అర్జెంటుగా డబ్బు కావాలా? మీకు క్రెడిట్ కార్డ్ ఉంటే లోన్ ఈజీ.. ఈ విషయాలు తెలుసుకోండి
అత్యవసరంగా డబ్బు అవసరమైనప్పుడు ఓ అప్షన్ ఉపయోగించవచ్చు. తక్కువ వడ్డీ రేటుతో త్వరగా డబ్బులు పొందే ఆ ఆప్షన్ ఏమిటంటే...
మీరు క్రెడిట్ తీసుకున్నారా.. ? అయితే క్రెడిట్ కార్డు ఎక్కువగా బిల్లులు చెల్లించడానికి, షాపింగ్ లేదా వస్తువులను కొనడానికి ఉపయోగిస్తారు. అయితే క్రెడిట్ కార్డుతో లోన్ తీసుకోవచ్చని ఎంత మందికి తెలుసు ? చాలా బ్యాంకులు అత్యవసర అవసరాలకు క్రెడిట్ కార్డ్ నుండి లోన్ పొందే అవకాశాన్ని అందిస్తున్నాయి. ఎక్కువ పేపర్ వర్క్ లేకుండా ఇంకా ఎలాంటి ఆలస్యం లేకుండా ఈ లోన్ పొందవచ్చు. పర్సనల్ లోన్ లాగానే క్రెడిట్ కార్డ్ లోన్ కూడా తీసుకోవచ్చు.
అనుకోకుండా లేదా ఎమర్జెన్సీగా డబ్బు అవసరాలు తలెత్తినప్పుడు ఈ అప్షన్ ఉపయోగించవచ్చు. క్రెడిట్ కార్డ్ లోన్ సాధారణంగా తక్కువ వడ్డీ రేటు ఇంకా త్వరగా డబ్బు అందేలా చేస్తుంది. ఈ లోన్‌లు తక్కువ ప్రాసెసింగ్ ఫీజుతో ఉంటాయి, దీని ద్వారా మొత్తం ఖర్చును తగ్గించడంలో సహాయపడుతుంది. సాధారణంగా, ఈ లోన్లు 24 నెలల వరకు తిరిగి చెల్లించే టైం అందిస్తాయి, అంటే లోన్ తిరిగి చెల్లించడానికి తగినంత టైం లభిస్తుంది.
క్రెడిట్ కార్డ్ లోన్ పొందడానికి డాక్యుమెంటేషన్ చాలా ఈజీ కానీ క్రెడిట్ కార్డ్ కోసం దరఖాస్తు చేసేటప్పుడు, ఈ డాకుమెంట్స్ సాధారణంగా అవసరం:
* అడ్రస్ ప్రూఫ్
* ఐడెంటిటీ ప్రూఫ్
* లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
* గత మూడు నెలల జీతం స్లిప్‌లు (జీతం పొందే ఉద్యోగుల కోసం)
* ఆఫీస్ ID కార్డ్ జిరాక్స్ (జీతం పొందే ఉద్యోగుల కోసం)
* తాజా ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) కాపీ (సెల్ఫ్ ఎంప్లాయిస్ దరఖాస్తుదారుల కోసం)
* పాన్ కార్డ్ కాపీ (సెల్ఫ్ ఎంప్లాయిస్ దరఖాస్తుదారుల కోసం)