Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో జియో ఫైబర్‌ హై స్పీడ్‌ బ్రాడ్‌ బాండ్‌.. 71 పట్టణాలకు సేవల విస్తరణ..

జియోపైబర్‌ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో తో డ్పడింది. విశ్వసించదగిన, తిరుగులేని హై స్పీడ్‌ బ్రాడ్‌ బాండ్‌ ఇంటర్నెట్‌ తో వారికి ఎంతో ప్రయోజనం కలిగించింది. 

jiofiber expands its high speed broadband services to 71 towns in ap and telangana
Author
Hyderabad, First Published May 12, 2022, 10:45 AM IST

 హైదరాబాద్‌, 12 మే 2022: దేశంలో అత్యంత వేగవంతమైన హై స్పీడ్‌ బ్రాడ్‌ బాండ్‌ గా పేరొందిన జియో ఫైబర్‌ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలో ఉనికిని మరింత పటిష్టం చేసుకుంది. వేగవంతమైన విస్తరణలో భాగంగా జియో పైబర్‌ ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో 71 ముఖ్యమైన నగరాలు, పట్టణాలను చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌ లో జియో పైబర్‌ 43 నగరాలు, పట్టణాల్లో పటిష్ట ఉనికితో  తన నాయకత్వ స్థానాన్ని మరింత  బలోపేతం చేసుకుంది. విజయవాడ, విశాఖపట్నం వంటి ప్రముఖ నగరాలు మాత్రమే గాకుండా, అనకాపల్లి, అనంతపురం, భీమవరం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, కడప, ధర్మవరం, ఏలూరు, గన్నవరం, గుడివాడ, గుంతకల్‌, గుంటూరు, హిందూపురం, ఇబ్రహీంపట్నం, జగ్గయ్యపేట, కాకినాడ, కర్నూలు, మచిలీపట్నం, మదనపల్లె, నందిగామ, నంద్యాల, నరసారావుపేట, నెల్లూరు, నిడదవోలు, నూజివీడు, ఒంగోలు, పెద్దాపురం, పొన్నూరు, ప్రొద్దుటూరు, రాజమండ్రి, శ్రీకాళహస్తి, శ్రీకాకుళం, తాడేపల్లె, తాడేపల్లెగూడెం, తణుకు, తెనాలి, తిరుపతి, వినుకొండ, విజయనగరం, వుయ్యూరులలో కూడా జియో ఫైబర్‌ అందుబాటులోకి వచ్చింది.

మరోవైపు తెలంగాణలో కూడా జియోపైబర్‌ 28 నగరాలు, పట్టణాలకు సేవలను విస్తరించింది. హైదరాబాద్‌ మాత్రమే కాకుండా ఆదిలాబాద్‌, బోధన్‌, భువనగిరి, హనుమకొండ, జగిత్యాల, జనగాం, కోదాడ, కొత్తగూడెం, కామా రెడ్డి, కరీంనగర్‌, ఖమ్మం, మహబూబ్‌ నగర్‌, మంచిర్యాల్‌, మేడ్చల్‌, మిర్యాలగూడ, మహేశ్వరం, నల్గొండ, నిజామాబాద్‌, రామగుండం, సంగారెడ్డి, షాద్‌నగర్‌, శంకర్‌ పల్లి, సూర్యాపేట, తాండూర్‌, వనపర్తి, వరంగల్‌, జహీరాబాద్‌ లో కూడా సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఇంకా త్వరలో మరో 7 పట్టణాలకు విస్తరించనుంది.

జియోపైబర్‌ వేగంగా విస్తరించడం విద్యారంగంలో ఉన్న వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులకు ఎంతగానో తోడ్పడింది. విశ్వసించదగిన, తిరుగులేని హై స్పీడ్‌ బ్రాడ్‌ బాండ్‌ ఇంటర్నెట్‌ తో వారికి ఎంతో ప్రయోజనం కలిగించింది. ఎంతో మంది వృత్తినిపుణులు మరీ ముఖ్యంగా ఐటీ, ఇతర సేవా రంగాలకు చెందిన వారు రాష్ట్రంలోని  స్వస్థలాల నుంచి వర్క్‌ ప్రమ్‌ హోమ్‌ విధానంలో ఎంతో సజావుగా తమ పనులు చేసుకోగలుగుతున్నారు. ఈ పట్టణాల్లోని ఎన్నో చిన్న సంస్థలు, విద్యాసంస్థలు వ్యాపారాలు, వృత్తుల డిమాండ్లకు అనుగుణంగా డిజిటల్‌ విధానంలోకి మారిపోగలిగాయి.

 పెయిడ్‌ ఫ్లాన్‌ యూజర్లకు జియో ఫైబర్‌ ఇప్పుడు ఎలాంటి ప్రవేశ రుసుము లేకుండానే లభిస్తుంది. యూజర్లు జియో ఫైబర్‌ పోస్ట్‌ పెయిడ్‌ కనెక్షన్‌ ను ఎంచుకుంటే రూ.10,000 విలువ కలిగిన ఇంటర్నెట్‌ బాక్స్‌ (గేట్‌ వే రూటర్‌), సెట్‌ టాప్‌ బాక్స్‌, ఇన్‌ స్టాలేషన్‌ ను ఉచితంగానే పొందగలుగుతారు. మరో సంచలనాత్మక ఆఫర్‌ జియో ఫైబర్‌ ఎంటర్‌ టెయిన్‌ మెంట్‌ బొనాంజాతో అదనంగా రూ. 100తోనే అపరిమిత వినోదాన్ని అందిస్తుంది. వినియోగదారులు నెలకు రూ.399ల ప్రారంభ ధరతో ఆన్ లిమిటెడ్ హైస్పీడ్‌ ఇంటర్నెట్‌ కు యాక్సెస్‌ పొందవచ్చు. నెలకు రూ.100 లేదా రూ.200 అదనంగా చెల్లించడంతో  14 ప్రముఖ ఓటీటీ యాప్స్‌ కలెక్షన్‌ నుంచి  నచ్చిన కంటెంట్‌ ను చూడవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణలలో జియో పైబర్‌ ఇళ్లు మొదలుకొని చిన్న, పెద్ద సంస్థలు, వివిధ రంగాలకు చెందిన వృత్తినిపుణులతో సహా లక్షలాది మంది వినియోగదారుల అవసరాలను తీరుస్తోంది. ఆన్ లిమిటెడ్ వినోదం, వార్తలు, ఆరోగ్యం, చదువు లాంటివాటికి వేదికగా నిలుస్తోంది.

Follow Us:
Download App:
  • android
  • ios