వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ 5జి స్మార్ట్ ఫోన్.. గేమింగ్ కోసం కొత్త ఫీచర్లు.. ధర కూడా తక్కువే..
వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ 5జిలో కూడా ఒకే ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13.1ని పొందుతుందని కూడా ధృవీకరించింది. ఫోన్‌లో క్విక్ గేమ్ అండ్ గేమ్ ఫోకస్ మోడ్ ఉంది.
స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ 5జి స్మార్ట్ ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 4న లాంచ్ కానుంది. అయితే ఇంతకుముందే ఈ ఫోన్ అన్ని ఫీచర్లు లీక్ అయ్యాయి. కంపెనీ కూడా వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ 5G ఫోన్ కొన్ని ఫీచర్ల గురించి సమాచారం ఇచ్చింది. ఈ ఫోన్ డిజైన్ గురించి కంపెనీ స్వయంగా ట్వీట్ చేసింది. అయితే నార్డ్ సిఈ 3 లైట్ గురించి ఇప్పుడు మళ్ళీ వార్తలు వస్తున్నాయి, ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.72-అంగుళాల డిస్‌ప్లే పొందుతుంది. అంటే పాత వెర్షన్ Nord CE 2 Liteకి 6.59 అంగుళాల డిస్‌ప్లే ఉంది.
వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ 5జిలో కూడా ఒకే ప్రాసెసర్ ఉంది. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ 13 ఆధారిత ఆక్సిజన్ OS 13.1ని పొందుతుందని కూడా ధృవీకరించింది. ఫోన్‌లో క్విక్ గేమ్ అండ్ గేమ్ ఫోకస్ మోడ్ ఉంది. ఇది అవాంఛిత నోటిఫికేషన్‌లను బ్లాక్ చేస్తుంది. అంతేకాకుండా, మెరుగైన గేమింగ్ కోసం GPA ఫ్రేమ్ స్టెబిలైజర్ ఫోన్‌లో ఇచ్చారు.
దీని ప్రకారం ఈ ఫోన్ 108-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను పొందుతుంది, దానితో 3x లాస్‌లెస్ జూమ్ ఉంటుంది. ఫోన్ బ్యాక్ ప్యానెల్‌లో ట్రిపుల్ కెమెరా సెటప్ లభిస్తుంది.
వన్ ప్లస్ నార్డ్ సిఈ 3 లైట్ 5జిని 5000mAh బ్యాటరీతో తీసుకొస్తున్నారు, దీనితో 67W SUPERVOOC ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. ఫోన్ పాస్టెల్ లైమ్ అండ్ క్రోమాటిక్ గ్రే రంగులలో అందించబడుతుంది. OnePlus Nord CE 3 Lite 5G ప్రారంభ ధర రూ. 21,999. దీనిని 8జిబి ర్యామ్ అండ్ 128జిబి స్టోరేజ్ వేరియంట్‌లో అందించబడుతుంది.