ఇండియాలో జియో 5జి సర్వీస్ ప్రారంభం.. 1Gbps స్పీడ్ తో 5జి వెల్‌కమ్ ఆఫర్‌..

జియో 5జి వెల్‌కమ్ ఆఫర్‌ ట్రయల్ చేయడానికి ఆహ్వానించిన కస్టమర్లు ఆటోమేటిక్ గా జియో ట్రూ 5జి సర్వీస్ కి అప్‌గ్రేడ్ చేయబడతారు అలాగే 5G స్మార్ట్‌ఫోన్‌లో 5G సేవలను పొందడానికి వారికి కొత్త సిమ్ అవసరం లేదు. 

Jio 5G Service Launched In India, Announces 5G Welcome Offer With 1Gbps Speed

రిలయన్స్ జియో ఇండియాలో ట్రూ 5జి సర్వీస్ ప్రకటించింది. అక్టోబర్ 5 నుండి అంటే నేటి నుండి ముంబై, ఢిల్లీ, కోల్‌కతా, వారణాసి నాలుగు నగరాలతో ప్రారంభం కానుంది. జియో ట్రూ 5జి సర్వీస్ బీటా ట్రయల్ ఇప్పటికే ఉన్న జియో కస్టమర్లకు ఆహ్వానం ద్వారా అందించబడుతుంది. జియో ట్రూ 5జి బీటా ట్రయల్‌ని పొందుతున్న కస్టమర్‌లు 1Gbps వరకు డేటా స్పీడ్ పొందుతారు.

జియో 5జి వెల్‌కమ్ ఆఫర్‌ ట్రయల్ చేయడానికి ఆహ్వానించిన కస్టమర్లు ఆటోమేటిక్ గా జియో ట్రూ 5జి సర్వీస్ కి అప్‌గ్రేడ్ చేయబడతారు అలాగే 5G స్మార్ట్‌ఫోన్‌లో 5G సేవలను పొందడానికి వారికి కొత్త సిమ్ అవసరం లేదు. జియో ఇప్పటికే హ్యాండ్‌సెట్‌లలో జియో 5జిని ఎనేబుల్ చేసేందుకు ఫోన్ తయారీ కంపెనీలతో కలిసి పనిచేయడం ప్రారంభించింది.

“5G అనేది చాలా తక్కువ మంది లేదా అతిపెద్ద నగరాల్లో ఉన్న వారికి అందుబాటులో ఉండే ప్రత్యేక సర్వీస్ గా ఉండకూడదు. భారతదేశం అంతటా ప్రతి పౌరుడికి, ప్రతి ఇంటికి అలాగే ప్రతి వ్యాపారానికి అందుబాటులో ఉండాలి" అని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ ఛైర్మన్ ఆకాష్ అంబానీ అన్నారు.

జియో నెట్‌వర్క్ విస్తరించడానికి సిద్ధంగా ఉన్నందున 5G బీటా ట్రయల్ సర్వీస్ ఇతర నగరాలకు కూడా తీసుకువస్తుంది. నగరంలో నెట్‌వర్క్ కవరేజ్ పూర్తయ్యే వరకు బీటా ట్రయల్ కస్టమర్ల కోసం కొనసాగుతుంది.

 జియో 5జి‌ నెట్‌వర్క్ స్టాండ్-అలోన్ ఆర్కిటెక్చర్‌పై నిర్మించబడింది, అంటే 4G నెట్‌వర్క్‌పై జీరో డిపెండెన్సీ. ఈ టెక్నాలజి Jio 5Gని లో-లేటెన్సీ నెట్‌వర్క్, 5G వాయిస్ ఫీచర్ అండ్ నెట్‌వర్క్ స్లైసింగ్‌ని అందించడానికి అనుమతిస్తుంది. మెరుగైన ఇండోర్ 5G కవరేజీని చేసే 700 MHz లో-బ్యాండ్ స్పెక్ట్రమ్‌ ఉన్న ఏకైక ఆపరేటర్ కూడా జియో.

జియో వెల్‌కమ్ ఆఫర్ ఏమిటి?
1. ఇన్విటేషన్ ద్వారా ఢిల్లీ, ముంబై, కోల్‌కతా, వారణాసిలోని జియో కస్టమర్ల కోసం జియో ట్రు 5జి వెల్‌కమ్ ఆఫర్ ప్రారంభించింది.
2. ఈ కస్టమర్‌లు 1Gbps స్పీడ్ తో ఆన్ లిమిటెడ్ 5G డేటా పొందుతారు.
3. నెట్‌వర్క్ కవరేజ్ తగినంత బలంగా ఉండే వరకు వినియోగదారులు ఈ బీటా ట్రయల్ బెనెఫిట్స్ పొందుతారు.
4. ఇన్విటేషన్ ద్వారా బీటా ట్రయల్ చేస్తున్న 'జియో వెల్‌కమ్ ఆఫర్' కస్టమర్లు ప్రస్తుత జియో సిమ్‌ను మార్చాల్సిన అవసరం లేదు, అయితే వారి మొబైల్ 5జి ఫోన్ ఉండాలి. Jio True 5G సర్వీస్ ఆటోమేటిక్‌గా అప్‌గ్రేడ్ చేయబడుతుంది.

 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios