Jio new plan:రూ. 333కే డిస్నీ+హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఫ్రీ.. ఆన్ లిమిటెడ్ కాలింగ్ తో బెనెఫిట్స్ ఇవే..
జియో ఈ కొత్త ప్లాన్ ధర రూ. 333, ఈ ప్లాన్ తో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, జియో యాప్స్ సబ్‌స్క్రిప్షన్ పొందుతారు. జియో ఈ ప్లాన్ వాలిడిటీ 28 రోజులు, అలాగే ప్రతిరోజూ 1.5 జిబి డేటా లభిస్తుంది.
రిలయన్స్ జియో కస్టమర్ల కోసం కొత్త ప్రీ-పెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్ తో డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. ఇంకా Disney + Hotstar సబ్‌స్క్రిప్షన్ మూడు నెలల పాటు ఉంటుంది. జియో ఈ కొత్త ప్లాన్ ధర రూ. 333, దీనితో మీరు అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్, అన్ని జియో యాప్‌లకు సబ్‌స్క్రిప్షన్ పొందుతారు.
ఈ జియో ప్లాన్ వాలిడిటీ 28 రోజులు. ఇంకా ప్రతిరోజూ 1.5 జిబి డేటా లభిస్తుంది. రూ. 333 ప్లాన్ కాకుండా, జియో రూ. 583, రూ. 783 మరో రెండు ప్లాన్‌లను కూడా ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్‌లు 56 రోజులు, 84 రోజుల వాలిడిటీ అందిస్తాయి.
ఈ ప్లాన్‌తో రీఛార్జ్ చేసిన తర్వాత, Jio కస్టమర్‌లు Disney + Hotstar మొబైల్ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి అలాగే వారి Jio నంబర్‌తో లాగిన్ చేయాలి. Jio నంబర్‌కి వచ్చిన OTPతో లాగిన్ అయిన తర్వాత, కస్టమర్‌లు Disney + Hotstarని యాక్సెస్ పొందుతారు. ఇక్కడ గమనించదగ్గ విషయం ఏమిటంటే, ప్లాన్ చెల్లుబాటు 28 రోజులు, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ మూడు నెలలు ఉంటుంది.
అదే విధంగా, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ జియో ఇతర ప్లాన్‌లతో కూడా ఉచితంగా లభిస్తుంది. రూ.499 ప్లాన్ తో ప్రతిరోజూ 2జిబి డేటా లభిస్తుంది. ఈ ప్లాన్‌తో 28 రోజుల వాలిడిటీ, అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్ పొందుతారు. ఇందులో, డిస్నీ + హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ ఒక సంవత్సరం పాటు లభిస్తుంది.
కొద్ది రోజుల క్రితం వచ్చిన టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI) కొత్త నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2022లో రిలయన్స్ జియో 4G డౌన్‌లోడ్ స్పీడ్‌లో టాప్ ప్లేస్ గెలుచుకుంది, అయితే కస్టమర్ల పరంగా, జియో ఈసారి కూడా నష్టపోయింది. TRAI నివేదిక ప్రకారం, ఫిబ్రవరి 2022లో 36.6 లక్షల మంది కస్టమర్‌లు Jioని విడిచిపెట్టారు, అయితే Jioతో పోలిస్తే Airtel చాలా లాభపడింది.