ఇండియా vs పాకిస్తాన్ టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ పై పేటి‌ఎం అదిరిపోయే ఆఫర్.. ఏంటో తెలుసా ?

అక్టోబర్ 24న చేసే అన్ని డి‌టి‌హెచ్ రీఛార్జ్‌లపై  యూజర్లు   10% అంటే రూ.40 వరకు క్యాష్‌బ్యాక్ గెలుచుకోవచ్చు. పేటి‌ఎం యూ‌పి‌ఐ, పేటి‌ఎం పోస్ట్‌పెయిడ్ (బై  నవ్ పే లెటర్), పేటి‌ఎం వాలేట్, డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా నెట్ బ్యాంకింగ్ నుండి వినియోగదారులకు వారికి నచ్చిన చెల్లింపు మోడ్‌ను ఎంచుకునే సౌలభ్యాన్ని అందిస్తుంది. 

Paytm offer for India vs Pakistan T20 World Cup match  flat 10% cashback on DTH recharges

ముంబై, 22 అక్టోబర్ 2021: భారతదేశ వినియోగదారులు, వ్యాపారుల కోసం ప్రముఖ డిజిటల్ ఏకొ సిస్టమ్ పేటి‌ఎం  స్పిరిట్ ఆఫ్ ఇండియా vs పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ సెలెబ్రేషన్ జరుపుకుంటు వినియోగదారుల కోసం అద్భుతమైన ఆఫర్‌ ప్రకటించింది. 24 అక్టోబర్ 2021న చేసే అన్ని డి‌టి‌హెచ్ రీఛార్జ్‌లపై  వినియోగదారులు 10% వరకు ఆంటే రూ.40 వరకు ఫ్లాట్ క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. అన్ని ప్రముఖ ఆపరేటర్ల డిటిహెచ్ రీఛార్జ్‌పై వినియోగదారులు ఈ క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు: టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, డి2హెచ్, సన్ డైరెక్ట్. 

ఈ ఆఫర్‌ని పొందడానికి వినియోగదారులు డి‌టి‌హెచ్ రీఛార్జ్ కోసం పేమెంట్ చేసే ముందు “IndVsPak” ప్రోమో కోడ్‌ని అప్లయ్ చేయాలి. ఈ ఆఫర్‌కి అదనంగా ఇప్పటికే ఉన్న వినియోగదారులు అన్ని ప్రముఖ డి‌టి‌హెచ్ ఆపరేటర్ల రీఛార్జ్‌పై  రూ. 500 వరకు ఖచ్చితమైన రివార్డ్‌లను పొందవచ్చు: టాటా స్కై, ఎయిర్‌టెల్ డిజిటల్ టీవీ, డిష్ టీవీ, డి2హెచ్, సన్ డైరెక్ట్. ఈ ఆఫర్లు మ్యాచ్ ఉన్న అన్నీ  రోజులలో అన్ని సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌లకు  వర్తిస్తాయి.

పేటి‌ఎం వినియోగదారులకు మరింత సౌలభ్యాన్ని అందించడానికి ఇటీవల 2-స్టేజ్ ఇన్స్టంట్ రీఛార్జ్‌,  ప్లాన్ గడువు గురించి రిమైండర్‌లు వంటి ఫీచర్లతో డి‌టి‌హెచ్ రీఛార్జ్ పేమెంట్ అనుభవాన్ని మెరుగుపరిచింది. పేటి‌ఎం తన వినియోగదారులకు పేటి‌ఎం  యూ‌పి‌ఐ, పేటి‌ఎం వాలేట్, పేటి‌ఎం పోస్ట్ పెయిడ్ (ఇప్పుడు కొనండి, తరువాత చెల్లించండి), డెబిట్, క్రెడిట్ కార్డులు లేదా నెట్-బ్యాంకింగ్ నుండి  నచ్చిన పేమెంట్ మోడ్‌ను ఎంచుకునే సౌలభ్యాన్ని ఇస్తుంది.

also read ఐఫోన్ 12 కొనడానికి ప్లాన్ చేస్తున్నారా..? అయితే అతి తక్కువ ధరకే కొనలంటే ఇది తెలుసుకోండి..

పేటి‌ఎం ప్రతినిధి, “డి‌టి‌ఎం రీఛార్జ్ అనేది భారతదేశవ్యాప్తంగా ఉన్న వినియోగదారుల కోసం మా మొదటి ఆఫర్‌లలో ఒకటి, ఇక్కడ మేము అతుకులు లేని రీఛార్జ్ అనుభవాన్ని అందించడంపై దృష్టి పెట్టాము. క్రికెట్ వరల్డ్ కప్ సమయంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ ఎల్లప్పుడూ క్రికెట్ అభిమానులు ఎంతో  ఆసక్తిగా చూసే మ్యాచ్‌లలో ఒకటి. మా కొత్త క్యాష్‌బ్యాక్ ఆఫర్‌తో మేము మా వినియోగదారులతో ఉత్సాహాన్ని పంచుకుంటాము అని అన్నారు.

పేటి‌ఎం వినియోగదారులు విద్యుత్ బిల్లులు, మొబైల్, బ్రాడ్‌బ్యాండ్ & డి‌టి‌హెచ్ రీఛార్జ్‌లు, రెంట్ చెల్లింపులు, క్రెడిట్ కార్డ్ బిల్లులు అలాగే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్స్, డిజిటల్ గోల్డ్, బీమా ప్రీమియంలు చెల్లించడం, రైలు/విమాన టిక్కెటింగ్ ద్వారా డబ్బు నిర్వహణను యాక్సెస్ చేయవచ్చు.

పేటి‌ఎం గురించి:
భారతదేశంలోని ప్రముఖ డిజిటల్ ఏకొ సిస్టం పేటి‌ఎం వినియోగదారులకు, వ్యాపారులకు  31 మార్చి  2021 నాటికి 333 మిలియన్ వినియోగదారులకు ఇంకా 21 మిలియన్లకు పైగా వ్యాపారులకు చెల్లింపు సేవలు, బిజినెస్ అండ్ క్లౌడ్ సేవలు, ఆర్థిక సేవలను అందిస్తుంది. భారతదేశంలో అతిపెద్ద చెల్లింపుల ప్లాట్ ఫార్మ్ పేటి‌ఎం 31 మార్చి 2021 నాటికి వినియోగదారుల సంఖ్య, వ్యాపారుల సంఖ్య, వినియోగదారుల నుండి వ్యాపార లావాదేవీలు, ఆదాయాల ఆధారంగా FY2021 జి‌ఎం‌వి 4,033 బిలియన్. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios