బెస్ట్ కెమెరా ఫీచర్ తో వన్‌ప్లస్ కొత్త సిరీస్.. మార్చి 23న అఫిషియల్ లాంచ్..
వన్‌ప్లస్ 9 సిరీస్ మార్చి 23న ప్రారంభించనున్నారు. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9ఇతో సహా మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లను వన్‌ప్లస్ 9 సిరీస్ కింద విడుదల చేయనున్నారు.
చాలా కాలం తరువాత చైనా కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం వన్‌ప్లస్ తాజాగా కొత్త 9 సిరీస్ అధికారిక లాంచ్ తేదీని ప్రకటించారు. వన్‌ప్లస్ 9 సిరీస్ మార్చి 23న ప్రారంభించనున్నారు. వన్‌ప్లస్ 9, వన్‌ప్లస్ 9 ప్రో, వన్‌ప్లస్ 9ఇతో సహా మొత్తం మూడు స్మార్ట్‌ఫోన్‌లను వన్‌ప్లస్ 9 సిరీస్ కింద విడుదల చేయనున్నారు.
వన్‌ప్లస్ 9 సిరీస్ కెమెరా కోసం కంపెనీ కెమెరా తయారీ సంస్థ హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. అంతే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ కెమెరా పై పరిశోధన, మెరుగుదల కోసం 150 మిలియన్ డాలర్లు అంటే సుమారు ఇండియాలో రూ.1,094 కోట్ల ఖర్చు చేస్తామని కంపెనీ తెలిపింది. ఈ ఖర్చు రాబోయే మూడేళ్లలో ఉంటుంది.
వన్‌ప్లస్ 9 సిరీస్ మార్చి 23న రాత్రి 7.30 గంటలకు ప్రారంభించనున్నారు. లాంచింగ్ ఈవెంట్‌ను కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ప్రత్యక్షంగా చూడవచ్చు. ట్రెడిషనల్ ఫోటోగ్రఫీలో కంపెనీకి చాలా అనుభవం ఉందని, వన్‌ప్లస్ 9 సిరీస్ కెమెరాకు మంచి స్పందన లభిస్తుందని నేను ఖచ్చితంగా చెప్పగలను ఎందుకంటే సంస్థ హాసెల్‌బ్లాడ్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది అని వన్‌ప్లస్ సీఈఓ పిట్ లా అన్నారు.
వన్‌ప్లస్ సంస్థ హాసెల్‌బ్లాడ్ గత మూడు సంవత్సరాలుగా కలిసి పనిచేస్తుస్తుంది. వన్‌ప్లస్ 9 సిరీస్‌తో పాటు హాసెల్‌బ్లాడ్ సెన్సార్ కాలిబ్రేషన్‌తో ప్రత్యేకమైన హాసెల్‌బ్లాడ్ ప్రో మోడ్ ఉంటుంది, దీని ద్వారా ఫోటోలో సహజ రంగులలో వస్తాయి. ప్రో మోడ్‌లో ఐఎస్‌ఓ, ఫోకస్, ఎక్స్‌పోజర్ టైమ్, వైట్ బ్యాలెన్స్ అడ్జస్ట్ చేయవచ్చు.
వన్‌ప్లస్ 9 సిరీస్ పేజీ వన్‌ప్లస్ ఇండియా వెబ్‌సైట్‌లో "మూన్‌షాట్" పేరుతో ప్రత్యక్ష ప్రసారం అయ్యీంది. కానీ కొత్త సిరీస్ ఫోన్ లేదా మోడల్ గురించి అధికారికంగా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు.
వన్‌ప్లస్ 9 సిరీస్ ఫీచర్స్
ఇప్పటివరకు వచ్చిన సమాచారం ప్రకారం వన్‌ప్లస్ 9 ప్రోకు కర్వ్ డిస్ ప్లే లభిస్తుంది. అలాగే ముందు భాగంలో పంచ్ హోల్ ఉంటుంది. ఆటో ఫోకస్ సెన్సార్‌తో ఫోన్‌లో క్వాడ్ కెమెరా సెటప్ ఉంది. వన్‌ప్లస్ 9 ప్రోలో 6.78-అంగుళాల క్యూహెచ్‌డి + అమోలెడ్ డిస్‌ప్లేతో క్యూహెచ్‌డి + (3120x1440 పిక్సెల్స్) రిజల్యూషన్ ,120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు లభిస్తుంది.