Asianet News TeluguAsianet News Telugu

హెచ్‌టి‌సి ఎంట్రీ లెవెల్ 4జి స్మార్ట్‌ఫోన్.. తక్కువ ధరకే బెస్ట్ ఫీచర్లతో లాంచ్..

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్  సింగిల్ వేరియంట్ 2జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్ తో లభిస్తుంది. దీని ధర 7,990 రష్యన్ రూబుల్స్ అంటే దాదాపు రూ.11,000. హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్‌ను బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. 

HTC Wildfire E Plus smartphone launched, will get good features at a low price
Author
First Published Oct 29, 2022, 1:27 PM IST

తైవాన్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ కంపెనీ హెచ్‌టి‌సి కొత్త ఎంట్రీ లెవల్ ఫోన్ హెచ్‌టి‌సి వైల్డ్ ఫైర్ ఈ  ప్లస్ ని రష్యాలో లాంచ్ చేసింది. హెచ్‌టి‌సి వైల్డ్ ఫైర్ ఈ  ప్లస్ రష్యా ఇ-కామర్స్ సైట్‌లో కూడా లిస్ట్ చేయబడింది. హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్ వాటర్‌డ్రాప్ నాచ్ స్టైల్ సెల్ఫీ కెమెరాతో 6.5-అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లే,  అండ్రాయిడ్ 12గో ఎడిషన్‌తో కూడిన 4జి స్మార్ట్‌ఫోన్.

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్ ధర
హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్  సింగిల్ వేరియంట్ 2జి‌బి ర్యామ్, 32జి‌బి స్టోరేజ్ తో లభిస్తుంది. దీని ధర 7,990 రష్యన్ రూబుల్స్ అంటే దాదాపు రూ.11,000. హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్‌ను బ్లాక్ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. భారతీయ మార్కెట్లో హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్ లాంచ్ గురించి ప్రస్తుతానికి ఎటువంటి సమాచారం లేదు.

హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్ స్పెసిఫికేషన్‌లు
హెచ్‌టిసి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్ 720x1600 పిక్సెల్‌ రిజల్యూషన్‌తో 6.5-అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లే ఇచ్చారు. ఆండ్రాయిడ్ 12గో ఎడిషన్ ఈ ఫోన్‌లో లభిస్తుంది. అంతేకాకుండా MediaTek MT6739 ప్రాసెసర్ ఇందులో ఇచ్చారు. ఈ ఫోన్ 2జి‌బి ర్యామ్ తో 32జి‌బి స్టోరేజ్ పొందుతుంది.

హెచ్‌టి‌సి వైల్డ్‌ఫైర్ ఇ ప్లస్  13 మెగాపిక్సెల్‌ ప్రైమరీ లెన్స్, 5 మెగాపిక్సెల్‌ రెండవ లెన్స్‌తో డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌  ఇచ్చారు. ముందుభాగంలో 5 మెగాపిక్సెల్ కెమెరా లభిస్తుంది. ఫోన్ మొత్తం బరువు 190 గ్రాములు. 10W ఛార్జింగ్ సపోర్ట్‌తో 5150mAh బ్యాటరీ అందించారు. Wi-Fi, బ్లూటూత్ v4.2, టైప్-సి పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌  అందించారు.
 

Follow Us:
Download App:
  • android
  • ios