2022లో 11వేలు.. 2023లో 10వేలు.. ఉద్యోగులను ఇంటికి పంపే పనిలో మెటా కంపెనీ..

మెటా కంపెనీ నుండి మరో 10,000 మంది ఉద్యోగులను తొలగించనుంది. ఈ వార్త మెటా కంపెనీ ఉద్యోగులను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. మెటా తొలగింపులు పూర్తయిన తర్వాత, గ్రూప్ హైరింగ్ అండ్ ట్రాన్సఫర్ ఫ్రీజ్‌లను తొలగిస్తామని జుకర్‌బర్గ్ ఇమెయిల్‌లో స్పష్టం చేశారు.

Layoffs 2023: Meta to fire 10,000 employees in second round of job cuts-sak

ప్రపంచంలోనే ప్రముఖ సోషల్ మీడియా సంస్థ మెటా.. 10,000 మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. మెటా 2023 ప్రకారం, మెటా 2022లో 11,000 ఉద్యోగాలను, ఈ సంవత్సరంలో మరో 10,000 ఉద్యోగాలను తొలగించనుంది. మెటా ఒక ప్రకటనలో లేఆఫ్ గురించి ప్రకటించింది. దీనిపై Meta CEO మార్క్ జుకర్‌బర్గ్ మాట్లాడుతూ టెక్ టీమ్‌లలో పునర్నిర్మాణం, తొలగింపులు ఏప్రిల్ చివరిలో జరుగుతాయని, అయితే బిజినెస్ టీమ్‌లు మే చివరి నాటికి ప్రభావితమవుతాయని అన్నారు. అయితే రెండవ రౌండ్ తొలగింపులను ప్రకటించిన మొదటి బిగ్ టెక్ కంపెనీ ఇదే.

'రాబోయే రెండు నెలల్లో మేము మా కంపెనీ ప్రేయారీటి కార్యక్రమాలను రద్దు చేయడం, నియామక రేట్లను తగ్గించడంపై దృష్టి సారించి పునర్నిర్మాణ ప్రణాళికలను అమలు చేస్తాము. నేను కష్టమైన నిర్ణయం తీసుకున్నాను. రిక్రూట్‌మెంట్ టీమ్ సభ్యులు ప్రభావితమైతే మేము మీకు తెలియజేస్తాము,'' అని తొలగించబడిన మెటా సిబ్బందికి ఇమెయిల్‌లో తెలిపారు.

ఉద్యోగులకు పంపిన ఇమెయిల్‌లో, మెటాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయని, వ్యాపారాన్ని మెరుగుపరచడానికి ఇంకా మెరుగైన ఫలితాలను సాధించడానికి కంపెనీ సోర్సెస్ మరింత సమర్థవంతంగా ఉపయోగించాలని యోచిస్తున్నట్లు మార్క్ జుకర్‌బర్గ్ సూచించారు. 2022కి ముందు మెటా చాలా వృద్ధిని సాధించిందని ఆయన అందులో పేర్కొన్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మారిపోయింది, పోటీ పెరుగుతోంది.  మా శ్రామికశక్తిలో 13 శాతం మందిని తొలగించేందుకు మేము కఠినమైన నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు.

టెక్ కంపెనీ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నందున ఇది చాలా మందికి షాక్‌గా ఉండవచ్చు. గత కొన్ని నెలల్లో Meta 11,000 మంది ఉద్యోగులను తొలగించింది ఇంకా రాబోయే నెలల్లో మరో 10,000 మందిని తొలగించనుంది. మెటా తొలగింపులు పూర్తయిన తర్వాత, గ్రూప్ హైరింగ్ అండ్ ట్రాన్సఫర్ ఫ్రీజ్‌లను తొలగిస్తామని జుకర్‌బర్గ్ ఇమెయిల్‌లో స్పష్టం చేశారు.

'పునర్నిర్మాణం తర్వాత ప్రతి గ్రూప్‌లో రిక్రూట్‌మెంట్ అండ్ ట్రాన్సఫర్ లలో మార్పులు చేయాలని మేము ప్లాన్ చేస్తున్నాము. గత సంవత్సరం నుండి టెక్ పరిశ్రమలో తొలగింపులు కొనసాగుతున్నందున, 2023 చాలా మందికి బ్యాడ్ ఇయర్ గా మారింది.

చాలా పెద్ద టెక్ కంపెనీలు కాస్ట్ సేవింగ్స్, టీమ్‌ల తగ్గింపు పేరుతో వేలాది మంది ఉద్యోగులను తొలగిస్తున్నాయి. పనితీరు ఆధారంగానే తొలగింపులు జరుగుతాయని కొన్ని కంపెనీలు తొలగించిన ఉద్యోగులకు తెలిపాయి. అయితే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన వారిని కూడా తొలగించినట్లు తేలింది. ఈ ఏడాది ప్రారంభంలో మైక్రోసాఫ్ట్ 10,000 మంది ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించింది.

గూగుల్ 12,000 మంది కార్మికులను తొలగించింది. అమెజాన్ 18,000 ఉద్యోగాలను తొలగించింది, ట్విట్టర్‌లో మరికొంత మందిని తొలగించినట్లు కూడా వార్తలు వచ్చాయి.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios