Asianet News TeluguAsianet News Telugu

ట్విట్టర్ కి పొట్టిగా ఇండియన్ యాప్.. తొలగించిన ఉద్యోగులను తీసుకోవాలని కోరుతు.. ట్వీట్..

స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ ప్రపంచవ్యాప్తం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో కూ సహ వ్యవస్థాపకుడు అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్రమేయ రాధాకృష్ణ, కూ త్వరలో యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభించబడుతుందని తెలిపారు.

Indias Twitter rival Koo wants to hire ex Twitter employees fired by Elon Musk
Author
First Published Nov 19, 2022, 3:32 PM IST

మైక్రో బ్లాగ్గింగ్ సైట్ ట్విట్టర్ ఉద్యోగాల తొలగింపు లేదా ఉద్యోగులు స్వచ్ఛందంగా కంపెనీ నుండి వెళ్లిపోయిన సంగతి మీకు తెలిసిందే. బిలియనీర్, టెస్లా అధినేత ఎలోన్ మస్క్ కొన్ని వారాల క్రితం ట్విట్టర్ ని కొనుగోలు చేసిన తర్వాత ఈ పరిస్థితి గందరగోళంగా మారింది. దీంతో ఇప్పుడు ట్విట్టర్ భారతీయ ప్రత్యర్థి Koo యాప్ ఈ ఆవకాశాన్ని పూర్తిగా ఉపయోగించుకోవాలనుకుంటుంది  అంతేకాదు యాప్ ని ప్రోమోట్ చేస్తోంది. ట్విట్టర్ నుండి Kooకి మారేందుకు ప్రజలను ఒప్పించే లక్ష్యంతో కొత్త ఫీచర్లను తీసుకొస్తుంది. కూ సహ వ్యవస్థాపకుడు, మయాంక్ బిదవత్కా మాట్లాడుతూ మా టీంలో చేరడానికి వ్యక్తుల కోసం చూస్తున్నానని, ముఖ్యంగా ఎలోన్ మస్క్ తాజాగా తొలగించిన వారిని కోసం అని అన్నారు.

నియామక ప్రణాళిక ప్రకటనపై  మయాంక్  బిడవత్కా ట్విట్టర్‌లో “#RIPTwitter అండ్ దీనికి సంబంధించిన #గోయింగ్ డౌన్ చూసి చాలా బాధగా ఉంది. మేము ఈ Twitter మాజీ ఉద్యోగులలో కొందరిని నియమించుకుంతము. వారి ప్రతిభకు విలువనిచ్చే చోట వారు పని చేసేందుకు అర్హులు. మైక్రోబ్లాగింగ్ అనేది ప్రజల శక్తికి సంబంధించినది, అణచివేత కాదు, ”అంటూ ఒక ట్వీట్‌లో పేర్కొన్నాడు.

స్వదేశీ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫారమ్ కూ ప్రపంచవ్యాప్తం కావడానికి సిద్ధంగా ఉంది. ఈ వారం ప్రారంభంలో కూ సహ వ్యవస్థాపకుడు అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ అప్రమేయ రాధాకృష్ణ, కూ త్వరలో యునైటెడ్ స్టేట్స్‌లో ప్రారంభించబడుతుందని తెలిపారు. “నమ్మండి! ఇది మన క్షణం! రాక్ చేద్దాం. యూఎస్‌లో మీకు తెలిసిన ప్రతి ఒక్కరికీ కూ గురించి తెలియజేయండి' అని రాధాకృష్ణ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంకా బంగ్లాదేశ్, ఫిలిప్పీన్స్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాతో సహా చాలా ఇతర దేశాలలో కూడా ట్విట్టర్ పోటీగా కూ ప్రారంభించబడుతుందని ఒక ఇంటర్వ్యూలో చెప్పారు.

Koo యాప్ ని 2020 సంవత్సరంలో ప్రారంభించారు ఇంకా ఈ నెల ప్రారంభంలో ఈ యప్ప్ 50 మిలియన్ డౌన్‌లోడ్‌లను దాటినట్లు కంపెనీ తెలిపింది. ట్విట్టర్ ఇండియా ఆల్టేర్నేటివ్ Koo యాప్ ప్రస్తుతం దేశంలో హిందీ, కన్నడ, మరాఠీ, బంగ్లా, తమిళం, తెలుగు, గుజరాతీతో సహా 10 ప్రాంతీయ భాషలలో అందుబాటులో ఉంది.

ప్రస్తుతం ట్విట్టర్‌లోని పరిస్థితులను కూ యాప్ పూర్తిగా సద్వినియోగం చేసుకుంటోంది. నేటి విషయానికొస్తే, ఎలోన్ మస్క్ ప్రతి ఒక్కరికీ "హార్డ్‌కోర్" వర్క్ కల్చర్ కి సిద్ధంగా ఉండేందుకు "అల్టిమేటం" ఇమెయిల్ పంపిన తర్వాత చాలా మంది ట్విట్టర్ ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు రాజీనామా చేశారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios