ప్రముఖ ల్యాప్‌టాప్, డెస్క్‌టాప్, ప్రింటర్ తయారీ సంస్థ హెచ్‌పి భారతీయ మార్కెట్లో ఒక కొత్త ల్యాప్‌టాప్‌ను విడుదల చేసింది. హెచ్‌పి క్రోమ్ బుక్ 11ఏ పేరుతో వస్తున్న ఈ  ల్యాప్‌టాప్ స్కూల్ పిల్లల కోసం ప్రత్యేకంగా ప్రవేశపెట్టిన బడ్జెట్ ల్యాప్‌టాప్. హెచ్‌పి క్రోమ్ బుక్ 11ఏ లో మీడియా టెక్ ఎం‌టి 8183 ఆక్టా-కోర్ ప్రాసెసర్ అందించారు.

ల్యాప్‌టాప్‌లోని వాయిస్ అసిస్టెంట్ గూగుల్ అసిస్టెంట్‌కు సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్‌టాప్‌తో ఒక సంవత్సరం పాటు గూగుల్ వన్  ఉచిత సభ్యత్వాన్ని పొందవచ్చు, దీని ద్వారా మీకు 100జి‌బి క్లౌడ్ స్టోరేజ్ అందుబాటులో ఉంటుంది. హెచ్‌పి క్రోమ్‌బుక్ 11ఎ ధర రూ .21,999, దీనిని ఇండిగో బ్లూ కలర్‌లో కొనుగోలు చేయవచ్చు. ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ ద్వారా మాత్రమే  ప్రత్యేకంగా విక్రయిస్తున్నారు.

also read  జియో ప్లాన్స్ పై సూపర్ ఆఫర్: ఆన్ లిమిటెడ్ కాల్స్ తో పాటు 30 రోజుల వాలిడిటీ ఫ్రీ.. ...

హెచ్‌పి క్రోమ్ బుక్ 11ఏలో  క్రోమ్ ఓఎస్  అందించారు. దీనికి గూగుల్ ప్లే స్టోర్‌ సపోర్ట్ కూడా ఉంది. ఈ ల్యాప్‌టాప్ కి 11.6 అంగుళాల హెచ్‌డి డిస్‌ప్లే, 220 నిట్‌ల బ్రైట్ నెస్  తో 1366x768 పిక్సెల్‌ల రిజల్యూషన్‌,  మీడియాటెక్ ఎం‌టి8183 ప్రాసెసర్ తో వస్తుంది, అంటే ఆక్టా-కోర్ ప్రాసెసర్. దీనికి 4 జీబీ ర్యామ్‌తో 64 జీబీ స్టోరేజ్, 100 జీబీ గూగుల్ వన్ క్లౌడ్ స్టోరేజ్ లభిస్తుంది. స్టోరేజ్ 256 జీబీ వరకు  కూడా పెంచుకోవచ్చు.

ఈ హెచ్‌పి ల్యాప్‌టాప్‌లో 37WHr బ్యాటరీ ఉంది, ఇది 16 గంటల బ్యాకప్ కోసం క్లెయిమ్ చేయబడింది. కనెక్టివిటీ కోసం దీనికి యూ‌ఎస్‌బి టైప్-ఎ, టైప్-సి పోర్ట్ ఉన్నాయి. అలాగే ఆడియో జాక్ కూడా ఉంటుంది. ఇంకా బ్లూటూత్ వి5, వై-ఫై 5 ఉన్నాయి. ఆన్ లైన్ క్లాసెస్ కోసం హెచ్‌పి ట్రూ విజన్ హెచ్‌డి వెబ్‌క్యామ్ కూడా ఉంది.