ఓటరు లిస్ట్ లో మీ పేరు మిస్ అయ్యిందా లేదా తొలగించారా.. మీ ఫోన్ నుండి ఇలా చెక్ చేయండి..
ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉందో, కట్ అయిందో తెలుసుకోవాలంటే ముందుగా మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లో www.nvsp.in అని టైప్ చేసి క్లిక్ చేయండి . తరువాత నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ ఓపెన్ అవుతుంది.
ప్రతిఏడాది ఎక్కడో ఒకచోట ఎన్నికలు జరిగే దేశం భారతదేశం. ఎన్నికల సమయంలో ఓటరు లిస్టులోనో పేరు ఉంటేనే ఓటు వేయగలం. గత ఎన్నికల సమయంలో ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉన్నప్పటికి ప్రస్తుత ఎన్నికల్లో పేరు కట్ అయినట్లు చాలా సార్లు జరుగుతుంది. కాబట్టి ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉందో లేదో ఇంట్లో కూర్చొని మీ మొబైల్‌లో చెక్ చేసుకోవచ్చు, ఎలా అంటే...
ఓటరు లిస్ట్ లో మీ పేరు ఉందో, కట్ అయిందో తెలుసుకోవాలంటే ముందుగా మీ ఫోన్ లేదా ల్యాప్‌టాప్ బ్రౌజర్‌లో www.nvsp.in అని టైప్ చేసి క్లిక్ చేయండి . ఇప్పుడు నేషనల్ ఓటర్ సర్వీస్ పోర్టల్ మీ ముందు ఓపెన్ అవుతుంది.
ఇప్పుడు ఎడమ వైపున ఒక సెర్చ్ బాక్స్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయడం ద్వారా http://electoralsearch.in URL ఉన్న కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఇక్కడ మీరు ఓటరు లిస్ట్ లో మీ పేరును రెండు విధాలుగా చెక్ చేయవచ్చు. మొదటి పద్ధతి ఏంటంటే మీరు పేరు, తండ్రి లేదా భర్త పేరు, వయస్సు, రాష్ట్రం, లింగం, జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గం పేరును ఎంటర్ చేయడం ద్వారా చెక్ చేసుకోవచ్చు.
పేరు ద్వారా వెతకడానికి బదులుగా ఓటర్ ఐడి కార్డ్ సీరియల్ నంబర్ ద్వారా వెతకడం మరొక మార్గం. దీని కోసం మీరు ఈ పేజీలో ఒక ఆప్షన్ చూస్తారు. ఓటరు గుర్తింపు కార్డు సీరియల్ నంబర్ సహాయంతో పేరును సెర్చ్ చాలా సులభం, ఎందుకంటే పాత పద్ధతిలో మీరు చాలా విషయాల గురించి సమాచారాన్ని ఇవ్వాలి. అంతేకాదు బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ప్రజలకు మెసేజ్ సౌకర్యం కూడా ఉంది.
బీహార్, ఆంధ్రప్రదేశ్ అండ్ తమిళనాడు ప్రజలు మెసేజ్ పంపడం ద్వారా వోటర్ లిస్ట్ లో మీ పేరును చెక్ చేయవచ్చు. దీని కోసం ELE తర్వాత 10 అంకెల ఓటరు ID నంబర్‌ను టైప్ చేసి 56677కు ఎస్‌ఎంఎస్ పంపండి. ఉదాహరణకు ELE TDA1234567 అని టైప్ చేసి 56677కి పంపాలి. మెసేజ్ పంపినందుకు చార్జ్ చేయబడుతుంది.