ఇన్‌స్టాగ్రామ్ అప్ డేట్: ఇప్పుడు మ్యూజిక్ లవర్స్ కోసం అదిరిపోయే ఫీచర్.. ఎలా పని చేస్తుందంటే..?
ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ గురించి టిప్‌స్టర్ అలెశాండ్రో పలుజ్జీ సమాచారం ఇచ్చారు. టిప్‌స్టర్ పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, విజిటెడ్ యూజర్లు ప్రొఫైల్ పేజీలో పాటను ప్లే చేయడానికి ఉండదు.
మెటా యాజమాన్యంలోని ఫోటో-వీడియో షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ త్వరలో కొత్త ఫీచర్లను అందించబోతోంది. ఈ ఫీచర్స్ లో ఒకటి ఇన్‌స్టాగ్రామ్ యూజర్లు ప్రొఫైల్ పేజీకి ఫీచర్ సాంగ్ యాడ్ చేయవచ్చు. ఇది మాత్రమే కాదు, ఈ సాంగ్ యూజర్ల బయో కింద ప్రొఫైల్ పేజీలో కూడా కనిపిస్తుంది. ద్వేషపూరిత ప్రసంగం, ఆన్‌లైన్ దుర్వినియోగాన్ని ఎదుర్కోవటానికి కంపెనీ తాజాగా కఠినతను రెట్టింపు చేసింది.
ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ గురించి టిప్‌స్టర్ అలెశాండ్రో పలుజ్జీ సమాచారం ఇచ్చారు. టిప్‌స్టర్ పోస్ట్ చేసిన స్క్రీన్‌షాట్ ప్రకారం, విజిటెడ్ యూజర్లు ప్రొఫైల్ పేజీలో పాటను ప్లే చేయడానికి ఉండదు. ఈ ఫీచర్ గురించి కంపెనీ ఇంకా ఎటువంటి సమాచారం ఇవ్వనప్పటికీ, ఈ ఫీచర్ ప్రస్తుతం ఇంటర్నల్ ప్రోటోటైప్ అని ఇన్‌స్టాగ్రామ్ ప్రతినిధి తెలిపారు. అయితే ఇప్పటివరకు ఈ ఫీచర్ ఎక్స్టార్నల్ గా పరీక్షించలేదు.
ఈ ఫీచర్ మొదటిసారిగా
ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ యూజర్‌లను ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కి సాంగ్ యాడ్ చేయడానికి అనుమతిస్తుంది. అయితే, ఈ ఫీచర్లు అందరికీ అందుబాటులో ఉండదు. అంటే విజిటెడ్ యూజర్లు ఇతర ప్రొఫైల్ పేజీలో కనిపించే పాటను ప్లే చేయలేరు. ఈ ఫీచర్ మొదటిసారిగా 2006లో MySpace సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ద్వారా పరిచయం చేసారు. ఈ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ 2005 నుండి 2008 మధ్య ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన సోషల్ నెట్‌వర్కింగ్ సైట్‌లలో ఒకటి. అదే సమయంలో 2006 సంవత్సరంలో మైస్పేస్ గూగుల్ అండ్ యాహూ వంటి సెర్చ్ ఇంజిన్‌లను కూడా బీట్ చేసింది.
టిప్‌స్టర్ స్క్రీన్‌షాట్
టిప్‌స్టర్ పలుజ్జీ ప్రకారం ఇన్‌స్టాగ్రామ్ ఈ ఫీచర్ ఇంటర్నల్ టెస్టింగ్ జరుగుతోంది. డెవలపర్ ప్రొఫైల్‌కు సాంగ్ యాడ్ చేయడం పై ఈ ఫీచర్ ని ప్రదర్శించారు. యూజర్లు ప్రొఫైల్‌లోని ఎడిట్ ప్రొఫైల్ సెక్షన్ కి వెళ్లడం ద్వారా సాంగ్ యాడ్ చేయవచ్చని టిప్‌స్టర్ తెలిపారు.
సింగిల్ క్లిక్‌తో బ్లాక్
తాజాగా ఇన్‌స్టాగ్రామ్ సెక్యూరిటి ఫీచర్‌ను కూడా అప్‌గ్రేడ్ చేసింది. ఇన్‌స్టాగ్రామ్ యూజర్లలందరూ ఇప్పుడు ఒక వ్యక్తికి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అక్కౌంట్స్ ని బ్లాక్ చేయవచ్చని తెలిపింది. ఇన్‌స్టాగ్రామ్ గత సంవత్సరంలో యూజర్ల అక్కౌంట్ ను బ్లాక్ చేసే సదుపాయాన్ని అందించింది, అలాగే ఎవరైనా అదే సమయంలో కొత్త అక్కౌంట్ క్రియేట్ చేసినట్లయితే అది కూడా బ్లాక్ చేయబడుతుందని తెలిపింది.