దక్షిణ ఆసియాలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ అయిన జియోసావన్ తాజాగా సరికొత్త ఫీచర్ విడుదల చేసింది. ప్రత్యేకమైన ఈ వీడియో ఫీచర్ జియోసావన్ టీవీ పేరుతో విదేశీ కంటెంట్ అందించనుంది.

ఇప్పటివరకు రేడియో, పాడ్ క్యాస్ట్ సేవలను అందించిన జియోసావన్ ఇప్పడు వీడియో సేవలను కూడా అందించనుంది. ఈ ప్రత్యేకమైన వీడియో ఫీచర్ వల్ల అద్భుతమైన కంటెంట్ అందించనున్నట్లు పేర్కొంది. 

జియోసావన్ ప్లాట్‌ఫాం ఎంతో ప్రాచుర్యం పొందిన ఆడియో సేవలతో పాటు మ్యూజిక్ కోసం కొత్తగా టెలివిజన్ అనుభవాన్ని సృష్టిస్తుంది. ఈ ఫీచర్ వినియోగదారులకు అత్యధిక నాణ్యత గల వీడియో స్ట్రీమింగ్ అందిస్తుంది.

also read ఐఫోన్ రిపేర్ కి ఇస్తే ఫేస్‌బుక్‌లో నగ్న ఫోటోలు, వీడియొలు లీక్.. ఆపిల్‌ కంపెనీకి కోట్ల జరిమానా.. ...

వినియోగదారులు ఇప్పుడు హోమ్‌పేజీలోని కొత్త ట్యాబ్‌లో మ్యూజిక్ టీవీ ఛానెల్‌లను, మ్యూజిక్ వీడియో ప్లేజాబితాలను యాక్సెస్ చేయవచ్చు. దీనివల్ల చూడాలనుకుంటున్న వీడియోను వెంటనే  చూడటానికి వీలు కలుగుతుంది. కొత్త ఫీచర్ వల్ల ఎందరో పాపులర్ ఆర్టిస్ట్స్ చెందిన వీడియోలను సులభంగా చూడవచ్చు.

ఆగస్టులో, జియోసావన్  ఆర్టిస్ట్ & యూజర్ క్రియేటర్స్ వీడియో కంటెంట్‌ను యాప్ తీసుకురావడానికి ట్రిల్లర్‌తో భాగస్వామ్యం చేసుకుంది. జియో సావన్ ప్రొ వినియోగదారులు ఇప్పుడు విస్తృత వీడియో లైబ్రరీకి యాడ్ ఫ్రీ  అండ్ ఆన్ లిమిటెడ్ అక్సెస్ ఆస్వాదించవచ్చు.  ఫ్రీమియం వినియోగదారులు నెలకు మూడు వీడియోలను చూడవచ్చు.