Asianet News TeluguAsianet News Telugu

ఇప్పుడు మీరు యుట్యూబ్ షార్ట్స్ తో షాపింగ్ చేయవచ్చు.. కంపెనీ కొత్త ఫెసిలిటీ, ప్రత్యేకత ఏమిటో తెలుసా..?

నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ సహాయంతో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉత్పత్తులను చిన్న వీడియోలలో ట్యాగ్ చేయవచ్చు, దీని వల్ల వ్యూవర్స్ ఉత్పత్తిని కొనుగోలు చేయడం సులభం అవుతుంది. 

Now you will be able to shop with YouTube Shorts know what is special
Author
First Published Nov 16, 2022, 4:43 PM IST

వీడియో స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్ యుట్యూబ్ కొత్త మార్పును తీసుకురాబోతోంది. ఈ ప్లాట్‌ఫారమ్‌లో త్వరలో యూట్యూబ్ షార్ట్‌ల కోసం షాపింగ్ ఫీచర్‌ను చేర్చనున్నట్లు కంపెనీ మంగళవారం ప్రకటించింది. ఈ ఫీచర్‌తో మీరు మార్కెటింగ్ అండ్ షార్ట్‌ల ద్వారా ట్యాగ్ చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసే సదుపాయాన్ని పొందుతారు. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను అమెరికా, భారత్‌తో సహా పలు దేశాల్లో పరీక్షిస్తున్నారు. తాజాగా కంపెనీ టి‌వి కోసం యుట్యూబ్ షార్ట్స్ ఫీచర్‌ను లాంచ్ చేసింది.

నివేదిక ప్రకారం, ఈ ఫీచర్ సహాయంతో ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉత్పత్తులను చిన్న వీడియోలలో ట్యాగ్ చేయవచ్చు, దీని వల్ల వ్యూవర్స్ ఉత్పత్తిని కొనుగోలు చేయడం సులభం అవుతుంది. ఈ ఫీచర్ ప్రస్తుతం USలో సెలెక్ట్ చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌ల కోసం రూపొందించబడింది. అలాగే ఈ ఫీచర్ అమెరికా, ఇండియా, బ్రెజిల్, కెనడా అండ్ ఆస్ట్రేలియా వంటి దేశాల్లో పరీక్షించబడుతోంది. యూట్యూబ్ కొత్త ఫీచర్ల ఆధారంగా త్వరలో ఇ-కామర్స్ రంగంలో కూడా  ప్రయత్నించాలని ఆలోచిస్తున్నట్లు అంచనా. 

టిక్‌టాక్‌ని కాపీ 
గత వారంలోనే షార్ట్ వీడియో ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్ కూడా యాప్‌లో షాపింగ్ ప్రోగ్రామ్‌ను పరీక్షించడం ప్రారంభించింది. టిక్‌టాక్ ఫీచర్‌లను కాపీ చేయడం ద్వారా యూట్యూబ్ షార్ట్ వీడియో పోటీలో ఉండాలనుకుంటుందని ఊహాగానాలు చేస్తున్నారు. తాజాగా గూగుల్ AI స్టార్టప్ ఆల్టర్‌ని కొనుగోలు చేసింది. నివేదిక ప్రకారం, ఆల్టర్ అనేది వీడియో క్రియేటర్స్ కోసం AI-ఆధారిత అవతార్. ఆల్టర్ చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్‌కి చాలా పోలి ఉంటుంది. అయితే భారత ప్రభుత్వం టిక్‌టాక్‌ని నిషేధించిన సంగతి మీకు తెలిసిందే.

టి‌వి కోసం యుట్యూబ్ షార్ట్స్ ఫీచర్
గూగుల్ యుట్యూబ్ షార్ట్స్ టి‌వి కోసం గ్లోబల్ అప్‌డేట్‌ లాంచ్ చేసింది. యుట్యూబ్ స్మార్ట్ టీవీ యాప్‌తో మీరు వీడియోలను చూడవచ్చు. YouTube Shorts TV యాప్‌లో  మీరు ఒక నిమిషం లేదా అంతకంటే తక్కువ నిడివి ఉన్న వీడియోలను మాత్రమే చూస్తారు. మొబైల్ యాప్‌లో కేవలం 60 సెకన్ల వీడియోలను చూసే అవకాశం మీకు లభిస్తుంది. YouTube TV కోసం YouTube Shortsను చాలా ఆప్టిమైజ్ చేసింది. యూట్యూబ్ ఒక ప్రకటనలో యాప్  కుడి వైపు భాగాన్ని మేము ప్రత్యేకంగా రూపొందించాము, తద్వారా యూజర్లు నిలువు  వీడియోలను సౌకర్యవంతంగా చూడవచ్చు. కొత్త అప్‌డేట్ తర్వాత, మీ టీవీ అనుభవం అద్భుతంగా ఉంటుందని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము అని తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios