ఈ ఏడాది ప్రారంభంలో ఐదు కెమెరాలతో వినియోగదారుల ముంగిట్లోకి ఒక ఫోన్ తీసుకొచ్చింది. నోకియా. కొంగ్రొత్త ఆప్షన్లతో ఆ ఫోన్‌ యువత మనసు దోచుకున్నది. ఇప్పుడు దానికి కొనసాగింపుగా మరో మొబైల్‌ తీసుకురావడానికి సన్నాహాలు చేస్తోంది. గతంలో పెంటా కెమెరాతో వచ్చిన నోకియా 9 ప్యూర్‌వ్యూ ఫోన్‌కు కొనసాగింపుగా నోకియా 9.1 ప్యూర్‌వ్యూ పేరుతో మరో మొబైల్‌ సిద్ధమవుతోంది. ఈసారి ఒక కెమెరా యాడ్‌ చేస్తారని సమాచారం. ఇందులోనూ ఆరు కెమెరాలుంటాయని తెలుస్తోంది.  

also read వివో నుంచి ఐక్యూ నియో విడుదల: అద్భుతమైన ఫీచర్లు

నోకియా సరికొత్త వాటర్‌ఫాల్ డిస్‌ప్లేతో ఈ ఫోన్‌ను తేనున్నట్లు సమాచారం. ఫోన్‌ పైభాగం అంచులవరకు అంటే దాదాపు 100 శాతం పూర్తి డిస్‌ప్లేతో అందుబాటులోకి తీసుకురానున్నదని తెలుస్తోంది. గొరిల్లా గ్లాస్‌ 6 ప్రొటెక్షన్‌తోపాటు ఈ ఫోన్‌లో మొత్తం ఆరు కెమెరాలను అమర్చినట్లు తెలుస్తోంది. సెల్ఫీ కెమెరా కోసం పైభాగంలో చిన్నపాటి బార్‌ను ఉంచారు.

బ్యాకప్‌లో 9 ప్యూర్‌వ్యూ లానే ఇందులో కూడా వృత్తాకారంలో ఐదు కెమెరాలు ఉండబోతున్నాయని తెలుస్తోంది. వీటితోపాటు టైం ఆఫ్ ఫ్లైట్ కెమెరా కూడా ఇస్తున్నారన్న విషయం లీకైంది.  అల్యూమినియం ఫ్రేమ్‌, గ్లాస్‌ బాడీతో ఈ ఫోన్‌ రానుందని తెలుస్తోంది. ఆండ్రాయిడ్‌ 10 ఓఎస్‌‌తో పనిచేస్తుందట. ఇందులో 3500ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉండబోతున్నట్లు సమాచారం. 

also read వచ్చేనెలలో... రియల్ మీ ఎక్స్ 2 ప్రో

ఇప్పటివరకు ఈ వాటర్‌ ఫాల్ డిస్‌ప్లే వివో నెక్స్‌ 3, హువావే మేట్‌ 30 ప్రో మొబైల్స్‌లో మాత్రమే ఉంది. రాడికల్ డిజైన్‌తో రూపుదిద్దుకున్న నోకియా 9.1 ప్యూర్ వ్యూ వన్ ప్లస్ 7టీ ఫోన్‌ను సరిపోలి ఉంటుంది. టైమ్ ఆఫ్ ఫ్లైట్ (టీఓఎఫ్) సెన్సర్ ఏర్పాటుతో ఇమేజ్‪లు, వీడియోల ఆక్యురేట్ డెప్త్ ఇన్ఫర్మేషన్ లభిస్తుంది.