Asianet News TeluguAsianet News Telugu

చెవిని క్లీన్ చేయడానికి పోర్ట్రోనిక్స్ ప్రత్యేక కెమెరా.. దీని స్పెషాలిటీ ఎంటో తెలుసా..?

పోర్ట్రోనిక్స్ ఎక్స్ లైఫ్ కి 3.5mm అల్ట్రా ఫైన్ లెన్స్‌తో 3ఎం‌పి ఫుల్ హెచ్‌డి కెమెరా ఉంది. దీనికి 6-LED స్పాట్‌లైట్‌ ఉంది, ఇది చెవి లోపల ఉన్న ప్రతిదాన్ని చూడడంలో మీకు సహాయపడుతుంది.

Portronics launches special camera for ear cleaning, know its specialty
Author
First Published Jan 13, 2023, 11:29 AM IST

చెవిని శుభ్రం చేసుకోవడం నిజంగా కష్టమైన పని. సాధారణంగా ప్రజలు చెవి క్లీనింగ్ కోసం డాక్టర్ వద్దకు వెళ్లాలని ప్లాన్ చేసుకుంటారు కానీ అది కేవలం ప్లానింగ్ మాత్రమే. ఇప్పుడు పోర్ట్రోనిక్స్ ఈ పనిని సులభతరం చేసింది. కంపెనీ పోర్ట్రోనిక్స్ XLife (ఆటోస్కోప్)ను పరిచయం చేసింది, ఇది 360° ఫుల్ హెచ్‌డి కెమెరా. ఈ ప్రత్యేక కెమెరా సహాయంతో మీరు మీ చెవిని శుభ్రం చేసుకోవచ్చు ఇంకా మీ ఫోన్‌లో క్లీనింగ్‌ను ప్రత్యక్షంగా చూడవచ్చు. దీనికి చర్మానికి సురక్షితమైనదిగా పరిగణించబడే సిలికాన్ టిప్ ఉంటుంది. చెవి శుభ్రం చేయడానికి కొన్నిటిని ఉపయోగించడం ప్రమాదకరం.

పోర్ట్రోనిక్స్ ఎక్స్ లైఫ్ కి 3.5mm అల్ట్రా ఫైన్ లెన్స్‌తో 3ఎం‌పి ఫుల్ హెచ్‌డి కెమెరా ఉంది. దీనికి 6-LED స్పాట్‌లైట్‌ ఉంది, ఇది చెవి లోపల ఉన్న ప్రతిదాన్ని చూడడంలో మీకు సహాయపడుతుంది. పోర్ట్రోనిక్స్ ఎక్స్ లైఫ్ లో  3-యాక్సిస్ గైరోస్కోప్‌  ఉంది, ఇది 360° వ్యూ చూడటానికి సహాయపడుతుంది.


పోర్ట్రోనిక్స్ ఎక్స్ లైఫ్ లో Wi-Fi 2.4GHz కనెక్టివిటీ ఉంది, దీని సహాయంతో మీరు మీ ఆండ్రాయిడ్ లేదా ఐఫోన్ రెండింటిలోనూ ప్రత్యక్షంగా చెవి శుభ్రపరచడాన్ని చూడవచ్చు. ఇందుకోసం ఎక్స్‌లైఫ్ యాప్‌ను కూడా ప్రవేశపెట్టింది. వీడియో రికార్డింగ్ కాకుండా, మీరు చెవి లోపల ఫోటోలను కూడా క్లిక్ చేయవచ్చు.

పోర్ట్రోనిక్స్ ఎక్స్ లైఫ్ అనేది వైర్‌లెస్ ఓటోస్కోప్, ఇది టైప్-సి ఛార్జింగ్ పోర్ట్‌తో వస్తుంది. దీని బ్యాటరీ 30 నిమిషాల బ్యాకప్‌ని క్లెయిమ్ చేస్తుంది, దీని మొత్తం బరువు 13 గ్రాములు. పోర్ట్రోనిక్స్ ఎక్స్ లైఫ్  ఓటోస్కోప్, ధర రూ. 1,299. దీనిని కంపెనీ వెబ్‌సైట్, అమెజాన్, ఫ్లిప్ కర్ట్  అలాగే ఆఫ్‌లైన్ స్టోర్‌లలో 12 నెలల వారంటీతో కొనుగోలు చేయవచ్చు.

Follow Us:
Download App:
  • android
  • ios