యుట్యూబ్ షార్ట్స్, రీల్స్‌కి పోటీగా జియో కొత్త షార్ట్ వీడియో యాప్.. క్రియేటర్స్ కి పండగే...

 జియో  ప్లాట్‌ఫారమ్‌తో యూజర్లు వారి పౌలరీటి ఆధారంగా సిల్వర్, బ్లూ అండ్ రెడ్ కలర్  టిక్ పొందుతారు. క్రియేటర్ ప్రొఫైల్‌తో పాటు బుక్ నౌ బటన్ ఉంటుంది, దీని ద్వారా క్రియేటర్‌ను బుక్ చేసుకోవచ్చు ఇంకా ఫ్యాన్స్ అతనితో కనెక్ట్ అవ్వవచ్చు. 

Jio short video app coming in competition with Instagram Reels, know its features

చైనీస్ షార్ట్ వీడియో యాప్ టిక్‌టాక్ నిషేధం తర్వాత, షార్ట్ వీడియో యాప్‌లు ఇండియాలోకి పెద్దమొత్తంలో వచ్చాయి. వీటిలో అత్యధికంగా హిట్ అయినవి ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్‌లు. టిక్‌టాక్ నిషేధించిన రెండేళ్ల తర్వాత, ఇప్పుడు జియో షార్ట్ వీడియో యాప్‌ను తీసుకురాబోతుంది. నివేదిక ప్రకారం, జియో షార్ట్ వీడియో యాప్ పేరు ప్లాట్‌ఫామ్. ప్లాట్‌ఫారమ్ యాప్ కోసం జియో రోలింగ్ స్టోన్ ఇండియా అండ్ క్రియేటివ్‌ల్యాండ్ ఆసియాతో భాగస్వామ్యం కుదుర్చుకుంది.

ప్లాట్‌ఫామ్ యాప్ పెయిడ్ అల్గారిథమ్‌పై పని చేయదని, దాని గ్రౌత్ ఆర్గానిక్ గా ఉంటుందని చెబుతున్నారు. ఈ యాప్ ద్వారా అద్భుతమైన టాలెంట్ ప్రపంచానికి అందించడమే సంస్థ లక్ష్యం. ప్లాట్‌ఫారమ్‌తో యూజర్లు వారి పౌలరీటి ఆధారంగా సిల్వర్, బ్లూ అండ్ రెడ్ కలర్  టిక్ పొందుతారు. క్రియేటర్ ప్రొఫైల్‌తో పాటు బుక్ నౌ బటన్ ఉంటుంది, దీని ద్వారా క్రియేటర్‌ను బుక్ చేసుకోవచ్చు ఇంకా ఫ్యాన్స్ అతనితో కనెక్ట్ అవ్వవచ్చు. Jio ప్లాట్‌ఫారమ్ యాప్‌లో కూడా మానిటైజేషన్ ఆప్షన్ ఉంటుంది.

కొత్త యాప్‌తో పాటు, జియో ఫౌన్దింగ్స్ మెంబర్స్ ప్రోగ్రామ్‌ను కూడా ప్రవేశపెట్టింది, దీని కింద 100 మంది ఫౌన్దింగ్స్ మెంబర్స్  ఇన్వైట్ -ఓన్లీ ప్రాతిపదికన యాక్సెస్ పొందుతారు ఇంకా వారి ప్రొఫైల్‌తో పాటు గోల్డెన్ టిక్ కూడా పొందుతారు. ఈ మెంబర్స్ కొత్త ఆర్టిస్ట్స్ లేదా క్రియేటర్స్ కూడా ఆహ్వానించవచ్చు. కొత్త సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్ యాప్ లాంచ్ కానుంది. ఇందులో సింగర్, మ్యూజిషియన్, డ్యాన్సర్, ఫ్యాషన్ డిజైనర్ వంటి ప్రభావశీలులు చేరవచ్చు.

కొత్త ప్రాడక్ట్ ప్రారంభించిన సందర్భంగా, జియో ప్లాట్‌ఫారమ్‌ల CEO కిరణ్ థామస్ మాట్లాడుతూ, 'జియో ప్లాట్‌ఫారమ్‌లలో, మా కస్టమర్‌లకు వినూత్న పరిష్కారాలు, అనుభవాలను సృష్టించడానికి డేటా, డిజిటల్ అండ్ అత్యాధునిక సాంకేతికతల శక్తిని ఉపయోగించుకోవడమే మా లక్ష్యం. RIL గ్రూప్‌లో భాగంగా, మేము టెలికాం, మీడియా, రిటైల్, మాన్యుఫ్యాక్చరింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్‌కేర్‌తో సహా పలు పరిశ్రమల వర్టికల్స్‌లో భారతదేశ స్థాయి ప్లాట్‌ఫారమ్‌లు, పరిష్కారాలను విజయవంతంగా అందించాము. ప్లాట్‌ఫారమ్‌ను నిర్మించడానికి రోలింగ్ స్టోన్ ఇండియా అండ్ క్రియేటివ్‌ల్యాండ్ ఆసియాతో భాగస్వామ్యం కావడం పట్ల మేము సంతోషిస్తున్నాము అని అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios