గూగుల్ అసిస్టెంట్‌ సపోర్ట్ తో లెనోవా కొత్త స్మార్ట్ క్లాక్.. స్పెషల్ ఫీచర్స్ ఇవే..

ఈ వాచ్ ను ఐరోపాలో గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేశారు. దీనికి ఎల్‌ఈ‌డి డిస్‌ప్లేతో  మీకు టైమ్, వాతావరణం, ఉష్ణోగ్రత గురించి సమాచారం చూపిస్తుంది. 

lenovo smart clock essential launched in india with google assistant priced at rs 4499 see specifications

లెనోవా  స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ భారతదేశంలో లాంచ్ అయ్యింది. ఇది ఒక కనెక్టెడ్ డిజిటల్ వాచ్, గొప్ప విషయం ఏంటంటే దీనికి  గూగుల్ అసిస్టెంట్  సపోర్ట్ కూడా ఉంది. ఈ వాచ్ ను ఐరోపాలో గత ఏడాది సెప్టెంబర్‌లో విడుదల చేశారు.

దీనికి ఎల్‌ఈ‌డి డిస్‌ప్లేతో  మీకు టైమ్, వాతావరణం, ఉష్ణోగ్రత గురించి సమాచారం చూపిస్తుంది. ఇంకో విషయం ఏంటంటే ఈ వాచ్ లో ఒక యాంబియంట్ లైట్ సెన్సార్‌ ఉంది, ఇది ఆటోమేటిక్ గా డిస్‌ప్లే లైట్ తగ్గించడానికి లేదా పెంచడానికి సహాయపడుతుంది.

లెనోవా స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్ ధర
భారతదేశంలో దీని ధర  రూ .4,499. దీనిని ఫ్లిప్‌కార్ట్ లేదా లెనోవా వెబ్‌సైట్ నుండి కొనుగోలు చేయవచ్చు.  సాఫ్ట్ టచ్ గ్రే కలర్ వేరియంట్‌లో వస్తుంది.  

also read 32 జిబి ర్యామ్‌తో వైయో కొత్త ల్యాప్‌టాప్ లాంచ్.. స్టోరేజ్, ఫీచర్స్, ధర తెలుసుకోండి.. ...

లెనోవా స్మార్ట్ క్లాక్ ఎసెన్షియల్  స్పెసిఫికేషన్లు
ఫీచర్స్ గురించి చూస్తే  4-అంగుళాల ఎల్ఈడి డిస్‌ప్లే, అలాగే ఈ  డిజిటల్ వాచ్ లో అమ్లాజిక్ ఎ 113 ఎక్స్ ప్రాసెసర్ ఉంది, 4 జిబి ర్యామ్, 512 ఎంబి స్టోరేజ్ అందించారు. దీని గరిష్ట శక్తి 3Wతో 1.5W స్పీకర్ ఉంది. దీనికి రెండు మైక్రోఫోన్లు ఉన్నాయి.

మీ ఫోన్ లేదా  ఇతర డివైజెస్ ఛార్జ్ చేయగలిగే  యూ‌ఎస్‌బి పోర్ట్  ఉంది. మైక్రోఫోన్‌ను డిసేబుల్ చేసే సౌకర్యం కూడా ఇందులో ఉంది.

ఈ వాచ్ ని స్మార్ట్ అలారం కోసం ఉపయోగించవచ్చు. దీనిలో సన్‌రైజ్ అలారం మోడ్‌ను కూడా  ఉంది, ఇది ఆన్ చేసినప్పుడు డిస్ ప్లే  లైట్, రంగును సమయానికి అనుగుణంగా మారుస్తుంది.  కనెక్టివిటీ కోసం వై-ఫై 802.11ac, బ్లూటూత్ 5.0 ను ఉంది. ఈ వాచ్ బరువు 240 గ్రాములు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios