ఇండియాలో ట్రూ 5జి వై-ఫై సేవను పరిచయం చేసిన రిలయన్స్ జియో.. 2 కొత్త నగరాల్లో ట్రు 5జి..

జియో వెల్‌కమ్ ఆఫర్ తాజాగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ప్రారంభించింది. మరిన్ని నగరాలకు విస్తరించేందుకు   ఇంకా ట్రు5G-రెడీ హ్యాండ్‌సెట్‌ల లభ్యతను పెంచడానికి జియో టింస్ 24 గంటలు పని చేస్తున్నాయి.

Jio launches 5G WiFi services in high footfall areas True 5G in 2 new cities says Akash Ambani

న్యూఢిల్లీ, అక్టోబరు 22 : అందరికీ 5జీ అందించేందుకు రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ విద్యా సంస్థలు, మతపరమైన ప్రదేశాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, వాణిజ్య కేంద్రాలు ఇంకా ఇతర  ప్రదేశాలు వంటి అధిక జనసందోహ ప్రాంతాల్లో  జియోట్రు5G-ఆధారిత వై-ఫై సేవలను ప్రవేశపెడుతున్నట్లు శనివారం ప్రకటించింది. 

 జియోట్రు5G సర్వీస్ కి  ఇది అదనం. జియో వెల్‌కమ్ ఆఫర్ తాజాగా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలలో ప్రారంభించింది. మరిన్ని నగరాలకు విస్తరించేందుకు   ఇంకా ట్రు5G-రెడీ హ్యాండ్‌సెట్‌ల లభ్యతను పెంచడానికి జియో టింస్ 24 గంటలు పని చేస్తున్నాయి. ఒక శుభారంభంగా  జియోట్రు5G సేవలతో పాటు జియో రాజస్థాన్‌లోని టెంపుల్ సిటీ నాథ్‌ద్వారాలో జియోట్రు5G-ఆధారిత వై-ఫై సేవలను కూడా ప్రారంభించింది.

జియో వెల్‌కమ్ ఆఫర్ సమయంలో జియో వినియోగదారులు ఎటువంటి ఛార్జీ లేకుండా ఈ సర్వీస్ పొందుతారు, అలాగే నాన్ జియో కస్టమర్‌లు కూడా ఫుల్ అండ్ ఆన్ లిమిటెడ్ సర్వీస్ అనుభవాన్ని పొందడానికి జియో కి మారే ముందు ఈ సర్వీస్ ప్రయత్నింవచ్చు.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ మాట్లాడుతూ "హ్యూమానిటికి సర్వీస్ అనేది భారతీయ సంస్కృతిలో అత్యంత ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి, దీని మూలాలు మన సామాజిక-మత సంప్రదాయాలలో కనిపిస్తాయి.

"ముందు చెప్పినట్లుగా, 5G అనేది  ప్రముఖ వ్యక్తులు లేదా మన అతిపెద్ద నగరాల్లో ఉన్న వారికి ప్రత్యేకమైన సర్వీస్ గా ఉండకూడదు. ఇది భారతదేశం అంతటా ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి ఇంకా ప్రతి వ్యాపారానికి తప్పనిసరిగా అందుబాటులో ఉండాలి. JioTrue5Gతో ప్రతి భారతీయుడిని ఎనేబుల్ చేయడానికి ఇది ఆ దిశగా ఒక అడుగు. 

"ఈ రోజు మేము పవిత్ర పట్టణమైన నాథద్వారా అండ్ శ్రీనాథ్ ఆలయంలో మొదటి True5G-ఎనేబుల్ Wi-Fi సర్వీస్ అందించాము. దీనితో పాటు మేము ఇలాంటి మరిన్ని ప్రదేశాలకు శక్తినిస్తాము ఇంకా మా సేవలను ట్రయల్ చేయడానికి అనుమతిస్తాము. Jio True5G వెల్‌కమ్ ఆఫర్‌లోకి  మా లేటెస్ట్ నగరంగా చెన్నైని మేము స్వాగతిస్తున్నాము.

తాజాగా లాంచ్ సమయంలో వాగ్దానం చేసినట్లుగా JioTrue5G మరిన్ని నగరాల్లోకి విస్తరించబడుతుంది. చెన్నైలోని ఇన్వైటెడ్ Jio యూజర్లు 1 Gbps వరకు ఆన్ లిమిటెడ్ 5G డేటాను యాక్సెస్ చేయవచ్చు ఇంకా JioTrue5G అనుభవాన్ని ఆస్వాదించవచ్చు.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios