MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Technology
  • Vivo T5 Lite : రెండు రోజులు ఛార్జింగ్ పెట్టకున్నా నో టెన్షన్... 6500mAh బ్యాటరీతో మార్కెట్లోకి సూపర్ స్మార్ట్ ఫోన్

Vivo T5 Lite : రెండు రోజులు ఛార్జింగ్ పెట్టకున్నా నో టెన్షన్... 6500mAh బ్యాటరీతో మార్కెట్లోకి సూపర్ స్మార్ట్ ఫోన్

వివో కంపెనీ తన కొత్త వివో టీ5 లైట్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను ఇండియాలో లాంచ్ చేసింది. ఎక్కువ సేపు నిలిచే 6,500mAh బ్యాటరీ, 50MP సోనీ కెమెరా, 120Hz డిస్‌ప్లే వంటి అదిరిపోయే ఫీచర్లతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది.

2 Min read
Author : Arun Kumar P
Published : Jul 24 2026, 05:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
వివో టీ5 లైట్ 5జీ
Image Credit : Vivo

వివో టీ5 లైట్ 5జీ

ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఫాస్ట్ ఇంటర్నెట్, రోజువారీ అవసరాలకు సరిపోయే ఫోన్ కోరుకునే కస్టమర్లను లక్ష్యంగా చేసుకుని వివో కొత్త టీ5 లైట్ 5జీ మొబైల్‌ను భారత మార్కెట్లో విడుదల చేసింది. సరికొత్త డిజైన్, మెరుగైన ఫీచర్లు, ఎక్కువ సేపు పనిచేసే సామర్థ్యంతో ఈ మొబైల్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. బడ్జెట్ ధరలో కొత్త తరం 5జీ ఫోన్ కొనాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్ అని కంపెనీ చెబుతోంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
వివో టీ5 లైట్ ధర
Image Credit : Vivo

వివో టీ5 లైట్ ధర

ఈ మొబైల్ మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. 

4జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.19,999 గా ఉంది. 

6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.21,999 గా ఉంది.

6జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ ఉన్న టాప్ మోడల్ ధర రూ.24,999గా ఉంది. 

కొన్ని ఎంపిక చేసిన బ్యాంక్ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా మూడు నెలల వరకు వడ్డీ లేని ఈఎంఐ (No-Cost EMI) సౌకర్యం కూడా ఉంది. ఇలా ఈ ఫోన్ తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంది.

Related Articles

Related image1
Agri Technology : పశువులు మేపడానికి 'డిజిటల్ స్టిక్' ఏంటి భయ్యా..! దీని హైటెక్ ఫీచర్లు తెలిస్తే షాక్..!!
Related image2
AI Technology : ఏమిటీ... పిల్లల్ని కనడంకోసం ఏఐ రోబోల సహాయమా..!
35
వివో టీ5 లైట్ 5జీ ఫీచర్లు
Image Credit : Vivo

వివో టీ5 లైట్ 5జీ ఫీచర్లు

ఈ ఫోన్ అద్భుతమైన వీక్షణ అనుభవాన్ని అందించడానికి 6.74 అంగుళాల హై-క్వాలిటీ స్క్రీన్‌తో వస్తుంది. దీని 120Hz రిఫ్రెష్ రేట్, 1,200 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ వల్ల ఎక్కువ వెలుతురులో కూడా స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తుంది. మెరుగైన పనితీరు కోసం ఇందులో మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌ను అమర్చారు. గరిష్ఠంగా 6జీబీ ర్యామ్, 256జీబీ వరకు స్టోరేజ్ ఆప్షన్స్ ఉన్నాయి. అవసరమైతే మెమరీ కార్డ్ ద్వారా స్టోరేజ్‌ను 2టీబీ వరకు పెంచుకోవచ్చు.

45
వివో టీ5 లైట్ కెమెరా
Image Credit : Vivo

వివో టీ5 లైట్ కెమెరా

ఈ ఫోన్ వెనుక భాగంలో 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఉంది. దీనికి తోడుగా మరో సెకండరీ సెన్సార్ కూడా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను అమర్చారు. 

ఈ మొబైల్ అతిపెద్ద బలం దాని 6,500mAh భారీ బ్యాటరీ. దీన్ని వేగంగా ఛార్జ్ చేయడానికి 44 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. సాధారణ వాడకంతో ఈ ఫోన్ రెండు రోజులు ఛార్జింగ్ వస్తుంది… హెవీగా వాడితే 1 నుండి 1.5 రోజులు వస్తుంది. స్టాండ్ బై మోడ్ లో అంటే అస్సలు వాడకుండా ఉంచితే 3 నుండి 4 రోజులు సులభంగా వస్తుందని వివో కంపెనీ చెబుతోంది.

55
వివో టీ5 లైట్ మొబైల్
Image Credit : Vivo

వివో టీ5 లైట్ మొబైల్

నీటి తుంపర్లు, దుమ్ము నుంచి రక్షణ కోసం ప్రత్యేక రేటింగ్, సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్ వంటి అనేక ఇతర ఫీచర్లు ఈ మొబైల్‌లో ఉన్నాయి. ఇది రెండు రంగుల ఆప్షన్లలో లభిస్తుంది. ఈ మోడల్‌ను ఆన్‌లైన్ స్టోర్లు, అధీకృత విక్రయ కేంద్రాల్లో కొనుగోలు చేయవచ్చు. కొనే ముందు ఆ రోజు ధర, బ్యాంక్ ఆఫర్లు, స్టాక్ లభ్యతను చెక్ చేసుకోవడం మంచిది.

About the Author

AK
Arun Kumar P
అరుణ్ కుమార్ పట్లోల : ఏడు సంవత్సరాలకు పైగా జర్నలిజంలో ఉన్నారు. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. పొలిటికల్ తో పాటు ఎడ్యుకేషన్, కెరీర్, జాబ్స్, బిజినెస్, స్పోర్ట్స్ తదితర విభాగాలకు సంబంధించిన వార్తలు రాస్తుంటారు. ఇతడిని arunkumar.p@asianetnews.in ద్వారా సంప్రదించవచ్చు.
సాంకేతిక వార్తలు చిట్కాలు
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Mobile Charging Tips: ఫోన్ ఛార్జింగ్.. ఆపిల్, గూగుల్ ఇచ్చిన వార్నింగ్ ఏంటో తెలుసా?
Recommended image2
POCO M8x 5G: బిగ్ బ్యాటరీతో రచ్చలేపుతున్న పోకో కొత్త 5G ఫోన్.. ఒక్కసారి ఛార్జ్ చేస్తే 3 రోజులు నాన్‌స్టాప్.. పూర్తి వివరాలు ఇవే!
Recommended image3
Smart Bat: మీ పిల్ల‌ల‌కు ఇది కొనిస్తే.. ఇక‌పై స్మార్ట్‌ఫోన్ జోలికి అస్స‌లు వెళ్ల‌రు
Related Stories
Recommended image1
Agri Technology : పశువులు మేపడానికి 'డిజిటల్ స్టిక్' ఏంటి భయ్యా..! దీని హైటెక్ ఫీచర్లు తెలిస్తే షాక్..!!
Recommended image2
AI Technology : ఏమిటీ... పిల్లల్ని కనడంకోసం ఏఐ రోబోల సహాయమా..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved