Asianet News TeluguAsianet News Telugu

ప్యాంట్ జిప్ ఓపెన్ చేస్తే మొబైల్ ఫోన్‌కి అలర్ట్ మెసేజ్..! మార్కెట్‌లోకి స్మార్ట్ ప్యాంట్‌లు..

మీరు ఆశ్చర్యపోతున్నారా ! మరి ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా! కానీ ఈ అద్భుతమైన ప్యాంటు మన వార్డ్‌రోబ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. ఈ ప్యాంట్‌ల గురించిన చర్చలు ప్రతిచోటా సందడి చేస్తున్నాయి,
 

If  pants zip is open, then alert message will come to  mobile phone! Smart pants have arrived in the market-sak
Author
First Published Jul 13, 2023, 8:07 PM IST

చాలా సార్లు ఆతృతలో లేదా తొందరలో ప్యాంటు జిప్‌ పెట్టుకోవడం మర్చిపోతుంటారు, ఈ కారణంగా బహిరంగంగా ఒకోసారి ఇబ్బంది లేదా సిగ్గు  పడవలసి వస్తుంది. కానీ ఇప్పుడు మీరు అలా ఇబ్బంది   పడాల్సిన అవసరం లేదు. ఇప్పటి వరకు మీరు స్మార్ట్ టెక్నాలజీ డివైజెస్  విని ఉంటారు ఇంకా  ఉపయోగించి ఉంటారు, అయితే మీరు ఎప్పుడైనా స్మార్ట్ ప్యాంటు గురించి విన్నారా ?

మీరు ఆశ్చర్యపోతున్నారా ! మరి ఇది ఎలా సాధ్యం అని ఆలోచిస్తున్నారా! కానీ ఈ అద్భుతమైన ప్యాంటు మన వార్డ్‌రోబ్‌ను మరింత స్మార్ట్‌గా మారుస్తాయి. ఈ ప్యాంట్‌ల గురించి చర్చలు ప్రతిచోటా సందడి చేస్తున్నాయి,

మనం ఇప్పటికే స్మార్ట్ టీవీలు, స్మార్ట్ వాచీలు, స్మార్ట్ గ్లాసెస్ గురించి విన్నాము, ఇప్పుడు స్మార్ట్ టెక్నాలజీతో కూడిన ప్యాంట్లు మార్కెట్లోకి వస్తున్నాయి, అవి జిప్ తెరిచినప్పుడు ఫోన్‌లో మీకు నోటిఫికేషన్ పంపుతాయి, ఆ తర్వాత మీరు మీ జిప్‌ను మూసివేయవచ్చు. ఒక ట్విట్టర్ యూజర్  వీడియో ప్రకారం, జిప్ డౌన్ అయినప్పుడు మీ స్మార్ట్‌ఫోన్‌లో నోటిఫికేషన్ వస్తుంది.

ఈ ప్యాంటు మిమ్మల్ని ఇబ్బందిలో పడకుండా కాపాడుతుంది
గై డ్యూపాంట్ అనే  ట్విట్టర్ యూజర్ పోస్ట్ చేసిన వీడియోలో  ప్యాంట్‌ని అన్‌జిప్ చేసిన వెంటనే, అతని ప్యాంట్‌లోని సెన్సార్‌లు ఫ్లై డౌన్ అయిందని గుర్తించి అతనికి ఫ్లై డౌన్ అయిందని అతనికి తెలియజేసే నోటిఫికేషన్ వస్తుంది.  

ప్యాంట్‌లను జిప్ చేయడం మరచిపోయే ఏ సామాన్యుడికైనా ఇది బాగా ఉపయోగపడుతుంది. జిప్ తెరిచి ఉంటే మొబైల్ నోటిఫికేషన్ వ్యక్తిని అలర్ట్ చేస్తుంది.  ట్వీట్ ప్రకారం, అతను హాల్ ఎఫెక్ట్ సెన్సార్‌కు కొన్ని సేఫ్టీ పిన్‌లను జోడించాడు. హాల్ ఎఫెక్ట్ సెన్సార్ కొన్ని సెకన్ల పాటు ఆన్‌లో ఉన్నప్పుడు నోటిఫికేషన్‌లను పంపుతుంది.

స్మార్ట్ ప్యాంటు లభ్యత
ప్రస్తుతానికి, మీరు ఈ ప్యాంట్‌ని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ స్టోర్‌లలో లేదు. ఈ ప్యాంట్‌లను ట్విట్టర్ యూజర్ తన స్నేహితుడి కోసం తయారు చేశాడు, ఇది ప్రాజెక్ట్ లాగా ఉంది. భవిష్యత్తులో మీరు అలాంటి స్మార్ట్ టెక్నాలజీని చూసే అవకాశం ఉంది.

అయితే మరోక విషయం ఏమిటంటే దానిలో ఒక లోపం ఉందని ఇది ఇతర ప్యాంటుల లాగా  కడగడం సాధ్యం కాదు, ఎందుకంటే దానిలోని  సెన్సార్లు దెబ్బతినవచ్చు. అలాగే, ఎప్పుడూ మొబైల్‌కి కనెక్ట్ కావడం వల్ల ఎక్కువ బ్యాటరీ ఖర్చవుతుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. 
 

Follow Us:
Download App:
  • android
  • ios