వన్ ప్లస్ కొత్త ఎడిషన్ స్మార్ట్ ఫోన్.. స్ట్రాంగ్ బ్యాటరీ, వావ్ ఫీచర్లతో లాంచ్..
ఆండ్రాయిడ్ కలర్ ఓఎస్ 12.1 వన్ ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్‌లో అందించారు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎల్‌టిపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే లభిస్తుంది.
వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ వన్ ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్‌ను లాంచ్ చేసింది. వన్ ప్లస్ ఏస్ రేసింగ్ ఎడిషన్ వన్ ప్లస్ ఏస్ సిరీస్‌లో కొత్తది. OnePlus Ace గత నెలలో చైనాలో ఆవిష్కరించాగా తరువాత OnePlus 10Rగా ఇండియన్ మార్కెట్లోకి ప్రవేశపెట్టరు. OnePlus Ace రేసింగ్ ఎడిషన్ 12జిబి వరకు ర్యామ్, 120Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లేతో కస్టమ్ మీడియాటెక్ డైమెన్సిటీ 8100-మాక్స్ ప్రాసెసర్ ప్యాక్ తో వస్తుంది. ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఇచ్చారు.
ధర
OnePlus Ace రేసింగ్ ఎడిషన్ 8జిబి ర్యామ్‌తో 128జిబి స్టోరేజ్ ధర 1,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ. 23,000, అయితే 8జిబి ర్యామ్ 256జిబి స్టోరేజ్ ధర 2,199 యువాన్ అంటే దాదాపు రూ. 25,300, 12జిబి ర్యామ్ 256జిబి స్టోరేజ్ ధర 2,499 యువాన్లు అంటే దాదాపు రూ. 28,800. మే 31 నుంచి చైనాలో ఈ ఫోన్ సేల్ ప్రారంభం కానుంది. ప్రస్తుతం ఈ ఫోన్ గ్లోబల్ మార్కెట్‌లో లాంచ్ ఆవుతుందా లేదా అనే వార్తలు లేవు.
ఫీచర్స్
ColorOS 12.1 ఆండ్రాయిడ్ 12తో OnePlus Ace రేసింగ్ ఎడిషన్‌లో అందించారు. అంతేకాకుండా 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.59-అంగుళాల పూర్తి HD ప్లస్ LTPS LCD డిస్‌ప్లే, MediaTek Dimensity 8100-Max ప్రాసెసర్‌ని మోడిఫై చేశారు. ఇప్పుడు గరిష్టంగా 12 GB LPDDR5 RAMతో 256 GB వరకు స్టోరేజ్ ఉంది.
కెమెరా
OnePlus నుండి వచ్చిన ఈ కొత్త ఫోన్‌లో మూడు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, ఇందులో ప్రైమరీ లెన్స్ 64 మెగాపిక్సెల్‌లు f/1.7 ఎపర్చరుతో ఉంటుంది. రెండవ లెన్స్ 8 మెగాపిక్సెల్స్ అల్ట్రా వైడ్ యాంగిల్, మూడవ లెన్స్ 2 మెగాపిక్సెల్స్ మాక్రో సెన్సార్. సెల్ఫీ కోసం ఫోన్‌లో 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు.
బ్యాటరీ
కనెక్టివిటీ కోసం ఫోన్‌లో 5G, 4G LTE, Wi-Fi 6, బ్లూటూత్ v5.3, GPS / A-GPS, NFC, USB టైప్-C పోర్ట్ అండ్ 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంది. ఫోన్ 67W సూపర్ ఫ్లాష్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో 5000mAh బ్యాటరీ ఇచ్చారు.