Asianet News TeluguAsianet News Telugu

వాట్సాప్ కొత్త అద్భుతమైన ఫీచర్‌.. వేరే యాప్స్ అవసరం లేకుండా.. మీకు మీరే మెసేజ్ చేసుకోవచ్చు..

మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ మల్టీ డివైజ్ సపోర్ట్ కోసం పరిచయం చేసారు. ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ విడుదల చేసింది. WhatsApp ఈ కొత్త ఫీచర్ సహాయంతో మీరు చేయవలసిన లిస్ట్, షాపింగ్ లిస్ట్, నోట్స్ మొదలైనవాటిని పెట్టుకోవచ్చు. 

Now you can send messages to yourself on WhatsApp, company has released a new feature know how it works
Author
First Published Nov 29, 2022, 6:20 PM IST

ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ వినియోగదారుల సౌలభ్యం అండ్ యూజర్ ఇంటర్‌ఫేస్‌ను మెరుగుపరచడానికి కొత్త ఫీచర్‌ను లాంచ్ చేసింది. ఈ ఫీచర్ మొదట టెస్టింగ్ కోసం విడుదల చేసింది. ఇప్పుడు దీనిని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఈ ఫీచర్ ఏంటంటే 1:1 చాట్, అంటే మీ ముఖ్యమైన నోట్స్, రిమైండర్‌లు ఇంకా డాక్యుమెంట్స్ సేవ్ చేయడానికి, మీకు మీరే మెసేజ్ పంపడానికి ఉపయోగపడుతుంది.

సెల్ఫ్ మెసేజ్  వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?
మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ మల్టీ డివైజ్ సపోర్ట్ కోసం పరిచయం చేసారు. ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ విడుదల చేసింది. WhatsApp ఈ కొత్త ఫీచర్ సహాయంతో మీరు చేయవలసిన లిస్ట్, షాపింగ్ లిస్ట్, నోట్స్ మొదలైనవాటిని పెట్టుకోవచ్చు. ముఖ్యమైన నోట్స్, రిమైండర్‌లు అండ్ అప్ డేట్స్ గుర్తుంచుకోవడానికి కూడా ఉపయోగించవచ్చు. సింపుల్‌గా చెప్పాలంటే, వాట్సాప్ కొత్త ఫీచర్ మీరే  చేయాలనుకునే పనులు లేదా రిమైండెర్స్  వాట్సప్ లో సేవ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది.

మీరు ఈ ఫీచర్‌ని ఎన్నో విధాలుగా సద్వినియోగం చేసుకోవచ్చు. మీరు నోట్స్ తీసుకోవడానికి  ఇంకా లింక్‌లను బుక్‌మార్క్ చేయడానికి ఉపయోగించుకోవచ్చు ఇందుకు  మీరు ప్రత్యేకంగా ఇతర యాప్‌ని డౌన్‌లోడ్ చేయనవసరం లేదు. అలాగే, ఈ ఫీచర్ తో ల్యాప్‌టాప్, టాబ్లెట్ ఇంకా మొబైల్ నుండి ఫోటో-వీడియో అండ్ డేటాను సులభంగా షేర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ iOS అండ్ Android యూజర్ల కోసం విడుదల చేయబడింది. 

మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్ ఎలా పని చేస్తుందంటే
మెసేజ్ యువర్ సెల్ఫ్ ఫీచర్‌ని ఉపయోగించడానికి మీరు ముందుగా మీ ఫోన్‌లో WhatsAppని ఓపెన్ చేయాలి 
ఇప్పుడు యాప్ స్క్రీన్ కుడి వైపున కింద మూలన ఉన్న మెసేజ్ బాక్స్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఇప్పుడు ఇక్కడ మీరు కాంటాక్ట్స్ లిస్ట్ చూస్తారు, అయితే కొత్త అప్‌డేట్ తర్వాత మీరు మీ నంబర్ కాంటాక్ట్  చూడవచ్చు
చివరగా మీ ఫోటోతో కనిపించే మీ కాంటాక్ట్ పై నొక్కండి, ఆపై మీరు చాట్‌ని స్టార్ట్ చేయవచ్చు. అంటే, మీరు మీకే మెసేజెస్ పంపవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios