పోకో ఎక్స్ 3ప్రో స్మార్ట్ ఫోన్ లాంచ్ డేట్ ఫిక్స్.. ఇండియన్ మార్కెట్లో దీని ధర ఎంతంటే ?

పోకో ఎక్స్3ప్రోగా వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 30న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కూడా  అధికారికంగా ధృవీకరించింది. 

Poco X3 Pro to be launched in India on March 30 know   features and price

స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ పోకో ఇండియా ఒక కొత్త ఫోన్ ని ఇండియన్ మార్కెట్లోకి తీసుకురావడానికి సిద్ధంగా ఉంది. పోకో ఎక్స్3ప్రోగా వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ మార్చి 30న భారతదేశంలో లాంచ్ కానుంది. ఈ విషయాన్ని కంపెనీ కూడా  అధికారికంగా ధృవీకరించింది. ఈ స్మార్ట్ ఫోన్  ఫీచర్స్,  ధర గురించి సమాచారం ఇవ్వనప్పటికీ పోకో ఎక్స్3ప్రోకు సంబంధించిన టీజర్‌ను కంపెనీ విడుదల చేసింది.

టీజర్‌కు ముందు ఫోన్  ఫీచర్స్ లీకైనట్లు కొన్ని నివేదికలు వెల్లడయ్యాయి. లికైన నివేదికల ప్రకారం స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్‌, హై-రిఫ్రెష్ రేట్ డిస్ ప్లేతో కూడిన బడ్జెట్ ఫోన్ గా రానుంది.

also read కరోనా కారణంగా ఆపిల్ కీలక నిర్ణయం.. ఐఫోన్ 13లో రానున్న ఈ ఫీచర్ గురించి తెలుసుకోండి.. ...

పోకో ఎక్స్3 ప్రో ధర
పోకో ఎక్స్ 3 ప్రో కలర్, ధర కూడా తాజాగా లీక్ అయ్యాయి, దీని ప్రకారం పోకో ఎక్స్3 ప్రో  రెండు వేరియంట్లలో రానుంది. 6 జీబీ ర్యామ్‌తో 128 జీబీ స్టోరేజ్‌, మరొకటి 8 జీబీ ర్యామ్‌తో 256 జీబీ స్టోరేజ్. 6 జీబీ ర్యామ్ వేరియంట్ ధర 250 యూరోలు, అంటే సుమారు 21,600 రూపాయలు, 8 జీబీ ర్యామ్‌కు 300 యూరోలు అంటే 26,000 రూపాయలు. ఫోన్‌  బ్లాక్, సిల్వర్ కలర్ వేరియంట్లలో కొనుగోలు చేయవచ్చు.

మరో లీకైన నివేదిక ప్రకారం పోకో ఎక్స్ 3 ప్రో  స్పెసిఫికేషన్లు చూస్తే పోకో ఎక్స్ 3 ప్రో 120హెచ్‌జెడ్  రిఫ్రెష్ రేటుతో ఫుల్ హెచ్‌డి ప్లస్ డిస్ ప్లే పొందుతుంది. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 860 ప్రాసెసర్ ఇంకా కనెక్టివిటీలో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఎన్‌ఎఫ్‌సి కోసం 5200 ఎంఏహెచ్ బ్యాటరీ, 4జి ఎల్‌టిఇ సపోర్ట్ కూడా ఉంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios