ఇప్పుడు ఆఫర్‌తో ఐఫోన్ 14, ఐఫోన్ 13 ధరలలో పెద్దగా తేడా లేదు కానీ ఐఫోన్ 14 కొనుగోలు మాత్రం మీకు బెస్ట్ డీల్ అవుతుంది ఎందుకంటే దీనిలో శాటిలైట్ కనెక్టివిటీ, యాక్షన్ మోడ్ కెమెరా, కార్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను అందిస్తుంది.

మీరు ఐఫోన్ 14 సిరీస్ ఫోన్‌ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా.. మీకో గుడ్ న్యూస్ ఉంది. ఇప్పుడు ఐఫోన్ 14పై గొప్ప తగ్గింపు లభిస్తుంది. ఆపిల్ అఫిషియల్ సైట్ ఇంకా Flipkart కాకుండా ఐఫోన్ 14ని రిటైల్ స్టోర్ల నుండి కూడా డిస్కౌంట్‌తో కొనవచ్చు. ఇమాజిన్ ఆపిల్ i పాడ్ Touch కూడా iPhone 14తో మంచి తగ్గింపును అందిస్తుంది, అయితే Flipkart ద్వారా నేరుగా రూ. 15,000 డిస్కౌంట్ పొందవచ్చు.

ఐఫోన్ 14పై  ఆఫర్ 
ఆపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం రూ. 68,999 ధరకు అందుబాటులో ఉంది, అంటే లాంచ్ ధర కంటే రూ. 11,000 తక్కువ. ఈ ధర iPhone 14 బేస్ వేరియంట్ అంటే 128 GB మోడల్ ధర. ఇది కాకుండా, మీరు హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్‌తో పేమెంట్  చెస్తే మీకు రూ. 4,000 తగ్గింపు లభిస్తుంది.

ఈ విధంగా ఐఫోన్ 14ని రూ.15,000 తగ్గింపుతో కొనుగోలు చేయవచ్చు. ఈ ఆఫర్ తర్వాత, ఫోన్ ధర రూ.64,999గా ఉంటుంది. అలాగే, ఈ ఆఫర్ ప్రస్తుతం రెడ్‌ కలర్ ప్రాడక్ట్ పై  మాత్రమే అందుబాటులో ఉంది. ఇతర వేరియంట్ల ధర రూ.71,999.

ఐఫోన్ 13పై కూడా డిస్కౌంట్
మీరు iPhone 13ని కొనుగోలు చేయాలనుకుంటే, ప్రస్తుతం Flipkartలో తగ్గింపుతో లభిస్తుంది. మీరు ఐఫోన్ 13ని రూ. 61,999 ధరతో కొనుగోలు చేయవచ్చు. మీకు HDFC బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉంటే మీకు అదనంగా రూ. 2,000 తగ్గింపు లభిస్తుంది.

ఇప్పుడు ఆఫర్‌తో ఐఫోన్ 14, ఐఫోన్ 13 ధరలలో పెద్దగా తేడా లేదు కానీ ఐఫోన్ 14 కొనుగోలు బెస్ట్ డీల్ అవుతుంది ఎందుకంటే దీనిలో శాటిలైట్ కనెక్టివిటీ, యాక్షన్ మోడ్ కెమెరా, కార్ క్రాష్ డిటెక్షన్ వంటి ఫీచర్లను అందిస్తుంది.