దేశీయ టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ బెస్ట్ వీడియో, గేమింగ్ అండ్ వాయిస్ యాప్ ఎక్స్పీరియెన్స్ లో మరోసారి తన అగ్రస్థానాన్ని నిలుపుకుంది. ప్రస్తుత మార్కెట్లో జియో వంటి పోటీదారులతో పోటీపడుతూ బెస్ట్ నెట్ వర్క్ గా నిలిచింది.

టెలికాం పరిశ్రమ గత దశాబ్దంలో చాలా మార్పులాను చూసింది. 3జి ఇంకా 4జి వచ్చినప్పటి నుండి కంప్యూటర్లు చేయగలిగే ప్రతిది స్మార్ట్ ఫోన్లు చేయగలుగుతున్నాయి.

అయితే టెక్నాలజి అభివృద్ధి చెందడంతో పాటు భారతీయ టెలికం ఆపరేటర్లు కూడా వారి కస్టమర్లకు బెస్ట్ సర్వీస్ అందిస్తున్నాయ... ప్రస్తుతం ఉన్న వాటిలో ఏదో ఒకటి ఇతరు టెలికాం ఆపరేటర్ల కంటే మెరుగైన సేవలను అందిస్తుంటుంది.. రైట్ ?

మనమందరం ఆశ్చర్యపోతుండొచ్చు, ఏంటంటే ఓపెన్సిగ్నల్ ఇండిపెండెంట్ గ్లోబల్ స్టాండర్డ్ కస్టమర్ల మొబైల్ అనుభవాన్ని విశ్లేషించడానికి స్వయంగా ఛాలెంజ్ తీసుకుంది.

ఓపెన్‌ సిగ్నల్ అనేది లక్షల డివైజెస్ నుండి నెట్‌వర్క్, పనితీరును ప్రతిరోజూ సేకరిస్తుంది. విభిన్న పారమీటర్స్ నెట్‌వర్క్ అందించే నిశ్చయాత్మక రేటింగ్‌ను విడుదల చేయడానికి కలిసి కంపైల్ చేస్తుంది. మార్చి 2021 ఓపెన్‌సిగ్నల్ రిపోర్ట్ వెల్లడైంది ఇందులో మరోసారి ఎయిర్‌టెల్ నెట్‌వర్క్‌లోని వినియోగదారులు బెస్ట్ వీడియో అనుభవం, వాయిస్ యాప్ అనుభవం, గేమింగ్ అనుభవాన్ని ఆస్వాదిస్తున్నట్లు చూపించింది.

ఈ విషయం పై కాస్త లోతుగా చేద్దాం...

వీడియో అనుభవం
గత త్రైమాసికం నుండి ఎయిర్‌టెల్ రేటింగ్‌ 2.8 పాయింట్లు పెరిగినట్లు ఈ నివేదికలో చూపిస్తుంది. నేడు ఆన్‌లైన్‌లో చిన్న వీడియోల వ్యూస్, యుసెజ్ వినియోగదారుల ప్రధాన భాగంగా మారింది. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ ఇంకా ఓ‌టి‌టి ప్లాట్‌ఫారమ్‌లు ఇండియాలో మొబైల్ డేటా ట్రాఫిక్‌లో 50% వరకు దోహదం చేస్తున్నాయి.

ఇది వినియోగదారులకు మంచి వీడియో అనుభవం ప్రాముఖ్యతను హైలైట్ చేస్తుంది. దీనిని నిర్ధారించుకోవడానికి ఎయిర్‌టెల్ నిరంతరం తన సేవలను మెరుగుపరుచుకుంటోంది అలాగే ఇతర పోటీదారులతో పోలిస్తే టెలికాం లీడర్ గా తన స్థానాన్ని కొనసాగిస్తోంది.

also read నాలుగు కెమెరాలతో అతితక్కువ ధరకే పోకో ఎం2 రీలోడెడ్ వెర్షన్.. దీని బెస్ట్ ఫీచర్స్ ఇవే.. ...

గేమ్స్ అనుభవం
ఇటీవలి కాలంలో ముఖ్యంగా మొబైల్ వినియోగదారులకు గేమింగ్ ఒక ముఖ్యమైన క్యాటగిరిగా అవతరించింది. ఒక నెట్‌వర్క్‌ ఆపరేటర్ లోని రియల్ టైమ్ మల్టీప్లేయర్ మొబైల్ గేమింగ్ అనుభవాన్ని ఓపెన్‌సిగ్నల్ గేమ్స్ అనుభవం అంచనా వేస్తుంది.

ఇది సి‌ఓ‌డి మొబైల్ లేదా గారెనా ఫ్రీఫైర్, ఎం‌ఓ‌బి‌ఏ ( ఆన్‌లైన్ మల్టీప్లేయర్ బ్యాటిల్ అరేనా) అరేనా ఆఫ్ వాలర్ వంటి పాపులర్ మొబైల్ గేమ్స్ జోనర్స్ అనుభవాన్ని సూచిస్తుంది. సెప్టెంబర్ 2020లో ఓపెన్‌సిగ్నల్ మొదటిసారి మొబైల్ వినియోగదారులు భారతదేశంలోని వివిధ ఆపరేటర్లలో రియల్ టైమ్ మల్టీప్లేయర్ గేమింగ్‌ను ఎలా అనుభవిస్తున్నారో అంచనా వేసింది. ఎయిర్టెల్ మల్టీప్లేయర్ గేమ్స్ అనుభవంలో 58.5 పాయింట్ల స్కోరుతో భారతదేశంలో విజయం సాధించింది. 


వాయిస్ యాప్ అనుభవం
 ఓవర్-ది-టాప్ వాయిస్ సర్విసెస్ కాల్ నాణ్యతను ఓపెన్‌సిగ్నల్ వాయిస్ యాప్ ఎక్స్పిరియన్స్ కొలుస్తుంది. దీనిలో వాట్సాప్, ఫేస్‌బుక్ మెసెంజర్, స్కైప్ వంటి మొబైల్ వాయిస్ యాప్స్ ఉన్నాయి. ఇందులో కూడా ఎయిర్‌టెల్ మరోసారి 77.8 పాయింట్లతో ఈ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది,

అయితే చివరి త్రైమాసికంతో పోలిస్తే 2.3 పాయింట్ల పెరుగుదల నమోదైంది. గత మూడు నెలల్లో యాప్ ద్వారా వాయిస్ కాల్స్ నాణ్యతలో ఎయిర్‌టెల్‌ వినియోగదారులు గణనీయమైన మెరుగుదల చూశారు.

మీరు వీక్ కనెక్టివిటీ అండ్ నెట్‌వర్క్ సమస్యలతో విసిగిపోయి ఉన్నారా.. ఇతర నెట్ వర్క్ లోకి మారాలని ఆలోచిస్తూన్నారా అయితే మీకు బెస్ట్ సేవలను అందిస్తున్న నెట్ వర్క్ ఏదో తెలుసుకోవడానికి ఈ రిపోర్ట్ చాలా ఉపయోగపడుతుంది.