Asianet News TeluguAsianet News Telugu

ఆపిల్ ఐఫోన్ కొనేందుకు లాస్ట్ ఛాన్స్.. బెస్ట్ డిస్కౌంట్ ఆఫర్ తో ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా..

మీరు ఐఫోన్ 13 మినీ 256జి‌బి స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 65,900కి కొనుగోలు చేయవచ్చు. అలాగే  ఐఫోన్ 13 మినీ 512జి‌బి స్టోరేజ్ మోడల్ ధర రూ. 94,900కి అందుబాటులో ఉంది. 

Last chance to buy iPhone 13 mini at a great price, getting the best offer
Author
First Published Dec 29, 2022, 3:31 PM IST

ఈ ఏడాది 2022 సంవత్సరం చివరికి చేరుకుంది. పాత సంవత్సరంతో పాటు కొన్ని పాత చెదు జ్ఞాపకాలను కూడా వదిలి కొత్త సంవత్సరంలోకి అడుగుపెడతారు. ఈ సంవత్సరం మీలో చాలా మంది తప్పనిసరిగా ఎన్నో గాడ్జెట్‌లను కొని ఉంటారు ఇంకా కొత్త సంవత్సరంలో చాలా మంది కొన్ని లేటెస్ట్  గాడ్జెట్‌లను కొనాలని ప్లాన్ చేస్తుంటారు. 2022లో ఐఫోన్ కొనాలనుకునే వారిలో మీరు కూడా ఒకరు అయితే మీకో గుడ్ న్యూస్. అయితే ఐఫోన్ 13 మినీపై ప్రస్తుతం అందుబాటులో ఉన్న బెస్ట్ ఆఫర్‌ల గురించి మీకోసం..

ఐఫోన్ 13 మినీపై గొప్ప ఆఫర్
మీరు ఐఫోన్ 13 మినీ 256జి‌బి స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 65,900కి కొనుగోలు చేయవచ్చు. అలాగే  ఐఫోన్ 13 మినీ 512జి‌బి స్టోరేజ్ మోడల్ ధర రూ. 94,900కి అందుబాటులో ఉంది. ఐఫోన్ 13 మినీని ఈ ధరతో అమెజాన్ ఇండియా నుండి రెడ్ బ్లూ, మిడ్‌నైట్ ఇంకా పింక్ కలర్స్‌లో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 మినీ 256 జి‌బి స్టోరేజ్ లాంచింగ్ ధర రూ. 74,900.

అమెజాన్ ఆఫర్లు
అమెజాన్ ప్రస్తుతం ఐఫోన్ 13 మినీతో మూడు ఆఫర్లను అందిస్తోంది. అమెజాన్ పే ఐ‌సి‌ఐ‌సి‌ఐ క్రెడిట్ కార్డ్‌తో 3 నెలలు ఇంకా 6 నెలల EMIతో సహా రెండు EMI ఆప్షన్స్ ఉన్నాయి. అంతేకాకుండా, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో 6 నెలల ఆఫర్ కూడా ఉంది. ఫోన్‌తో పాటు రూ.13,300 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.

ఆపిల్ ఐఫోన్ 13
 అమెజాన్ ఐఫోన్ 13పై కూడా గొప్ప ఆఫర్లను అందిస్తుంది. ఈ ఫోన్ 128జి‌బి స్టోరేజ్ వేరియంట్‌ను 13% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 13 256జి‌బి మోడల్‌ను 11% తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు.

ఆపిల్ ఐఫోన్ 13 మినీ అండ్ ఐఫోన్ 13 స్పెసిఫికేషన్లు
ఆపిల్ ఐఫోన్ 13 మినీలో ఆపిల్ A15 బయోనిక్ చిప్‌సెట్‌  ఉంది, దీనితో పాటు iOS 15 లభిస్తుంది. ఫోన్ కి అల్యూమినియం ఫ్రేమ్‌  ఇంకా సిరామిక్ షీల్డ్ గ్లాస్‌తో రక్షించబడింది. ఐఫోన్ 13 మినీలో 5.4-అంగుళాల డిస్‌ప్లే, 12 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు. ఐఫోన్ 13 6.1-అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డి‌ఆర్ OLED డిస్‌ప్లేతో వస్తుంది.

Follow Us:
Download App:
  • android
  • ios