ట్విట్టర్‌ లేటెస్ట్ అప్ డేట్ ఫీచర్.. ఇప్పుడు 4కె ఫోటోలను కూడా అప్ లోడ్ చేయవచ్చు..

చాలా కాలంగా సోషల్ మీడియా ఫ్లాట్ ఫార్మ్  ట్విట్టర్ ఒక ఫీచర్ పరీక్షిస్తోంది, అదేంటంటే  ఇప్పుడు ట్విట్టర్ లో 4కే ఫోటోలను అప్ లోడ్ చేసేందుకు  అండ్రాయిడ్ అండ్ ఐ‌ఓ‌ఎస్ రెండింటికీ   సారికొత్త ఫీచర్ తీసుకొచ్చింది.
 

micro blogging twitter update now everyone tweet pictures in 4k on android and ios

 మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ప్రజలు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఇప్పుడు 4కె ఫోటోలను ట్వీట్ చేయడానికి, చూడటానికి సౌకర్యాన్ని కల్పించింది.

ట్విట్టర్  అధికారిక హ్యాండిల్ ద్వారా ట్వీట్ చేస్తూ ఈ సమాచారాన్ని తెలిపింది. 4కె ఫోటోలను ట్వీట్ చేయడం లేదా చూడటానికి ఇప్పుడు అండ్రాయిడ్  ఇంకా ఐ‌ఓ‌ఎస్ రెండింటికీ  ఈ ఫీచర్  అందించింది.

ట్విట్టర్ వెబ్ వెర్షన్ లో ఇప్పటికే హై రిజల్యూషన్ ఉన్న ఫోటోలను షేర్ చేయడానికి సపోర్ట్ ఉంది, అంటే 4096x4096 పిక్సెల్స్ రిజల్యూషన్ వరకు ఫోటోలను షేర్ చేయవచ్చు.

also read 6జి, ఐ‌ఓ‌టి, ఏ‌ఐ అభివృద్ది పై భారత్, ఆస్ట్రేలియా రీసెర్చ్ ప్రోగ్రాం.. త్వరలోనే జియో 5జి నెట్‌వర్క్‌....

కానీ ఇంతకుముందు మొబైల్ కోసం  2048x2048 పిక్సెల్స్ రిజల్యూషన్ వరకు మాత్రమే సపోర్ట్ ఉండేది. మొబైల్ యాప్ నుండి 4కె ఫోటోలను అప్‌లోడ్ చేసేందుకు ట్విట్టర్ చాలా కాలంగా దీనిని పరీక్షిస్తోంది, ఇప్పుడు ఇది అందరికీ  అందుబాటులోకి వచ్చింది.

4కే ఫోటోల అప్ లోడ్ కోసం మీరు యాప్ సెట్టింగ్‌లకు వెళ్లి తరువాత "డేటా యుసెజ్" ఆప్షన్ ఎంచుకోవాలి. అక్కడ మీకు "హై-క్వాలిటీ ఫోటోలు" ఆప్షన్ చూపిస్తుంది.

దానిని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీరు ట్విట్టర్  మొబైల్ యాప్ లో 4కె ఫోటోలను అప్‌లోడ్ చేసి చూడవచ్చు. దీనికి వై-ఫై అండ్ మొబైల్ నెట్‌వర్క్‌ల ఆప్షన్ కూడా ఉంటుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios