Asianet News TeluguAsianet News Telugu

మీరు నిద్రపోతే టీవీని ఆఫ్ చేసే ఫీచర్ తో వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్‌ వచ్చేసింది.. దీని స్పెషల్ ఫీచర్స్ తెలుసా ?

ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్‌ను  కూడా భారత్‌లో లాంచ్ చేసింది. ఇది సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్ వాచ్.  అలాగే ఇది ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లేతో వస్తుంది.

oneplus first smartwatch launched in india know price and specifications here
Author
Hyderabad, First Published Mar 24, 2021, 1:09 PM IST

స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్ కొత్త 9 సిరీస్‌తో పాటు  ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్‌ను  కూడా భారత్‌లో లాంచ్ చేసింది. ఇది సంస్థ యొక్క మొట్టమొదటి స్మార్ట్ వాచ్.  అలాగే ఇది ఏ‌ఎం‌ఓ‌ఎల్‌ఈ‌డి డిస్ ప్లేతో వస్తుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌వాచ్‌తో వన్‌ప్లస్ టీవీని కూడా ఆపరేట్ చేయవచ్చు. ఈ వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్‌ ధర రూ .16,999. షియోమి, అమేజ్‌ఫిట్, హువావే వంటి సంస్థల స్మార్ట్‌వాచ్‌లకు పోటీగా  దీనిని తీసుకొచ్చారు.

వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్‌ స్పెసిఫికేషన్లు
454x454 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో 1.39 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే దీనికి ఉంది. డిస్ ప్లేకి 2.5డి కర్వ్ గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఉంది. మీ ఫోన్‌కి వచ్చే అన్ని కాల్స్, మెసేజెస్ లను ఈ స్మార్ట్‌వాచ్‌ మిమ్మలి అలెర్ట్ చేస్తుంది. ఇది కాకుండా మీరు మీ వన్‌ప్లస్ స్మార్ట్‌వాచ్  మొత్తం సెట్టింగ్‌లను మీ స్మార్ట్‌ఫోన్ తో మార్చగలుగుతారు. అలాగే, మీకు వన్‌ప్లస్ టీవీ ఉంటే మీరు దాన్ని మీ స్మార్ట్‌వాచ్‌తో చాలా వరకు కంట్రోల్ చేయవచ్చు.

also read షార్ట్ వీడియో క్రియేటర్స్ కి గుడ్ న్యూస్.. ఇప్పుడు మార్నింగ్ స్టార్ రికార్డర్స్ తో చింగారి యాప్ చేతులు...

 మీరు తక్కువ వాల్యూమ్‌లో టీవీ చూస్తుంటే ఈ వాచ్ మీ వన్‌ప్లస్ టీవీని   మీరు నిద్రపోతున్నంత సేపు ఆఫ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఫిట్‌నెస్ ఔత్సాహికుల కోసం, వన్‌ప్లస్ వాచ్‌లో 110 వర్కౌట్ మోడ్‌లు ఉన్నాయి. అలాగే ఈ వాచ్ లో ఆటోమేటిక్ వర్కౌట్‌లను గుర్తించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ వాచ్ లో బ్లడ్ ఆక్సిజన్‌ను పర్యవేక్షించడానికి SpO2 మానిటర్ ఉంది. 

అంతేకాకుండా  స్ట్రెస్  రికాగ్నైజేషన్, బ్రిడ్జింగ్, హార్ట్ బీట్ సెన్సార్,  సెడెంటరీ రిమైండర్  ఫీచర్స్ కూడా ఉన్నాయి. కనెక్టివిటీ కోసం బ్లూటూత్ కాకుండా ఈ వాచీ లో జి‌పి‌ఎస్ సపోర్ట్ కూడా ఉంది. ఈ వాచ్ IP68 ఇంకా 5ATM వాటర్ రెసిస్టెంట్‌తో వస్తుంది.  ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 405 ఎమ్ఏహెచ్ బ్యాటరీ ఉంది.  ఒక వారం వరకు బ్యాటరీ బ్యాకప్  ఉంటుందాని కంపెనీ పేర్కొంది.

Follow Us:
Download App:
  • android
  • ios