యమహా మ్యూజిక్ ఇండియా భారతదేశంలో రెండు కొత్త సౌండ్‌ బార్లను విడుదల చేసింది. అవి YAS 109 మరియు YAS 209లో  అంతర్ నిర్మితమైన  అలెక్సా , స్పూటిఫై మరియు అమెజాన్ మ్యూజిక్‌ యాప్ లకు  సపోర్ట్  చేస్తుంది.YAS 109లో  ఇన్ బిల్ట్ సబ్‌ వూఫర్‌లను కలిగి ఉండగా, YAS 209 లో ప్రత్యేక వైర్‌లెస్ సబ్‌ వూఫర్ కలిగి ఉంది, ప్లేస్‌మెంట్ చేసుకోడానికి సౌకర్యవంతంగా మరియు మెరుగైన బేస్ అందిస్తుంది.


ఇన్ బిల్ట్ ఆలెక్సా ఫీచర్ వాల్యూమ్-తగ్గించుకోవడానికి సహకరిస్తుంది, ఇది వాయిస్ కమాండ్‌ను స్వీకరించేటప్పుడు  సినిమాలు లేదా సంగీతం యొక్క వాల్యూమ్‌ను స్వయంగా తగ్గిస్తుంది. అలెక్సా నియంత్రణను ప్రారంభించడానికి రిమోట్ లో  ప్రత్యేక బటన్‌ను కలిగి ఉంటుంది.అదనంగా, వినియోగదారుల  ప్రాధాన్యత ఆధారంగా కావలసినపుడు అలెక్సాను మ్యూట్ చేసుకోవచ్చు లేదా సౌండ్‌బార్ శక్తిని తగ్గించినప్పుడు పూర్తిగా ఆపివేయవచ్చు

also read నేడే మోటో జి8 ప్లస్ విడుదల ....అదిరిపోయే ఫీచర్స్

.సౌండ్‌బార్లు డాల్బీ డిజిటల్ మరియు డిటిఎస్ డిజిటల్ సరౌండ్ డీకోడింగ్‌ను, అలాగే ఆశ్చర్యపరిచే వర్చువల్ 3డి సరౌండ్, సౌండ్ కోసం డిటిఎస్ వర్చువల్ ఎక్స్‌ ఇందులో ఉన్నదీ. రెండు సౌండ్‌బార్లు సౌండ్ స్పష్టతను పెంచడానికి యమహా క్లియర్ వాయిస్ టెక్నాలజీని  ఇందులో  ఏర్పాటు చేసారు. కనెక్టివిటీ కోసం, బ్లూటూత్ 4.2, వైఫైలతో పాటు, ఆప్టికల్ ఇన్, HDMI ARC పోర్ట్‌కు సౌండ్‌బార్లు సహకరిస్తాయి. పాస్‌త్రూ కోసం ఒక HDMI పోర్ట్ కూడా ఉంది.

రెండు సౌండ్‌బార్లు కూడా CEC కి తోపడ్తాయి, అనుకూలమైన టీవీ రిమోట్‌లతో ఆడియో నియంత్రణ చేసుకోవచ్చు.HDMI కనెక్షన్లు లేకుండా ఇతర పరికరాల ఉపయోగం కోసం ఆప్టికల్ ఇన్పుట్ ఇందులో అమర్చబడి ఉంది.YAS 109  అవుట్ పుట్ 120 W, మరియు 3.4 కిలోల బరువు కలిగివుండగా, YAS 209  యొక్క అవుట్ పుట్ 200 W కలిగి ఉంటుంది. ఈ  ప్రత్యేకమైన వైర్ లెస్ సబ్ వూఫర్, బేస్ మరియు మొత్తం సౌండ్ అవుట్ పుట్ పెంచుతుంది. స్టైలిష్ గా , రెండు మోడల్స్ స్లిమ్ ప్రొఫైల్ కలిగి ఉంటాయి.

 also read ప్రైమ్ వీడియోలకు సెన్సార్ గండం తప్పదా?

YAS 109 ధర 23,990 రూపాయలు మరియు YAS 209 ధర 35,490 రూపాయలు.ఆపిల్ మరియు ఆండ్రాయిడ్ మొబైల్ పరికరాలకు అందుబాటులో ఉన్న సౌండ్‌బార్ సెట్టింగులను కంట్రోల్ చేయడానికి యమహా ఒక యాప్ తీసుకువచ్చింది. Wi-Fi ద్వారా స్మార్ట్‌ఫోన్‌లో ఉన్న మ్యూజిక్ ప్లేబ్యాక్ చేయడానికి కూడా ఈ యాప్ అనుమతిస్తుంది.