కేవలం రూ.2,000కే ఈ లేటెస్ట్ స్మార్ట్ వాచ్..! బెస్ట్ ఫీచర్లతో ఇలా బుక్ చేసుకోండి..
ఈ వాచ్ కి 1.99" డిస్‌ప్లే సైజ్ తో పెద్ద టచ్ ఏరియా ఉంది. 240*283 పిక్సెల్‌లు, 500 NITS బ్రైట్ నెస్ ఇంకా పెద్ద డిస్‌ప్లే కారణంగా వాచ్ బెజెల్ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించదు. కస్టమర్ సులభంగా తాకవచ్చు ఇంకా కంట్రోల్ చేయవచ్చు.
స్మార్ట్‌వాచ్‌ల విషయానికి వస్తే రూ.4000ల పైబడిన వాచీలలో ఫీచర్లు, సౌకర్యాలు ఎక్కువే. అయితే తక్కువ ధరకు కూడా ఎన్నో ఫీచర్లతో కూడిన వాచీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ లైనప్ లో ఇప్పుడు ఫైర్ బోల్ట్ నుండి కొత్త వాచ్ వచ్చేసింది. దాని పేరు ఫైర్ బోల్ట్ ఎటర్నో.
ఈ వాచ్ కి 1.99" డిస్‌ప్లే సైజ్ తో పెద్ద టచ్ ఏరియా ఉంది. 240*283 పిక్సెల్‌లు, 500 NITS బ్రైట్ నెస్ ఇంకా పెద్ద డిస్‌ప్లే కారణంగా వాచ్ బెజెల్ ప్రాంతంలో ఎక్కువ భాగాన్ని ఆక్రమించదు. కస్టమర్ సులభంగా తాకవచ్చు ఇంకా కంట్రోల్ చేయవచ్చు. వాచ్‌లో కనిపించే అక్షరాలు కూడా పెద్దవిగా ఉంటాయి. ఈ కారణంగా, మీరు దగ్గరగా చూడకుండానే మీకు కావలసిన సమాచారాన్ని సులభంగా చూడవచ్చు.
లేటెస్ట్ చిప్‌సెట్, సరికొత్త బ్లూటూత్ టెక్నాలజీ, బ్లూటూత్ కాలింగ్ మోడ్ దీనిలో అందించారు. కాబట్టి, మీరు ప్రయాణంలో కూడా కాల్స్ చేయవచ్చు, ఇన్‌కమింగ్ కాల్స్ చెక్ చేయవచ్చు. అలాగే, ఈ స్మార్ట్‌వాచ్‌లో AI వాయిస్ అసిస్టెంట్ ఉంది.
ముఖ్యంగా, 120 కంటే ఎక్కువ స్పోర్ట్స్ మోడ్‌లు దీనిలో ఉన్నాయి. లేటెస్ట్ సెన్సార్లు, టెక్నాలజితో అన్ని ఆక్టివిటీస్ చూడవచ్చు. ఖాళీగా ఉన్నప్పుడు మీరు కాసేపు స్మార్ట్‌వాచ్‌లో గేమ్స్ ఆడవచ్చు. దీని కోసం కొన్ని ఇంటర్నల్ గేమ్స్ ఉన్నాయి.
మొబైల్ ఫోన్ లాగానే ఈ స్మార్ట్ వాచ్ కూడా స్ప్లిట్ స్క్రీన్ ఫీచర్‌తో వస్తుంది. దీనిలో మీరు ఒకే స్క్రీన్‌ని రెండుగా విభజించడం ద్వారా మీరు రీసెంట్ ఉపయోగించిన ఫంక్షన్‌లు అండ్ ఫీచర్‌లు ఈజీగా చూడవచ్చు. 100 కంటే ఎక్కువ వాచ్ ఫేస్‌లు క్లౌడ్ ఆధారిత వాచ్ ఫేస్‌లుగా అందించబడతాయి. కాబట్టి, మీరు ప్రతిరోజూ కొత్త లుక్‌తో వాచ్‌ని ఉపయోగించవచ్చు.
Fire-Bolt Eterno వాచ్ ఇప్పటికే అందుబాటులో ఉంది. యూజర్లు అమెజాన్‌లో దీన్ని ఆర్డర్ చేయవచ్చు. మొత్తం ఆరు కలర్స్ లో వస్తుంది. దీని ధర 2 వేల రూపాయలు.