ఐఫోన్ 12 బాక్స్‌లో నో ఛార్జర్.. ఆపిల్‌కు భారీ జరిమానా విధించిన బ్రెజిల్..

బ్రెజిలియన్ కన్‌స్యూమర్‌ ప్రొటక్షన్‌ రెగ్యులేటర్‌ ప్రోకాన్-ఎస్‌పి  ఆపిల్‌కు 2 మిలియన్లు అంటే సుమారు 15కోట్ల జరిమానా విధించింది. కంపెనీ  ప్రకటనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, అలాగే ఛార్జర్ లేకుండా స్మార్ట్ ఫోన్ విక్రయించడం, కంపెనీ నిబంధనలు అన్యాయమైనవి అని ఆరోపించింది.
 

No charger in iPhone 12 box Brazil fines 15 crores to Apple

కొత్తగా లాంచ్ చేసిన ఐఫోన్ 12 సిరీస్‌ స్మార్ట్ ఫోన్ లలో ఛార్జర్‌ను అందించనందుకు బ్రెజిలియన్ కన్‌స్యూమర్‌ ప్రొటక్షన్‌ రెగ్యులేటర్‌ ప్రోకాన్-ఎస్‌పి  ఆపిల్‌కు 2 మిలియన్లు అంటే సుమారు 15కోట్ల జరిమానా విధించింది. కంపెనీ  ప్రకటనలు తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని, అలాగే ఛార్జర్ లేకుండా స్మార్ట్ ఫోన్ విక్రయించడం, కంపెనీ నిబంధనలు అన్యాయమైనవి అని ఆరోపించింది.

పర్యావరణ కారణాల వల్ల కొత్త ఫ్లాగ్‌షిప్‌ స్మార్ట్ ఫోన్ ను ఛార్జర్, ఇయర్‌బడ్‌లు లేకుండా అందించనున్నట్లు గత అక్టోబర్‌లో ఆపిల్ తెలిపింది. ఈ అసెసోరిస్ తయారు చేయకపోవడం ద్వారా కార్బన్ ఉద్గారాలను తగ్గించగలుగుతామని కంపెనీ తెలిపింది. ఆపిల్ విపి లిసా జాక్సన్  మాట్లాడుతూ వినియోగదారులు పవర్ ఎడాప్టర్లను వైర్‌లెస్ ఛార్జింగ్ పద్ధతులతో భర్తీ చేస్తున్నారు, అలాంటపుడు ఐఫోన్ బాక్సులలో ఎడాప్టర్లను చేర్చడం వృధా అనిపిస్తుంది అని అన్నారు.

ఐఫోన్ 12 సిరీస్‌ స్మార్ట్ ఫోన్ బాక్సులలో ఛార్జర్‌ను తొలగించిన తర్వాత కొత్త ఫ్లాగ్‌షిప్ స్మార్ట్ ఫోన్ ధరను కంపెనీ తగ్గిస్తుందా అని రెగ్యులేటర్ ప్రశ్నించింది. కానీ ఆపిల్ దీనికి స్పందించలేదు.

also read రిలయన్స్ జియోకి ఎయిర్‌టెల్ గట్టి షాక్.. తగ్గిపోతున్న ఆక్టివ్ యూజర్లు.. కారణం ఏంటంటే ? ...

"బ్రెజిల్లో దృఢమైన వినియోగదారుల రక్షణ చట్టాలు, సంస్థలు ఉన్నాయని ఆపిల్ అర్థం చేసుకోవాలి" అని ప్రోకాన్-ఎస్‌పి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఫెర్నాండో కాపెజ్ అన్నారు. అలాగే దేశంలోని చట్టాలు, సంస్థలకు కంపెనీ కట్టుబడి ఉండాలి, వాటిని గౌరవించాలి అని ఫెర్నాండో కాపెజ్ గుర్తించారు.

ఆపిల్‌ కంపెనీ ఛార్జర్‌ లేకుండా ఉన్న ఐఫోన్‌, పర్యావరణానికి ఏవిధంగా లాభం చేకుర్చే విషయాన్ని వివరించలేదని ప్రోకాన్‌- ఎస్పీ తెలిపింది. అంతేకాకుండా ఐఫోన్‌11 ప్రో వాడే వినియోగదారులకు వాటర్‌లో డ్యామేజ్‌ అయిన ఐఫోన్లను రిపేర్‌ చేయలేదని తెలిపారు.

ప్రోకాన్-ఎస్‌పి జరిమానాలపై ఆపిల్ ఇంకా స్పందించలేదు. ఐఫోన్ 12 మినీ ధర యూ.‌ఎస్ లో  729 డాలర్లు కాగా, బ్రెజిల్‌లో ఈ ఫోన్ ధర  1,200 డాలర్లు. ఆపిల్ అక్టోబర్‌లో ఐఫోన్ 12 సిరీస్‌ను పరిచయం చేసింది. అంతేకాకుండా పవర్ అడాప్టర్, హెడ్‌ఫోన్‌లు లేకుండా ఫోన్‌లో ఛార్జింగ్ కేబుల్ మాత్రమే ఉంటుందని ప్రకటించింది.

మా ఈ నిర్ణయంతో సుమారు  2 మిలియన్ మెట్రిక్ టన్నుల కార్బన్‌ను తగ్గించవచ్చునని ఆపిల్  కంపెనీ తెలిపింది, ఇది ఒక ఏడాదిలో 450,000 కార్లను తొలగించడానికి సమానమని పేర్కొంది

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios