప్రవేశపెట్టనున్నది. వచ్చేనెలలో ఎక్స్2 ప్రో ఫోన్ ప్రీమియం సెగ్మెంట్‌లోకి విడుదల చేయనున్నది.
న్యూఢిల్లీ: ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ సంస్థ రియల్ మీ త్వరలో అద్భుతమైన ఫీచర్లతో మరో రెండు రకాల ఫోన్లను అందుబాటులోకి తేనున్నది. నవంబర్ నెలలో రియల్ మీ నుంచి ఎక్స్2 ప్రోను, డిసెంబర్లో ఎక్స్‌టీ 730జీ మోడల్ ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించింది.
ఈ రెండింటిలో ఎక్స్2 ప్రో ఫోన్‌ను ప్రీమియం సిగ్మెంట్లో వినియోగదారులకు అందుబాటులోకి తేనున్నది. అయితే వీటితో పాటు రియల్ మీ 5ఎస్ పేరుతో ఓ బడ్జెట్ ఫోన్‌ను ఆవిష్కరించాలని తాజాగా నిర్ణయించినట్లు తెలుస్తోంది.
also read యమహా నుంచి రెండు కొత్త సౌండ్ బార్స్
ఒప్పో అనుబంధ సంస్థగా రియల్ మీ మార్కెట్లోకి ప్రవేశించినా.. భారత్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నది. వెనువెంటనే కొత్త మోడళ్లను విడుదల చేస్తూ మార్కెట్లో తన స్థానాన్ని మరింత పటిష్ఠం చేసుకోవాలని ఈ సంస్థ ప్రయత్నిస్తోంది.
రియల్మీ ఎక్స్2 ప్రో ప్రీమియం మోడల్‌ను నవంబర్‌లో విడుదల చేయనున్న సంగతి చాలా మందికి తెలిసిన విషయమే. ఇప్పుడు ఎక్స్2 ప్రోతో పాటు రియల్మీ 5ఎస్ మోడల్‌ను భారత మార్కెట్లోకి విడుదల చేయాలని ఆ సంస్థ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
రియల్ మీ 5ఎస్‌ను.. వివో యూ10 రీబ్రాండ్‌గా విడుదల చేసే అవకాశం ఉన్నదని టెక్ వర్గాల సమాచారం. వివో యూ10 స్మార్ట్ ఫోన్ రియల్ మీ 5 సిరీస్ ఫోన్ల తర్వాత విడుదలైంది. వివో యూ10 ప్రస్తుతం అమెజాన్‌లో ఎక్స్‌క్లూజివ్‌గా రూ.8,990 ధరలో అందుబాటులో ఉంది.
also read నేడే మోటో జి8 ప్లస్ విడుదల ....అదిరిపోయే ఫీచర్స్
6.35 హెచ్డీ ప్లస్ డిస్ప్లే, 4 జీబీ ర్యామ్, 64 జీబీల స్టోరేజీ, వెనుకవైపు మూడు కెమెరాలు, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ఫీచర్లు ఉన్నాయి. రియల్ మీ 5ఎస్ వివో యూ10ను పోలి ఉన్నా, 4 కెమెరాలతో మార్కెట్లోకి రావచ్చని సమాచారం.
ఇక ప్రీమియం సెగ్మెంట్లో 'రియల్ మీ ఎక్స్2 ప్రో' నవంబర్ 20న విడుదల కానున్నట్లు ఆ సంస్థ ఇప్పటికే పేర్కొంది. వీటి అమ్మకాలు మాత్రం డిసెంబర్ మొదటి వారంలో ప్రారంభం కావచ్చునని తెలుస్తోంది.