వన్‌ప్లస్ 2020 మొదటి నెలల్లో వన్‌ప్లస్ 8 ప్రో స్మార్ట్  ఫోన్ ని విడుదల చేయనుంది అయితే దీనికి  వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో రానుంది. ఇది వన్‌ప్లస్ బ్రాండ్ నుండి వస్తున్న మొదటి వైర్‌లెస్ ఛార్జింగ్ స్మార్ట్‌ఫోన్ అవుతుంది.ఇది చాలా కాలంగా అందరూ ఎదురుచూస్తున్న ఫీచర్, ఎందుకంటే చాలా పాపులర్ ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌లు కొంతకాలంగా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తున్నాయి.

also read బిఎస్‌ఎన్‌ఎల్ ప్రీపెడ్ ప్లాన్ లో మార్పులు...రిచార్జ్ వాలిడిటీ తగ్గింపు...


వన్‌ప్లస్ 8 ప్రో వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుందని మాక్స్ జె ట్విట్టర్‌లో వెల్లడించారు.ఈ వార్తలు నిజమైతే, ఇది బ్రాండ్ కోసం ఒక కొత్త మార్పును సూచిస్తుంది. గతంలో వన్‌ప్లస్  వైర్‌లెస్ ఛార్జింగ్ టెక్నాలజి దాని ఫాస్ట్ ఛార్జింగ్ వైర్డ్ సొల్యూషన్‌ కంటే నెమ్మదిగా ఉందని చెప్పింది.

ఈ కొత్త మార్పుకు కారణం 30W వైర్‌లెస్ VOOC ఛార్జింగ్‌తో అనుసంధానించబడుతుంది. దీనిని వన్‌ప్లస్ బ్రాండ్ ఒప్పో అభివృద్ధి చేస్తోంది.గత ఏడాది ఒప్పో తన సొంత సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ వైర్‌లెస్ టెక్నాలజీని విడుదల చేసింది. 30W వైర్‌లెస్ VOOC ఛార్జింగ్ ట్రెడిషనల్ వైర్డ్ ఛార్జింగ్ పద్ధతి ద్వారా ప్రస్తుతం వన్‌ప్లస్ అందించే 30W వార్ప్ ఛార్జీకి సమానం.ఒప్పో అభివృద్ధి చేసిన అదే సూపర్-ఫాస్ట్ ఛార్జింగ్ వైర్‌లెస్ టెక్నాలజీని వన్‌ప్లస్ ఉపయోగించుకునే అవకాశం ఉంది.

also read అమెరికా ఔట్.. స్మార్ట్ ఫోన్ల సేల్స్‌లో ఇండియా సెకండ్ ప్లేస్!

వైర్‌లెస్ ఛార్జింగ్ అంటే ఏమిటి?

వైర్‌లెస్ ఛార్జింగ్ ఆలోచన ఏమిటంటే, మీ స్మార్ట్‌ఫోన్‌ను  వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్‌ పై ఉంచడం ద్వారా ఛార్జ్ చేస్తుంది.వైర్‌లెస్ ఛార్జింగ్ ఏకైక ఇబ్బంది ఏమిటంటే, కేబుల్ ఉపయోగించి స్మార్ట్‌ఫోన్‌ను పవర్ అవుట్‌లెట్‌లోకి ప్లగ్ చేసినంత వేగంగా ఉండకపోవచ్చు.అవును, ఇది ఫోన్‌కు వైర్‌లెస్ ఛార్జింగ్‌ను జోడించడం ద్వారా వచ్చే సౌలభ్యాన్ని అందిస్తుంది. క్యూ‌ ఐ  అనుకూలమైన పవర్ మాట్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి.


ఆండ్రాయిడ్ ఫోన్‌లు మాత్రమే కాదు, ఐఫోన్‌లు కూడా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తాయి. 2017 లో, ఆపిల్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే మొదటి రెండు ఐఫోన్‌లైన ఐఫోన్ 8 మరియు ఐఫోన్ ఎక్స్‌లను విడుదల చేసింది. అప్పటి నుండి, ప్రతి కొత్త ఐఫోన్ Qi స్టాండర్డ్ సపోర్ట్ చేస్తుంది.