హువాయ్ కొత్త స్మార్ట్ వాచ్.. 1.5-అంగుళాల డిస్‌ప్లేతో 100 మీటర్ల నీటిలో పడిన పాడవదు..
హువాయ్ వాచ్ అల్టిమేట్ ధర 5,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ.72,000. Huawei వాచ్ అల్టిమేట్ ప్రస్తుతం UK, యూరప్ ఇంకా చైనాలో అందుబాటులో ఉంది. ఇతర దేశాలలో దీని లాంచ్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.
చైనీస్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హువాయ్ కొత్త స్మార్ట్ వాచ్ హువాయ్ వాచ్ అల్టిమేట్‌ను లాంచ్ చేసింది. దీనితో పాటు హువాయ్ ఈ ఈవెంట్‌లో హువాయ్ Mate X3ని కూడా పరిచయం చేసింది. హువాయ్ వాచ్ అల్టిమేట్‌కు సంబంధించి కంపెనీ అత్యుత్తమ స్పెసిఫికేషన్‌లను క్లెయిమ్ చేసింది. హువాయ్ వాచ్ అల్టిమేట్ గురించి చెప్పాలంటే 100 మీటర్ల లోతు నీటిలోకి వెళ్లినా వాచ్ చెడిపోదని కంపెనీ తెలిపింది. హువాయ్ వాచ్ అల్టిమేట్ ఆపిల్ వాచ్ Ultraకి పోటీగా వస్తుంది.
హువాయ్ వాచ్ అల్టిమేట్ ధర
హువాయ్ వాచ్ అల్టిమేట్ ధర 5,999 చైనీస్ యువాన్ అంటే దాదాపు రూ.72,000. Huawei వాచ్ అల్టిమేట్ ప్రస్తుతం UK, యూరప్ ఇంకా చైనాలో అందుబాటులో ఉంది. ఇతర దేశాలలో దీని లాంచ్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.
Huawei వాచ్ అల్టిమేట్ స్పెసిఫికేషన్లు
హువాయ్ వాచ్ అల్టిమేట్ కి 60Hz రిఫ్రెష్ రేట్‌తో 5-అంగుళాల LTPO AMOLED డిస్‌ప్లే ఉంది. ఈ వాచ్‌లో జిర్కోనియం లిక్విడ్ మెటల్ కేస్ ఉంది. అంతేకాకుండా, హైడ్రోనేటెడ్ నైట్రైల్ రబ్బరు పట్టీ ఇచ్చారు. దీనితో సిరామిక్ బెజెల్ ఉంటుంది.
Huawei వాచ్ అల్టిమేట్ లో 530mA బ్యాటరీ ఇచ్చారు. ఈ బ్యాటరు 14 రోజుల బ్యాకప్ ఇస్తుందని కంపెనీ క్లెయిమ్ చేస్తుంది, అయితే భారీ వినియోగంలో బ్యాటరీ 8 రోజుల పాటు ఉంటుంది. దీనికి ఫాస్ట్ ఛార్జింగ్ ఉంది అంటే 60 నిమిషాల్లో బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ చేయబడుతుందని పేర్కొంది. ఇంకా వైర్‌లెస్ ఛార్జింగ్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. హెల్త్ ఫీచర్లు చూస్తే Huawei Watch Ultimateలో హార్ట్ బీట్ మానిటర్, ECG, బ్లడ్ ఆక్సిజన్ మానిటర్ వంటి సెన్సార్ ఉంది.
ఈ వాచ్ ISO 22810 వాటర్ రెసిస్టెంట్ రేటింగ్ పొందింది. దీనిని 110 మీటర్ల నీటి లోతులో 24 గంటల పాటు పరీక్షించారు. దీనికి డ్యూయల్ ఫ్రీక్వెన్సీ GNSS పొజిషనింగ్ ఉంది.